5G in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో 5 జీ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కాబోయే పరిపాలనా రాజధానిగా చెప్పుకునే.. విశాఖ నగర వాసులకు ఈ అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని ప్రముఖ టెలీ కమ్యూనికేషన్ సంస్థ భారతీ ఎయిర్ టెల్ గుడ్ ఈ గుడ్ న్యూస్ చెప్పింది. అత్యాధునిక 5జీ సేవలను గురువారం నుంచి స్టార్ట్ చేసింది. దశల వారీగా వినియోగదారులకు.. సేవలు అందనున్నాయి. దశల వారీగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌టెల్ ఏపీ, తెలంగాణ సీఈవో శివన్ భార్గవ చెప్పారు. తమ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన 18వ నగరంగా విశాఖపట్నం అని ఎయిర్‌టెల్ పేర్కొంది.
ప్రస్తుతం విశాఖలోని ద్వారకానగర్, బీచ్ రోడ్డు, దాబా గార్డెన్స్, గాజువాక జంక్షన్, ఎంవీపీ కాలనీ, రాంనగర్, తేన్నేటి నగర్, మద్దిలపాలెం, వాల్దే ర్ అప్‌ల్యాండ్స్, పూర్ణా మార్కెట్, రైల్వే స్టేషన్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది ఎయిర్‌టెల్ సంస్థ పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేంత వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా హై స్పీడ్ ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్‌ని ఉచితంగా పొందవచ్చని సీఈవో శివన్ వివరించారు.
మరోవైపు దేశంలో ప్రస్తుతం 4జీ సేవలు కొనసాగుతున్నాయి. 5 జీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వినియోగదారుల కల నెరవేర బోతోంది. ఇతర నెట్‌వర్క్‌ల కంటే జియో మరింతగా దూసుకుపోతోంది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సేవలు అందిస్తోంది. ఇక జియో ఐఫోన్ 12, తర్వాత వెర్షన్ మొబైల్ ఉన్నవారికి అపరిమిత డేటాలో 5జీ సేవలను ప్రారంభించింది. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 12 మ్యాక్స్, ఐఫోన్ 13, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్న వారు జియో 5జీ సేవలను యాక్సెస్ చేసుకోవాలని తెలిపింది.
ఇప్పటికే కొందరు నగర వాసులకు 5 జీ అనుభూతి దక్కుతోంది. ప్రస్తుతం ఆ సేవలు వాడుతున్నవారు 5 జీ ప్లస్ సేవలపై ఆనందం వ్యక్ం చేస్తున్నారు. విశాఖతో పాటు త్వరలోనే మరికొన్ని నగరాలకు విస్తరిస్తామని ఎయిర్ టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఈవో శివన్ భార్గవ్ మీడియాకు తెలిపారు. మరిన్ని నగరాలకు... 5జీ సేవలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే 4జీ సిమ్ తోనూ 5జీ సేవలను పొందవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుత ఎయిర్టెల్ వినియోగదారులు ఉచితంగానే 5జీ సేవలను పొందవచ్చని ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రస్తుతమున్న సిమ్ కార్డును కూడా మార్చాల్సిన అవసరం లేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cm jagan, Srikakulam