హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభం.. 30 ఏళ్ల పాటు రాబడి..? ఇంకా ప్రయోజనాలు ఎన్నో

Vizag: వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభం.. 30 ఏళ్ల పాటు రాబడి..? ఇంకా ప్రయోజనాలు ఎన్నో

పామ్

పామ్ ఆయిల్ సాగుతో ఎన్నో లాభాలు

Vizag: వ్యవసాయంలో కొత్త దారులు వెతుకుతున్నారు ఉమ్మడి విశాఖపట్నం రైతులు. వ్యవసాయంతో నష్టాలు కాదు లాభాల పంట పండించొచ్చని నిరూపిస్తున్నారు. ఒక్క సారి పెట్టుబడి పెడితే చాలు..తర్వాత 30 ఏళ్లు వరసగా ఆదాయం పొందే ఆయిల్‌పామ్‌ తోటల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇంకా చదవండి ...

  Setti Jagadeesh, News 18, Visakhaptnam

  Vizag:  ఈ మధ్య కాలంలో రైతులంతా సంప్రదాయ వ్యవసాయంపై కాకుండా.. వాణిజ్య పంటలవైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా విశాఖ ఏజెన్సీ (Visakha Agency) రైతులు సైతం  వ్యవసాయంలో కొత్త దారులు వెతుకుతున్నారు. అలాంటి వారికి చక్కటి ఆదాయ వనరుగా మారుతోంది ఆయిల్ పామ్ పంట (Palm Oil Farming).. ఎందుకంటే ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.. తర్వాత 30 ఏళ్లు వరసగా ఆదాయం పొందే అవకాశం ఉంది. లాభాలు కూడా భారీగానే ఉంటున్నాయి. అనుబంధ పంటలు వేసుకునే వీలు కలుగుతుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) వడ్డాది మండలం బంగారు మెట్ట గ్రామం లో ఎస్. సాయి రఘునాథ్ (Sai Raghunath) అనే యువరైతు. తనకున్న ఐదు ఎకరాలలో పామాయిల్ పండించి లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు.

  నిరీక్షణ నాలుగేళ్లే…ఆ తర్వాత అంతా ఆదాయమే..!

  సాధారణంగా ఎక్కువ ఎకరాలు భూమి కలిగిన రైతులు ఆయిల్‌పామ్‌ తోటలను సాగు చేస్తుంటారు. ఒకసారి పంటకు ఉపక్రమించిన తర్వాత నాలుగేళ్లు వరసగా పెట్టుబడి పెట్టాలి. గోదావరి జిల్లాల్లో అయితే చిన్న కమతాలు కలిగిన రైతులు కూడా ఆయిల్‌పామ్‌కే మొగ్గు చూపుతారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.60 ఉండే ఆయిల్‌పామ్‌ మొక్కను రాయితీ పోను మూడు ఎకరాల్లోపు రైతులకు రూ.5, మూడు నుంచి ఐదు ఎకరాల్లోపు రైతులకు రూ.10, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు రూ.30 వంతున ప్రభుత్వం సరఫరా చేసేది.

  పెట్టుబడి గోరంత.. ఆదాయం కొండంత

  ప్రస్తుతం 300 రూపాయల విలువ ఉన్న మొక్కను.. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రైతులకు ఎన్ని కావాలంటే అన్ని అందిస్తోంది.  ప్రభుత్వం  4 వేల రూపాయల నగదును నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తోంది. ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు మొక్కలు ఉచితంగా లభిస్తుండగా ఎకరాకు గాను పెట్టుబడి నిమిత్తం  30 వేల నుంచి 40 వేలు వరకు ఖర్చు అవుతుంది.

  ఇదీ చదవండి : సీఎం జగన్ ను కలిసే తీరుతామంటున్న పరిటాల సునీత..? ఎందుకంటే..?

  రోజుకు 250లీటర్ల నీరు

  మొక్కకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో రోజుకు 250 లీటర్ల నీరు, మూడు నెలలకు ఒకసారి మొక్కకు 3–4 కిలోల ఎరువులు, అవసరమైన చోట మట్టలు నరకడం చేస్తే సరిపోతుంది.

  ఇదీ చదవండి: ఆ జైలుకు వెళ్లాలని చాలామంది ఆరాటపడతారు..? ఎందుకంత స్పెషలో తెలుసా..?

  పాదు చేయుపద్ధతి:                                                                                                 తొలి ఏడాది చెట్టు చుట్టూ 1 మీ. వ్యాసార్థంతో పాదులను చెయ్యాలని..పాదుల వ్యాసార్థాన్ని రెండేళ్ల వయసులో 2మీ. , మూడు ఏళ్ల తర్వాత 3 మీ. పెంచాలని రఘునాథ్ సూచిస్తున్నారు.

  ఇదీ చదవండి : గన్నవరంలో ఏం జరుగుతోంది? వంశీ-రాధ మధ్య ఏకాంత చర్చలు.. మ్యాటర్ అదేనా..?

  అంతరకృషి చాలా ముఖ్యం

  ఆయిల్‌ ఫామ్‌ మొక్కలను నాటిన తర్వాత పాదుల్లో కలుపు పెరగకుండా శుభ్రపరచాలి. తేమను నిల్వఉంచడానికి , కలుపు బెడద తగ్గించడానికి కొబ్బరి పీచు, రంపపు పొట్టు, నరికిన ఆకులు, మగ పొత్తులు వంటివి మల్చ్‌గా వాడాలి. చేతితో లేదా సిఫార్సు చేసిన కలుపు మందులతో గానీ క్రమంగా కలుపు మొక్కలను నిర్మూలించాలి.

  ఇదీ చదవండి : బొంగులో చికెన్ అంటే ఇష్టమా.. దానికోసం ఏజెన్సీకి వెళ్లాల్సిన పనిలేదు.. సిటీలోనే.. కేజీ రేటెంతంటే

  అంతరపంటలు కూడా వేసుకోవచ్చు

  మొక్కలను నాటి రెండేళ్ల వరకు అరటి, పప్పు దినుసులు, వేరుశనగ, పసుపు, కూరగాయలు, పుచ్చకాయలాంటివి పండించుకోవచ్చు. ఎదిగిన ఆయిల్‌ ఫామ్‌ తోటల్లో అంటే 8 నుంచి 10 ఏళ్లు పై బడిన , 15 అడుగులపై బడి ఎత్తు ఉన్న తోటల్లో పాక్షికంగా నీడను ఆశ్రయించి పెరిగే మొక్కలు ఆయిల్‌ఫామ్‌తోపోటీ పడని కోకో , మిరియాల పంటలను పండించుకోవచ్చు.

  ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు శుభవార్త.. వేలానికి సిద్ధమైన స్వామి వారి వస్తువులు..? వేలంలో ఎలా పాల్గొనాలి అంటే..?

  ఆకులను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి

  మొక్క అధికసంఖ్యలో ఆకులు కలిగి ఉండేటట్టు చూడాలి. ఎండిపోయిన, తెగుగు పట్టిన ఆకులను మాత్రమే వీలును బట్టి నరికేయాలి. తొలి రెండేళ్ల వరకు ఆడ, మగ పూగుత్తులను పెరగకముందే నరికేయాలి.

  ఇదీ చదవండి : ద్వారకా తిరుమల విరాళాల్లో కోట్లలో తేడా..? చివరికి బయటపడ్డ ట్విస్ట్.. షాక్ అయిన అధికారులు

  నాలుగేళ్ల తర్వాత ఇంక అంతా దిగుబడే..!

  నాలుగేళ్ల తర్వాత ఏడాదిలో ఎనిమిది మాసాలకు కలిపి 16సార్లు దిగుబడి వస్తుంది. దీంతో ఖర్చులు పోను ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం లభిస్తుందంటున్నారు యువరైతు రఘునాథ్‌.

  పక్షుల బెడదను తగ్గించుకోవాలి

  ఆయిల్‌పామ్‌కు తెగుళ్ల బాధ తక్కువ. ఒకవేళ తెగుళ్లు సోకినా ఇబ్బంది లేదు. పంట దిగుబడి సమయంలో ఆయిల్‌పామ్‌ పండ్లను గోరపిట్టలు, కాకులు, ఉడతలు తినేస్తుంటాయి. సాధారణంగా ఆయిల్‌పామ్‌ గెల 30 కిలోలు ఉండగా.. గెలకు అరకిలో వరకు నష్టం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రక్షణ చర్యలు తీసుకోవాలి.

  ఇదీ చదవండి: అధినేత మాటే శాసనం అనే పార్టీకి ఇప్పుడేమైంది.. సీఎం జగన్ కు పెరుగుతున్న తలనొప్పులు

  మంచి దిగుబడులు

  ఆయిల్‌పామ్‌ సాగు ప్రస్తుతం మంచి దిగుబడులు ఇస్తుంది. ఏడాదిలో 8 నెలల పాటు 15 రోజులకొకసారి ఎకరానికి 10–12 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్‌ గెలల ధర రూ.21 వేలకు కంపెనీల యజమానులు కొనుగోలు చేస్తున్నారు. నర్సీపట్నం వద్ద బంగారుమెట్ట, విజయనగరం జిల్లా పార్వతీపురంలో కంపెనీలకు ఆయిల్‌పామ్‌ గెలలను తరలిస్తున్నారు.

  ఇదీ చదవండి : ఆ ముగ్గురు అధికార పార్టీ ఎంపీలు తెలుగుదేశం వైపు చూస్తున్నారా? ఆ లిస్టులో ఎవరున్నారంటే?

  పామాయిల్‌ పంట వేయాలనుకుంటే...మీకు ఏమైనా సలహాలు, సందేహలు ఉంటే యువరైతు రఘునాథ్‌ను +918074358889 సంప్రదించండి.

  మీరు పామాయిల్ పంట వేసి అమ్ముకోవాలనుకుంటే పార్వతీపురంలోని శాంతి ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను సంప్రదించండి. 

  అడ్రస్ : సర్వే నెంబర్‌ 4, ఎల్‌బీపీ అగ్రహారం, బుచ్చయ్యపేట మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 531026

  ఫోన్‌ నెంబర్‌ : 9666680743 / 9666680744

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag

  ఉత్తమ కథలు