Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM GURRALA ROAD IN NARSIPATNAM REASON BEHIND THAT NAME VSJ NJ ABH

Vizag: బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే గుర్రాలు కట్టేసేవారట..! మరి ఆ ప్రాంతం ఇప్పుడెలా ఉంది..?

బ్రిటిష్

బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే గుర్రాలు కట్టేవారట..!

బ్రిటిషర్లు మన దేశాన్ని పాలించిన రోజుల్లో విశాఖ ఏజెన్సీ ఏరియాలో అనేక ప్రాంతాలు తిరిగేవారు. అప్పట్లో బ్రిటీష్ వాళ్లు ఎక్కువగా గుర్రాలను ఉపయోగించేవారు. దానిలో భాగంగానే నర్సీపట్నంలో బ్రిటిష్ వారు గుర్రాలు కట్టే ప్రాంతాన్ని గుర్రాలు రోడ్డుగా పిలిచేవారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    (Setti Jagadesh, News 18, Vizag)

    బ్రిటిషర్లు మన దేశాన్ని పాలించిన రోజుల్లో విశాఖ ఏజెన్సీ ఏరియాలో అనేక ప్రాంతాలు తిరిగేవారు. అప్పట్లో బ్రిటీష్ వాళ్లు ఎక్కువగా గుర్రాలను ఉపయోగించేవారు. దానిలో భాగంగానే నర్సీపట్నంలో బ్రిటిష్ వారు గుర్రాలు కట్టే ప్రాంతాన్ని గుర్రాలు రోడ్డుగా పిలిచేవారని స్థానికులు చెబుతున్నారు.

    1922 ప్రాంతంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కొల్లగొట్టింది ఈ పట్టణంలోని పోలీస్ స్టేషన్‌నే అని అందరికి తెలిసిందే. బ్రిటిష్‌కాలం నాటి బిల్డింగ్‌లు ప్రస్తుత ఎమ్.ఆర్.ఓ ఆఫీస్, సబ్ కలెక్టర్ బంగ్లా , ఏ.ఎస్.పి బంగ్లా చారిత్రక చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి.. అప్పటినుండి ఇప్పటివరకు ఆ భవనాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి.

    ప్రస్తుతం నర్సీపట్నంలో బ్రిటిష్ వారి కట్టిన భవనాలన్నింటిని ప్రభుత్వ కార్యకలాపాల భవనాలుగా ఉపయోగిస్తున్నారు. అప్పట్లో బ్రిటిష్ వారు నర్సీపట్నం నుండి పరిపాలన చేస్తూ, ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క కార్యకలాపాలు చేసేవారు. వాటికి కొన్ని పేర్లు పెట్టేవారు అలా ఏర్పడినదే ఈ గుర్రాల రోడ్డు అంటున్నారు స్థానికులు.

    బ్రిటిష్ వాళ్లు పరిపాలలో భాగంగా అనేక ప్రాంతాలు తిరిగేవారు.. అప్పట్లో రవాణాసాధన కోసం ఎక్కువగా గుర్రాలు ఉపయోగించేవారు. దానిలో భాగంగానే నర్సీపట్నంలో బ్రిటిష్ వాళ్లు గుర్రాలు కట్టే ప్రాంతాన్ని గుర్రాలు రోడ్డుగా అనేవారు అని స్థానికులు నానుడి.

    పూర్వం చింతపల్లి, సీలేరు, పాడేరు, మొదలైన మన్యపు ప్రాంతాలలో ఎక్కడికి వెళ్ళాలన్నా నర్సీపట్నం మీదుగానే వెళ్ళవలసి వచ్చేది. ఇక్కడ రెవెన్యు డివిషనల్ ఆఫీసు ఉండేది. బ్రిటిష్ వాళ్లు ఈ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి మళ్లీ నర్సీపట్నం చేరుకునేవారు. అప్పట్లో పెద్దగా వాహనాలు ఏమీ లేవు.. దాంతో గుర్రాల మీద ఎక్కువగా తిరిగేవారు. అయితే వీటికంటూ ఓ ప్రత్యేక గుర్రాలు శాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసి సి.బి.ఎం కాంపౌండ్ వద్ద గుర్రాలను గట్టి మేపేవారు. ఖాళీ సమయంలో గుర్రాల స్వారీ చేస్తుండేవారు.



    అప్పటిలో ఎప్పుడు గుర్రాలతో బిజీగా ఉండే ఈ ప్రాంతాన్ని గుర్రాలు రోడ్డు అని పిలుచుకునే వారు అట.. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయినా…ఆ గుర్రాలు రోడ్డు పెరు మాత్రం పోలేదు..అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని అదే పేరుతో పిలుస్తున్నారు.

    అప్పట్లో అంటే గుర్రాలకోసం అంటూ ప్రత్యేకంగా విశాలంగా గ్రౌండ్లను ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. ఇక్కడంతా ఇప్పుడు ఇళ్లు, గవర్నమెంట్‌ ఆఫీస్‌లు వెలిశాయి. సాధారణ ప్రజలు తమ ఇళ్లను కట్టుకుని జీవిస్తున్నారు. కాకపోతే అప్పటి నుంచి వాడుకలో ఉన్న గుర్రాల రోడ్డుగానే ఇప్పటికీ పిలుస్తున్నారు.

    అడ్రస్ : గుర్రాల రోడ్డు, పీనార పాలెం సెంటర్‌, నర్సీపట్నం, అల్లూరిసీతారామరాజు జిల్లా- 531116

    ఎలా వెళ్లాలి..? నర్సీపట్నం కాంప్లెక్స్ నుండి చింతపల్లి రోడ్డు మార్గంలో పీనార పాలెం సెంటర్ వద్ద ఈ రోడ్డు చూడవచ్చు. బస్సు ఆటో సౌకర్యం ఉంటుంది.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Visakhapatnam, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు