London eye at Vizag: విశాఖలో లండన్ ఐ.. ఏపీ ప్రభుత్వం ప్రణాళిక.. సీఎం జగన్ ఆదేశాలు..

విశాఖలో లండన్ ఐ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు

"లండన్ఐ" (London Eye) ఈ పర్యాటక స్థలం చాలా మందికి తెలిసినదే. విదేశీ ట్రిప్ లో చాలా మంది లండన్ ఐ, మిలీనియమ్ వీల్ ఎంజాయి చేసిన వాళ్లే. ఇప్పుడు అదే పర్యాటక ఐకాన్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఉంటే..! అదీ విశాఖపట్నం (Visakhapatnam) లో ఉంటే..?

  • Share this:
    P. Anand Mohan, Visakhapatnam, News18

    "లండన్ఐ" (London Eye) ఈ పర్యాటక స్థలం చాలా మందికి తెలిసినదే. విదేశీ ట్రిప్ లో చాలా మంది లండన్ ఐ, మిలీనియమ్ వీల్ ఎంజాయి చేసిన వాళ్లే. ఇప్పుడు అదే పర్యాటక ఐకాన్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఉంటే..! అదీ విశాఖపట్నం (Visakhapatnam) లో ఉంటే..? విశాఖలోనే లండన్ ఐ, మిలీనియమ్ వీల్ తరహా ప్రాజక్ట్ వస్తే. ఇంకేముంది..? సూపర్ కద..! ఏపీ ప్రభుత్వం (AP Government) ఆ దిశగా అడుగేసింది. పర్యాటక హబ్ గా రాష్ట్రాన్ని తీర్చి దిద్దడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ ఐ తరహా ప్రాజక్ట్ తీసుకురావడానికి దృష్టి పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. పర్యాటక రంగానికి రాష్ట్రం చిరునామాగా మారాలని సీఎం జగన్‌ నిర్దేశించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది.

    ఈ సమావేశంలో రాష్ట్రంలో భారీ పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు. పలు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో ‘లండ న్‌ ఐ’ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇక ఇలా ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల మేరకు పెట్టుబడులు వస్తాయని.. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2,868.6 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఎస్‌ఐపీబీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా సుమారు 48 వేల మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

    ఇది చదవండి: ఆ పోస్ట్ ఆఫీస్ లో అందరూ మహిళలే.. చిటికెలో పనులు చక్కబెట్టేస్తారు..



    పర్యాటకం అంటే ప్రతి ఒక్కరూ ఏపీ వైపే చూడాలి. ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించేలా ప్రాజెక్టులు ఉండాలి. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలి. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోండని సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల పర్యాటక పరంగా రాష్ట్రస్థాయి పెరుగుతుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యాటకంపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయన్నారు. విశాఖలో అంతర్జాతీయ శ్రేణి పర్యాటకానికి అవకాశాలు ఉండటంతో ఈ మేరకు ప్రణాళికలు వేయాలన్నారు.

    ఇది చదవండి: తుఫాన్ విరుచుకుపడి ఏడాదైంది..! ఇంకా ఆ గ్రామాలను వీడని భయం..


    విశాఖలో పాటు ఎస్‌ఐపీబీ మరిన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. విశాఖ, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్‌, పిచ్చుకల లంకల్లో ఒబెరాయ్‌ రిసార్టుల నిర్మాణానికి ఆమోదం పొందాయి. ఒబెరాయ్‌ విలాస్‌ బ్రాండ్‌ పేరుతో రిసార్టులకు ఆమోదం పొందింది. విశాఖపట్నం శిల్పారామంలో హయత్‌ ఆధ్వర్యంలో స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణాలకు, తాజ్‌ వరుణ్‌ బీచ్‌ పేరుతో విశాఖలో మరో హోటల్‌, సర్వీసు అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు ఆమోదించారు. విశాఖలో టన్నెల్‌ అక్వేరియం, విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హోటల్‌ నిర్మాణానికి, అనంతపురం జిల్లా పెనుగొండలోని జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఆథ్యాత్మిక పర్యాటక కేంద్రం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
    Published by:Purna Chandra
    First published: