Neelima Eaty, News18 Visakhapatnam
Tips for Eamcet Students: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలలో ఇంజనీరింగ్ (Engineering), మెడిసిన్ (Medicine), అగ్రికల్చర్ స్ట్రీమ్ (Agriculture Stream) లలోని రెండు రాష్ట్రాల్లోని వివిధ కళాశాలల్లో ప్రవేశానికి వేర్వేరుగా నిర్వహింంచే ప్రవేశ పరీక్ష. ప్రతి సంవత్సరం ఎంసెట్ పరీక్షను మే నెలలో నిర్వహిస్తారు… ఈ సంవత్సరం కాస్త ఇంటర్ పరీక్షల జాప్యం కారణంగా జులైలో జరగనుంది. జులై 4న ఇంజనీరింగ్ స్ట్రీమింగ్‌తో మొదలయ్యే పరీక్షలు… జూలై 8 వరుకు జరగనున్నాయి.. అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు, జులై 11 ,12 తేదీల్లో జరగనుంది.
ఈ ఎంసెట్ పరీక్ష 160 మార్కులకు ఉండగా…అందులో మ్యాథ్స్ 1A, 2A నలభై మార్కులకు.. 1B, 2B నలభై మార్కులకు అంటే మొత్తం ఎనభై మార్కులు మ్యాథ్స్ సబ్జెట్‌కు కేటాయించారు. మిగిలిన ఎనభైలో.. ఫిజిక్స్ 40 మార్కులకు, కెమిస్ట్రీ మరో నలభై మార్కులకు నిర్వహిస్తారు.
ఎంసెట్ ఎగ్జామ్ డేట్ దగ్గరపడుతోంది. కంగారులో అన్ని తిరగేద్దామని అనుకుంటే పొరపాటే అంటున్నారు భవిష్య అకాడమిలోని మ్యాథ్స్ లెక్చరర్ సుబ్బారావు. ఈ సమయంలోనే కాస్త తెలివిగా..విద్యార్థులు తమకు వచ్చిన టాపిక్స్‌నే రివైజ్ చేస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు. ఈయనకు ఉపాధ్యాయ వృత్తిలో 15 సంవత్సరాల అనుభవం ఉంది. గణిత సబ్జెక్టులో సులభమైన స్కోరింగ్ టాపిక్స్ గురించి వివరించారు.
ఇదీ చదవండి : లెక్కలు అనేసరికీ భయపడుతున్నారా? డోంట్ ఫియర్ అంటోంది వేదిక్ మ్యాథ్స్..
1A, 2Aలో స్కోరింగ్ టాపిక్స్:
అధ్యాపకులు సుబ్బారావు.. ప్రస్తుతం భవిష్య అకాడమీలో గణితం 1A, 2A బోధిస్తున్నారు. తక్కువ సమయంలో సులభంగా స్కోర్ చేయడానికి మ్యాథ్స్‌లో దాదాపు ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయంటున్నారు సుబ్బారావు. ఆల్‌జీబ్రా (algebra) లో మ్యాథమెటికల్ ఇన్‌డక్షన్ (mathematical induction) ప్రిపేర్ అయితే… ట్రైల్ మరియు ఎర్రర్ ( trail and error method) ఫాలో అయితే ఈజీగా ఇందులో స్కోర్ చేయచ్చు. థియరీ ఆఫ్ ఇక్వేషన్స్ (Theory of equations ) మరియు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ (quadratic equations chapter )కూడా ట్రైల్ మరియు ఎర్రర్ మెథడ్ ఫాలో అయితే చాలంటున్నారు.
ఇదీ చదవండి : ఈ బాదుడేందిరో..? విద్యార్థులనూ వదలరా... ఆర్టీసీ వడ్డనపై నారా లోకేష్ ఆవేదన
పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఛాప్టర్‌లో (permutations and combinations) చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారు…. కాబట్టి సులభంగా స్కోర్ చేయవచ్చన్నారు. ప్రాబబిలిటీ (probability)లో రాండమ్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ (random distribution, binomial distribution) మరియు పాయిజన్ (poision distribution) ప్రిపేర్ అయితే మంచి మార్కులు స్కోరు చేయోచ్చని సుబ్బారావు తెలిపారు.
ఇదీ చదవండి : ఆ మాత్రం దానికే ఆయన ఇంద్రుడు చంద్రుడా..? చంద్రబాబుసై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
కాలుక్యులస్ ( caluculas) చాఫ్టర్‌లో ఉండే లిమిట్స్ టాపిక్‌లో ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే చాలంటున్నారు. విద్యార్థులు అందరూ అన్ని చాప్టర్స్ prepare అయినా… పక్కన formulas రాసుకొని గుర్తు పెట్టుకుంటే చాలంటున్నారు అని సుబ్బారావు తెలిపారు.
ఇదీ చదవండి : ఏపీ సర్కార్ కు బిగ్ షాక్.. ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయాలపై స్టే
మంచి యూనివర్సిటీ, కాలేజీలో సీటు రావాలనుకుంటే తప్పకుండా మ్యాథ్స్‌లో 80కి గాను 65 మార్కులు స్కోర్ చేయాలంటున్నారు మరో అధ్యాపకులు జయరామ్. మ్యాథ్స్‌లో చాలా అంటే చాలా ముఖ్యమైన టాపిక్స్ త్రికోణమితి(trigonometry), జియోమెట్రీ( geometry). ఈ రెండు టాపిక్స్‌లో ఫార్ములాలను బాగా ప్రాక్టీస్ చేసి..పాత పేపర్లను రివైజ్ చేస్తే మంచి మార్కులు స్కోరు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదీ చదవండి: ఏపీలో నేటి నుంచి బస్సు ఛార్జీల బాదుడు.. తిరుమల-తిరుపతి మధ్య భారీగా పెరిగిన ఛార్జీలు.. ధర ఎంతంటే?
1B &2 Bలో స్కోరింగ్ టాపిక్స్ : permutations and combinations, Calculus, geometry, T trigonometry వీటిలో అవగాహన ఉంటే బెస్ట్ స్కోర్ చేయవచ్చంటున్నారు జయరామ్.
పరీక్ష సమయం దగ్గరకొచ్చేసింది. దీంతో ఇప్పుడయితే కొత్త ఛాప్టర్స్ ప్రిపేర్ అవ్వొద్దంటున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు మీకు వచ్చిన వాటినే ప్రాక్టీస్ చేస్తూ రివైజ్ చేసుకుంటే మంచిదని మ్యాథ్స్ లెక్చరర్ జయరామ్, సుబ్బారావు..న్యూస్ 18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Emcet, Local News, Vizag