ఆరుగాలం కష్టపడిన రైతన్నలు… పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక అప్పులపాలవుతున్నారు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్యహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో చూసి ఉంటాం.. కానీ రైతన్నలు కూడా సరైన అవగాహన లేక వేసిన పంటలే వేసి…నష్టపోతు ఉంటారు. అలాంటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు గుంటూరు(Guntur)జిల్లా మిర్చి రైతులు. పంటల్లో మెళుకువలు పాటిస్తూ ఎర్రబంగారంలో లాభాలను రుచి చూస్తున్నారు. మరికొందరు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.మిర్చి రైతుల సక్సెస్ స్టోరీ సీక్రెట్ ఇదే..!
మెళుకులు పాటిస్తే ఎర్రబంగారంలో లాభాలే:
తెలుగురాష్ట్రాల్లో ఎర్రబంగారంగా పిలిచుకునే పంట…మిరప.. ఇదే పంటను కొన్ని మెళుకవలు పాటిస్తూ లాభాలను గడిస్తున్నారు.గుంటూరుజిల్లాలోనే కాక అటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ఎటుగరం పేటలో మిరపను పండిస్తూ లాభాలను ఆర్జీస్తున్నారు…రైతు అప్పలనాయుడు. మిగత పంటలతో పోల్చుకుంటే మిరప సాగులోనే అధికలాభాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
గుంటూరు మిరప ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం
గుంటూరు మిరప ఎకరాకి లక్ష రూపాయలు వరకు కూడా ఆదాయం వస్తుందని రైతు అప్పలనాయుడు చెప్తున్నారు. రైతు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎర్రనేలలు మరియు నల్లరేగడి నేలలు ఈ మిరపను సాగుచేస్తే మంచి లాభాలు పొందవచ్చునంటున్నారు. ఈ మిర్చి పంటను వేసేముందు… భూమిలో పోషకాల యొక్క శాతాన్ని పెంచుకోవడానికి రైతులు ముందుగా మినుము పంటను వేసుకొని ఆ భూమిలో కలిసేటట్లు కలియతిప్పాలి. దీనివల్ల భూమికి చాలా సహజ పోషకాలు లభిస్తాయి. 10-15 రోజుల తరువాత ట్రాక్టర్‌తో నేల అంతా మెత్తగా దున్నాలి అవసరమైతే 2-౩ సార్లు దున్నాలి.
మెుక్కల మధ్య దూరంతోనే అధిక రాబడి
మిర్చి నారు మడిలో విత్తనాల మధ్య దూరం ప్రతి మొక్క మొక్క కి ఒక్క అంగుళం దూరం ఉండేలా రైతులు వేసుకోవాలి. మిర్చి మొక్క వయస్సు 35-40 రోజుల మొక్కలను ఈ నేలల్లో నాటుకోవడానికి సిద్ధం చేసుకోవాలి.
మెుక్కల మధ్య దూరం 24x24, 28x28 :
మిర్చి మొక్కలను నీటి వసతి నేలల్లో వేసుకునేప్పుడు మొక్కల సాధారణ దూరాలు 24x24 అంగుళాలు, 28x28 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. అక్కడ నేల స్వభావాన్ని బట్టి వాటి దూరాన్ని ఎంచుకొని మొక్కకు రెండువైపులా అచ్చులుగా దున్నుకోవాలి. ఇలా మొక్కకు రెండువైపులా అచ్చులుగా వెయ్యడం వలన మిరప మొక్కల మధ్య సమాన దూరాలు, కలుపు యంత్రాలకు అనువుగా ఉంటుంది.
Tirumala: ఏప్రిల్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? వసతి టికెట్ల విడుదల
కూలీల ఖర్చు ఆదా:
ఇలా చేయటం ద్వారా కూలీల వినియోగం బాగా తగ్గుతుంది.మిరప మొక్క ఎదుగుదలకు కూడా బాగుంటుంది. ఈ మొక్కలకి డ్రిప్ పద్ధతిలో నాటుకునేటప్పుడు మిరప మొక్కల మధ్య దూరం 30-45 సెం.మీ దూరం అనువైనది అంటున్నారు మిరప రైతులు.
కలుపు నివారణ :
మిరప సాగులో కలుపు నివారణకు మొక్కలు నాటిన 20 నుండి 25 రోజుల తరువాత దున్నాలి. కలుపుకి కూలీలు తక్కువ అవ్వాలి అంటే రెండు వైపులా సాల్లుగా మొక్కలు నాటుకున్న వారికీ మొక్కల మధ్య ఉన్న కలుపు కూడా పోవడం జరుగుతుంది. ఈ మిరప పంటకి డ్రిప్ ద్వారా పంటకు సాగు చేసినప్పుడు ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా వినియోగించడం వల్ల కలుపును బాగా నివారించవచ్చు.
ఎరువులు:
మిరప మొక్కలను నాటిన 20 నుండి 25 రోజులలోపు ఎకరానికి నత్రజని 120 కిలోల వరకు, భాస్వరం 24 కిలోలు వరకు మరియు పోటాష్ 48 కిలోలు వరకు కలుపుకొని బాగా వేసుకోవాలి. మిరప మొక్క పెరుగుదలను బట్టి అక్కడ నత్రజని ఎరువులను అందించాలి,పూత, కాయ,నాణ్యత కోసం పోటాష్ ను 2-౩సార్లు అందిచాలి. వర్షాలు ఎక్కువగా పడుతున్నపుడు మొక్కలుకి చీడ పురుగు పట్టే అవకాశం ఉంటుంది. కావునా వర్షాలు తగ్గక పిచికారి చేయాలని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Guntur, Local News