Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM GVMC DEMOLISHES TDP LEADER PALLA SRINIVASA RAO BUILDING IN VISAKHAPATNAM NGS VZM

Andhra Pradesh: పిలిచినప్పుడు వెళ్లలేదనే వేధింపులు. ఎంపీ విజయసాయిపై సంచలన ఆరోపణలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

ఏపీలో పొలిటికల్ వార్ పీక్ కు చేరింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ నేతలే టార్గెట్ గా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వేధింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన మాట వినని వారిని ఇలా వేధింపులకు గురిచేస్తున్నారంటూ టీడీపీ నేత ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
  విశాఖలో రాజకీయ దుమారం చెలరేగింది. రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి తనపై వేధింపులకు దిగుతున్నారని టీడీపీ నేత ఆరోపించారు. తనని వైసీపీలో చేరమని గతంలో పిలిచినప్పుడు వెళ్లలేదని.. అది మనసులో పెట్టుకున్న ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాను అన్నారు. అసలు ఏం జరిగిదంటే. విశాఖపట్నంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిపారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎కు చెందిన బిల్డింగ్‎ను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేసింది.

  ఈ కూల్చివేతపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరింది. తన బిల్డిండ్ కూల్చివేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పల్లా శ్రీనివాస్. తన బిల్డింగ్ కూల్చడానికి కారణం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డే అని ఆరోపించారు. గతంలో వైసీపీలోకి రావాలని.. ఆ విషయం మాట్లాడేందుకు ఆయన పిలిచారని.. అయితే తాను వైసీపీలోకి రానని చెప్పినందుకే.. కక్షకట్టి తన భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు. విజయసాయి ప్రోద్భలంతోనే తనపై కక్ష సాధింపుకు పాల్పడ్డారు. తన భవనాన్ని కూల్చి విజయ సాయిరెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. తాను అన్ని అనుమతులు తీసుకుని భవన నిర్మాణం చేపట్టాను అన్నారు.  ఉల్లంఘనలకు పాల్పడకపోయినా కూల్చివేయడం దారుణమన్నారు. ఈ విషయంపై ఏ దేవుడు ముందు ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు పల్లా.

  ప్రజల ప్రాణాలను గాలికొదిలి ప్రతిపక్ష నేతల భవనాలు కూల్చే పనిలో జగన్ బిజీగా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనం కూల్చివేతపై స్పందించిన ఆయన వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి కార్మికుల పక్షాన నిలిచినందుకే పల్లా శ్రీనివాస్‌పై కక్ష చర్యలకు దిగారన్నారు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారనే అక్కసుతోనే.. పల్లా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కనీసం నోటీసు ఇవ్వకుండా, చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధవాతవరణంలో భవనాన్ని కూల్చివేయడాన్ని, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి జేసీబీ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ టీడీపీలో లేరన్నారు.

  వైసీపీ ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలి, పనిదినాల్లో అక్రమాలు, సెలవుదినాల్లో విధ్వంసాలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇంట్లో మనుషులు లేని సమయం చూసి దొంగలు పడ్డట్టు కోర్టు సెలవు రోజుల్లోనే జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష్య పూరితంగా టీడీపీ నేతల ఇల్లు, భవనాలు కూల్చివేస్తోందని మండిపడ్డారు. విశాఖలో టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున దొంగల్లా వచ్చి భవనాన్ని కూల్చడం దారుణమన్నారు. విద్వేషం, విధ్వంసం లేకుండా వైసీపీకి ఉనికి లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ప్రజా వేదిక మొదలు ప్రతిపక్ష నేతల ఇళ్లు ఎన్ని కూల్చారో లెక్కేలేదన్నారు.

  ఇటు టీడీపీ నేతల విమర్శలకు వైసీపీ విశాఖ నేతలు ఘాటుగా కౌంటర్ర్ ఇస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో విలువైన భూములను దోచుకున్నారని.. అక్రమాలకు పాల్పడ్డారని. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి అంటున్నారు. టీడీపీ నేతల కబ్జాలను, అక్రమ నిర్మాణాలను వదిలి పెట్టే ప్రసక్తే లేదంటున్నారు వైసీపీ నేతలు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kinjarapu Atchannaidu, Nara Lokesh, Tdp, Vijayasai reddy, Visakha, Visakhapatnam, Vizag, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు