యోగ సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జివిఎంసి కమిషనర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. ఎంజిఎం పార్కులో జి-20 సదస్సు సందర్భంగా భారతీయ యోగా విద్యనూ దేశ విదేశీయులకు పరిచయం కొరకు సాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లడుతూ జి-20 సదస్సు ప్రతి 20 సంవత్సరాలకు ఒక సారి జరుగుతుందని, అది మన విశాఖ నగరంలో జరగడం మనకు గర్వకారణమన్నారు. అతిథులకు భారతీయ సాంస్కృతిలో భాగంగా యోగా సాధనతో స్వాగతం పలకడానికి ఈ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇది నగరంలో ఎంజిఎం పార్కు, సెంట్రల్ పార్కు, సాగర్ నగర్లో నిర్వహించామన్నారు.
నిత్యం యోగా సాధనతో యవ్వనంగా వుండటంతో పాటూ అన్ని ఆరోగ్య సమస్యలు కుదుట పడతాయని, ప్రతి భంగిమ లోనూ ప్రతి అవయవంఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ప్రాచీన సంస్కృతిని భారత దేశ ప్రజలు ఎప్పుడూ విశ్వసించరని వెలకట్టలేని ఈ సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం ద్వారా ఆరోగ్యం, ఏకాగ్రత, చురుకు దనం, ఉండడంతో పాటు వృద్ధాప్యం దరిచేరాదని తెలిపారు. ఇటువంటి యోగ సాధన ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతీ స్కూలు విద్యార్ధులకు యోగా తరగతి తప్పని సరిగా వ్యాయమ ఉపాధ్యాయునకు నేర్పాలని తెలిపారు. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా , ముఖ్యంగా విద్యార్థులు బాగా పాల్గొంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎస్ ఎస్ వర్మ, వై. శ్రీనివా నా రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి బి సురేష్ కుమార్, డిసి(రెవెన్యూ) ఫణిరాం, కార్యదర్శి నల్లనయ్య, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి వాసుదేవరెడ్డి, జెడి(అమృత్) విజయ భారతి, పిడి (యుసిడి) కె.వి పాపునాయుడు, డిపిఓ చక్రవర్తి, జోనల్ కమిషనర్లు విజయలక్ష్మి, బొడ్డేపల్లి రాము, సింహాచలం, మల్లయ్య నాయుడు, పర్యవేక్షక ఇంజినీర్లు, ఇతర జివిఎంసి అధికారులు, యోగా ఉపాధ్యాయులు, విద్యార్ధులు, వాకర్సు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: G20 Summit, Local News, Visakhapatnam, Vizag