Setti Jagadesh, News18, Visakapatnam
విశాఖపట్నంలో డెంటల్ సంబంధిత చదువులు చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే ఇబ్బంది లేకుండా, విశాఖలోనే డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇటీవల టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలతో స్పష్టమైనది.
ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని టిటిడి చైర్మన్ వైఎస్సార్ సిపి ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి విశాఖ ప్రజలకు హామీ ఇచ్చారు.ఇటీవల జరిగిన 41వ రాష్ట్ర డెంటల్ కాన్ఫరెన్స్ లో ఆయన తెలిపారు. దీంతో నగర ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా యువతకు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో కడప , విజయవాడల్లో మాత్రమే ప్రభుత్వ డెంటల్ కాలేజీలు ఉన్నాయని, విశాఖలోనూ డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కోరగా, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి తగిన నిర్ణయం తీసుకుంటామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు కానున్న మెడికల్ కాలేజీల్లో పూర్తి స్థాయి డెంటల్ డిపార్ట్మెంట్ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొన్నారు. డెంటల్ హెల్త్ పై ప్రజల్లో అవగాహన పెరగడంతో సిటీలోతో పాటు గ్రామీణంలో కూడా డెంటల్ ఆస్పత్రులు ఏర్పాటుతున్నాయని తెలిపారు.
ఆధునిక టెక్నాలజీతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు చేస్తున్న కృషిని ప్రశంసించారు. వైద్య రంగానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విశేష ప్రాధాన్యమిస్తూ రూ. 7880 కోట్లతో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నారని, ఇందులో 5 కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించారని వివరించారు. పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం కొత్తగా 3 వేలకు పైగా రుగ్మతలను ఆరోగ్యశ్రీలో చేర్చిందని చెప్పారు. డెంటల్ డాక్టర్లందరికి కాన్ఫరెన్స్ ఒక దిక్సూచిలా ఉపయోగపడాలని, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పంపిన సందేశంలో ఆకాక్షించారన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam