హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Special Sweets: 128 వెరైటీ వంటకాలు.. కొత్త అల్లుడికి గోదారోళ్లను మించి మర్యాద.. నోరెళ్లబెట్టాల్సిందే

Special Sweets: 128 వెరైటీ వంటకాలు.. కొత్త అల్లుడికి గోదారోళ్లను మించి మర్యాద.. నోరెళ్లబెట్టాల్సిందే

అల్లుడికి 128 రకాల స్వీట్లు

అల్లుడికి 128 రకాల స్వీట్లు

Special Sweets: మర్యాదలు అంటే గోదారోళ్లు మాత్రమే కాదు.. అంటున్నారు వైజాగోళ్లు.. తగ్గేదేలే అంటూ కొత్త అల్లుడికి స్వాగతం పెట్టారు. 128 రకాల వెరైటీ పిండి వండలతో ఆహా ఏమీ రుచి అనిపించేలా చేశారు.. చూస్తేనే నోరురూతుంది..

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Special Sweets: ఇంటికి కొత్త అల్లుడు.. లేదా కాబోయే అల్లుడు ఇంటికి వచ్చాడంటేనే ఆ మర్యాద వేరే లెవెల్లో ఉంటుంది. ఇక గోదావరి జిల్లాల్లో అయితే అది మరింత ప్రత్యేకం.. ఎందుకంటే అక్కడి మర్యాదలే వేరు.. ముఖ్యంగా భోజన ప్రియులకు కడుపు నింపేస్తారు. వెరైటీ వెరైటీ వంటకాలతో నోరు ఊరేలా చేస్తారు. జనం తమ గురించి  గొప్పగా అందరూ చెప్పుకునేలా.. రికార్డు స్థాయి పిండి వంటలను రెడీ చేస్తారు. ఇప్పుడు వైజాగోళ్లు కూడా తగ్గేదే లే అంటున్నారు. అత్తమామలు అల్లుడికి ఇచ్చిన మర్యా చూస్తే ఎవరైనా నోరెళ్లబెడతారు..? కేవలం మాటల ద్వారా స్వాగతం పలకడమే కాదు.. 128 రకాల పిండి వంటలు చేసి.. కొత్త దంపతులకు ఆహ్వానం పలికారు. ఈ వేడుక చాలా సందడిగా సాగింది. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

  విశాఖ జిల్లా విజయదశమి అంటేనే కళకళలాడుతూ ఉంటుంది.. ఈ జిల్లాలో కుమార్తె కు వివాహ నిశ్చయం అయిన తరువాత తొలి దసరా పండుగకి అల్లుడు హోదాలో ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ.. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా మాధవ ధార కి చెందిన కలగర్ల శ్రీనివాస్, ధనలక్ష్మి దంపతులు తమ కావాల్సిన అల్లుడిని పండుగకు ఆహ్వానించారు.. అంతే కాకుండా తమ అల్లుడు కనీవినీ ఎరుగని, ఎప్పుడు టేస్ట్ కూడా చేయని 128 రకాల వంటకాలను వివిధ ప్రాంతాల నుండి తీసుకు వచ్చారు..

  విశాఖలో ఎప్పుడూ విజయదశిమి వేడుకలు చాలామంది ఘనంగానే చేసుకుంటున్నారు. ఇక కొత్తగా పెళ్లైన జంట.. లేదా కాబోయే అల్లుడు ఇంటికి వస్తే ఆ సందడే వేరే లెవెల్లో ఉంటుంది. ఆ సందడి ఇక్కడ కనిపించింది. అత్తంటివారి ఆహ్వానం మేరకు తమ అల్లుడు కాపుగంటి చైతన్య మధవధార లోని కాబోయే భార్య ఇంటికి చేరుకున్నాడు.. అయితే అక్కడ అత్తమామల ఏర్పాట్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

  ఇప్పటి వరకు తాను ఎప్పుడూ చూడని రకరకాల ఐటెమ్స్ చూసి ఫిదా అయ్యాడు ఆ అల్లుడు. అత్తమామలు ఇచ్చే మర్యాద చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. దీంతో అత్తమామల కుటుంబసభ్యులతో కలిసి సౌండ్ సిస్టంలో వస్తున్న మ్యూజిక్ తో స్టేప్పులేశాడు. ఈ సందర్భంగా అత్తమామల ఇల్లంతా కోలాహలంగా మారింది .. ఏదైనా కొత్త గా చేయాలనే ఆలోచనతో కొత్త అల్లుడికి ఇలా స్వాగతం పలికాం అంటున్నారు కలగర్ల శ్రీనివాస్. ఈ ఏర్పాట్లపై కూతురు, అల్లుడు సంతృప్తి చెందారని.. ఇటువంటి కార్యక్రమం ద్వారా భావితారాలకు తెలుగుతనం గొప్పతనం తెలుస్తుంది అనే ప్రధాన ఉద్దేశ్యం తో కార్యక్రమం నిర్వహించాం అని అన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: After marriage, Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు