(Setti Jagadesh, News18, Visakapatnam)
సింహాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. కొండపైకి వెళ్లెందుకు త్వరలో ఆరు ఉచిత బ్యాటరీ బస్సులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి మంజూరు చేస్తున్న నిధులలో ప్రసాద్ పథకం ద్వారా దేవాలయాల సమగ్ర అభివృద్ధి సాధిస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సింహాచలం వచ్చిన మంత్రి రోజా మాట్లాడుతూ ప్రసాద్ పథకంలో సింహాచలం దేవస్థానం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.
పథకం ద్వారా వచ్చే నిధులలో భక్తుల కోసం కొండ దిగువ నుండి కొండ మీదువరకూ ఆరు ఉచిత బ్యాటరీ బస్సులను కేటాయిస్తామని అన్నారు. అలాగే కొండపైకి వచ్చే శ్రీ స్వామివారి మెట్లు మార్గమును విస్తరించి వెయ్యి మెట్లు వరకు నిర్మాణం చేస్తామని తెలిపారు.
శ్రీ స్వామివారి ఆలయంలో అత్యంత ప్రాధాన్యత గల నిత్యం ప్రవహించే గంగధార వద్ద ప్రత్యేక గదులను నిర్మిస్తామని తెలిపారు. గంగాధర వద్ద స్నానమాచరించే భక్తులకు బట్టలను మార్చుకునేందుకు గానుగదులు కేటాయిస్తామని అన్నారు. క్యూ కాంప్లెక్స్ లను అభివృద్ధిపరిచి భక్తులకు ఎండ, చలి, వర్షం నుండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణం చేస్తామని తెలిపారు.
శ్రీ స్వామివారి ఆలయంలో ప్రత్యేక దినాలలో 5 వేలమందికి మిగిలిన రోజులలో 3వేల 500 మందికి ఉచిత అన్న ప్రసాదమును అందిస్తున్నామని , భక్తుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ వంటను మరింత వేగంగా చేసేందుకు గాను ప్రత్యేక మిషనరీని కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టూరిజం అత్యంత ప్రాధాన్యత గలదని తెలిపారు.
ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు టూరిజంలో ప్రత్యేక ఆకర్షణ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్వయంభు దేవాలయాలు దేశంలో మరే రాష్ట్రంలోని లేవని దేవాలయాలు వల్లే టూరిజం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam