GUTKA MAFIA: విశాఖ జిల్లాలో పెద్ద మొత్తంలో నిషేదిత గుట్కా ప్యాకెట్లు,ఒడిషా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. కోట్ల విలువ చేసే గుట్కా, మద్యం కాటన్స్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులకు చిక్కారు కేటుగాళ్లు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర ఇప్పుడు అక్రమాలకు, అసాంఘీక కార్యకలాపాలకు నెలవుగా మారుతోందనే సంకేతాలు వస్తున్నాయి. గతంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ, పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం గంజాయి, గుట్కా, అక్రమ మద్యం రవాణాకు సెంటర్ పాయింట్‌గా మారినట్లు కనిపిస్తోంది. విశాఖపట్నం(Visakhapatnam)జిల్లా సింహాచలం(Simhachalam)లో అక్షరాల రెండు కోట్ల రూపాయల(2 crores)విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, 10లక్షల (10lakhs)విలువైన ఒడిషా (Odisha)మద్యం బాటిళ్లను డీసీఎఫ్ పోలీసులు(DCF Police) పట్టుకున్నారు. అడవి వరం జంక్షన్ (Adavivaram junction)దగ్గర ఏపీ 31డీసీ 0405(AP31 DC0405) నెంబర్ కలిగిన కారును తనిఖీ చేశారు. కారులో మద్యం బాక్సుల్ని తరలిస్తున్నట్లుగా పక్కా సమాచారం రావడంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు తన బృందం 10లక్షల రూపాయల విలువైన ఒడిషా మద్యం బ్యాక్సులను పట్టుకున్నారు. ఈకేసు విచారణలో భాగంగానే ఏపీ 31 టీఏ 6678(AP31 TA6678) నెంబర్‌తో ఉన్న లారీని పట్టుకోవడంతో అందులో 209 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సుమారు ఏడు లక్షల 24వేల 840రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
సాగరతీరంలో గుట్కా మాఫియా..
విశాఖ జిల్లా సింహాచలంలో పట్టుబడిన మద్యం కేసులో తీగ లాగితే అక్రమార్కుల డొంక కదిలింది. కేసులో పట్టుబడిన వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఓ గోడౌన్ని తనిఖీ చేశారు.య అందులో రెండు కోట్ల రూపాయలు విలువగల గుట్కా, కైని ప్యాకెట్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. విశాఖ జిల్లా డి. సి ఎఫ్ పోలీసులు పట్టుకున్న గుట్కా, మద్యం కాటన్ బాక్సుల్లో మద్యం బాటిల్స్‌ను రాయగడ సంబంధించిన రవి అనే కొనుగోలు చేసుకునే వ్యక్తిగా గుర్తించారు.
(విశాఖలో గుట్కా, మద్యం సీజ్)
అక్రమ మద్యం పట్టివేత ..
ఉత్తరాంధ్ర జిల్లాల్లో గుట్కా, గంజాయి, మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈమధ్య కాలంలోనే విజయనగరం జిల్లాలో రెండు వేల 50కేజీల గంజాయి పట్టుబడటంతో అధికారులు ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వాహనాల్లో ఏమి తరలిస్తున్నారన్న దానిపై నిఘా పెట్టారు. అందులో భాగంగానే విశాఖ జిల్లాలో బుధవారం కోట్ల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయని పోలీసులు చెబుతున్నారు.
నిఘా కట్టుదిట్టం..
గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు పరివర్తన కార్యక్రమం నిర్వహించిన అధికారులు..ఇకపై గుట్కా, మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.