హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: విజయనగరం జిల్లాలో కొత్త దందా.. రోడ్డుపై వాహనదారులకు చుక్కలు చూసిస్తున్న యువతులు..

Andhra Pradesh: విజయనగరం జిల్లాలో కొత్త దందా.. రోడ్డుపై వాహనదారులకు చుక్కలు చూసిస్తున్న యువతులు..

రోడ్డుపై వాహనదారులకు చుక్కలు చూసిస్తున్న యువతులు

రోడ్డుపై వాహనదారులకు చుక్కలు చూసిస్తున్న యువతులు

మొత్తం 24 మంది యువతులు.. చూడ్డానికి జీన్స్, టీ షర్ట్ లలో అందంగా కనిపిస్తారు. రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఆపి మెల్లిగా మాటలు చెబుతారు.

చూడ్డానికి జీన్స్, టీ షర్ట్ లలో అందంగా కనిపిస్తారు. రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఆపి మెల్లిగా మాటలు చెబుతారు. పేపర్ చూపించి డబ్బులు అడుగుతారు. ఇచ్చే వరకు వదిలిపెట్టరు. ఇలా విజయనగరం జిల్లాలో కొత్త దందా మొదలైంది. వాహనదారులు ఫిర్యాదు చేయడంతో పార్వతీపురం పోలీసులు వాళ్ల ఆట కట్టించారు. వారిని అదుపులోకి తీసుకొని మరోసారి వస్తే కేసులు నమోదు చేస్తామని బెదిరించి సొంత రాష్ట్రానికి పంపేందుకు ఏర్పాటు చేసారు. వివరాలు.. విజయనగరం జిల్లాలో గత కొన్ని రోజులుగా హైవేలపై కొంతమంది యువతులు గుంపులుగా తిరుగుతున్నారు. వారి భాష, యాస కాస్త తేడాగా ఉంది. మొత్తం 24 మంది యువతులు జీన్స్, టీషర్ట్ లు వేసుకొని అందంగా తయారవుతారు. ఇలా ఆరుగురు ఒక గ్రూపులో ఉండేలా 4 గ్రూపులుగా విడిపోయి కొద్ది కొద్ది దూరంలో నిల్చుంటారు. ఒంటరిగా వెళ్తున్న వాహనదారుల్ని ఆపుతున్నారు. స్వచ్చంధ సంస్ధల పేరుతో ఉన్న ఒక పేపరును జేబులోంచి తీసి హిందీలో డబ్బులు అడుగుతున్నారు. ఇచ్చేదాకా వారిని ఈ గ్యాంగులు వదిలిపెట్టకుండా ఇబ్బందిపెడుతున్నారు. ఇలా డబ్బులు వసూళ్లు చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ పార్వతీపురం పోలీసులకు వరుస ఫిర్యాదులు అందాయి.

ఆదివారం ఉదయం పార్వతీపురం - కొమరాడ రోడ్డులో ఇలానే ఆరుగురు యువతులతో కూడిన ఒక గ్రూపు.. కొమరాడ మండలానికి చెందిన ఒక విలేఖరిని ఆపి మాట్లాడటం ప్రారంభించారు. ఆయన వెళ్తున్న బైక్ ను చుట్టుముట్టారు. అందులో ఒక యువతి జేబులోంచి ఒక పేపర్ తీసింది. అది చూపించి డబ్బులు అడిగింది. డబ్బులు లేవని చెప్పిన ఆ విలేఖరిని డబ్బులిస్తావా..? ఇవ్వవా ? అంటూ బెదిరించారు ఆ యువతులు. దీంతో అక్కడి నుంచి తప్పించుకున్న ఆ విలేఖరి పార్వతీపురం పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని మొత్తం వివరించారు. వాహనాలను ఆపి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని మరికొన్ని ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతులతో పాటు మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరంతా పార్వతీపురంలో ఒక లాడ్జిలో మకాం వేసి.. ఇలా రోడ్లపై తిరుగుతున్నారని తేల్చారు.

అనంతరం విజయనగరం జిల్లా కేంద్రంలోని సీసీఎస్ డీఎస్పీకి సమాచారం అందించి ఆ యువతుల గురించి ఆరా తీశారు. ఈ గ్యాంగ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి విజయనగరం జిల్లాకు వచ్చారని, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇలా రోడ్లపై బైక్‌లను ఆపి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారని అనేక ఫిర్యాదులు ఉన్నాయని సీసీఎస్ పోలీసులు తేల్చారు. పార్వతీపురం వెళ్లకముందు విజయనగరం పట్టణంలో కూడా రెండు రోజులు స్టే చేసారని తేల్చారు. యువతులను విచారించగా.. తామంతా గుజరాత్ నుంచి వచ్చామని, గుజరాత్‌లో ఉపాధి లేదని అందుకే ఇలా వచ్చామని యువతులు పోలీసులకు చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు వారి వివరాలు, ఫోటోలు తీసుకొని తిరిగి అహ్మదాబాద్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేసారు.

ఇటీవల ఏపీతో పాటూ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇలాంటి యువతుల గ్యాంగ్‌లు కనిపించాయి. వాహనదారుల్ని ఆపి ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ అమ్మాయిలు పలు బృందాలుగా ఏర్పడి హైవేలపైనా వాహనదారుల దగ్గర స్వచ్ఛంద సేవాసంస్థల ముసుగులో ఈ దందా చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వాళ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించడం కోసమే ఈ అవతారం ఎత్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Vizianagaram

ఉత్తమ కథలు