హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakhapatnam: వృద్దులకు గుడ్ న్యూస్.. కింగ్ జార్జి ఆసుపత్రిలో వారికి  ప్రత్యేక ఏర్పాట్లు..

Visakhapatnam: వృద్దులకు గుడ్ న్యూస్.. కింగ్ జార్జి ఆసుపత్రిలో వారికి  ప్రత్యేక ఏర్పాట్లు..

వృద్దులకు సదుపాయాలు

వృద్దులకు సదుపాయాలు

Andhra Pradesh: విశాఖపట్నంలో కింగ్ జార్జి ఆసుపత్రికి (కేజీహెచ్) వచ్చే రోగులకు సకాలంలో ఉత్తమ వైద్య సేవలందించడంతో పాటు, రోగులు, వారి సహాయకులకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(Setti Jagadesh, News18, Visakapatnam)

విశాఖపట్నంలో కింగ్ జార్జి ఆసుపత్రికి (కేజీహెచ్) వచ్చే రోగులకు సకాలంలో ఉత్తమ వైద్య సేవలందించడంతో పాటు, రోగులు, వారి సహాయకులకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. విశాఖ కేజీహెచ్ సూపరిండెంటెంట్ డాక్టర్ పి. అశోక్ కుమార్. పెద్దాసుపత్రిని ఓ వైపు ప్రక్షాళన చేస్తూనే, వార్డుల్లో అన్ని రకాల వసతులు కల్పించేలా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కేజీహెచ్ లోని కార్డియాలజీ, క్యాజువాల్టీ, ప్రసూతి విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇది వరకు లా కాకుండా ఓపీ కౌంటర్లు అదనంగా ఏర్పాటు చేయడంతో పాటు, క్యాజువాల్టీ విభాగంలో మరింత మెరుగ్గా సేవలందించేలా కృషి చేస్తున్నారు.

దీర్ఘకాలిక రోగులకు మరింత మెరుగైన వైద్యం

ముఖ్యంగా సాధారణ రోగులతో పాటు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే రోగులకు కూడా రాజేంద్ర ప్రసాద్ వార్డులోని ప్రత్యేకంగా జిరియాట్రిక్ (వృద్ధుల కోసం) వార్డును పది పడకలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ వార్డులో ఉంటూ చికిత్స పొందే రోగులకు సైతం ఉచితంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫిజియోథెరపీ\" సిబ్బంది ద్వారా ఆయా సేవలను ఉచితంగా అందించేలా చర్యలు చేపట్టామని సూపరిండింటెంట్ అశోక్ కుమార్ తెలిపారు. సూదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు రెండు, మూడు రోజులు ఇక్కడే ఉండి వారికి అవసరమైన అన్ని రకాల వైద్యసేవులు పొందేందుకు ఈ ఉపయోగపడుతుంది అన్నాడు. వీరికి అవసరమైన మందులు, వైద్య పరీక్షలు సైతం ఉచితంగానే అందిస్తామని అన్నారు.

ఇదివరకు కేజీహెచ్ పైన చాలా రూమర్స్ రావడం జరిగింది. వృద్ధులు వేస్తే పట్టించు కొరంటు ప్రచారాలు కూడా జరిగాయి.. కానీ అవన్నీ ఇప్పుడు లేకుండా చేస్తున్నారు. వృద్ధులు కేజీహెచ్ కి రావాలంటే భయపడేవారు కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు. కేజీహెచ్ కి వచ్చే ప్రతి రోగులను కూడా నయం చేసి పంపిస్తామంటూ సూపర్డెంట్ భరోసా ఇస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసి కేజీఎఫ్ మంచి పేరు తెచ్చే విధంగా చేస్తామని వృద్ధులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపర్డెంట్ తెలిపారు .

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు