Setti Jagadeesh, News 18, Visakhapatnam
ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా సేవలందిస్తున్న విశాఖపపట్నం (Visakhapatnam) కింగ్ జార్జ్ ఆసుపత్రి (Vizag KGH) లో మరింత ఆరోగ్య సేవలు విస్తృతం కానున్నాయి. కేజీహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ అశోక్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్క విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే క్యాజువాలిటీ విభాగానికి తొలి ప్రాధాన్యతను ఇస్తున్నారు. గత మూడేళ్లుగా మూలకు చేరిన అత్యవసర సర్వీసులో భాగంగా ఎమర్జెన్సీ ల్యాబ్ ను తిరిగి పునఃప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిబ్బంది నియామకంతో పాటు వారికి అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చారు. వారం రోజుల్లోనే ఈ అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చి క్యాజువాలిటీలో వైద్య సేవలు పొందే రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు సూపర్జెంట్ డాక్టర్ పి. అశోక్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా, కలెక్టర్ మల్లికార్జున సూచనల మేరకు ప్రతి విభాగంలో రోగులకు అందించే వైద్య సభలతో పాటు వారి సహాయకులకు కూడా పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి నీ క్యాజువల్టి కి తీసుకు వెళ్లి అక్కడ సేవలను మరింత వేగవంతం చేయడంతో పాటు మెరుగైన వైద్యశాల అందించే దృష్టి సారించామని తెలిపారు. అత్యవసర రోగులకు వైద్య పరీక్షలు నిమిత్తం ఇప్పటివరకు బయట ప్రైవేట్ ల్యాబులను ఆశ్రయించడం జరుగుతుంది.
ఇకపై ఆ విధానానికి స్వస్థి పలికి కేజీహెచ్ లో ఉన్న వైద్య పరికరాలను సిబ్బందిని వినియోగించుకుంటూ అక్కడికక్కడే పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు (అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు) అందించి త్వరితన చికిత్సలు చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.క్యాజువాలిటీలో రోగులకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలు.. అత్యవసర సమయంతో పాటు సాధారణ రోగులకు కూడా రాత్రిసమయాల్లో క్యాజువల్ లో వస్తున్న వారికి సకాలంలో వైద్యులు సేవలందించడంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
ఇప్పటికే క్యాజువాలిటీ విభాగాన్ని మూడు కోట్ల రూపాయలతో ఆధునికరించడంతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఓపీ సేవలు విస్తృతం చేయడంతో పాటు ఓపికౌంటర్లు పార్కింగ్ సుందరీకరణ విషయాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam