హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అక్కడ పుస్తకాలన్నీ సగం ధరకే..! A to Z ఏ పుస్తకం కావాలన్నా దొరుకుతుంది..!

అక్కడ పుస్తకాలన్నీ సగం ధరకే..! A to Z ఏ పుస్తకం కావాలన్నా దొరుకుతుంది..!

X
విశాఖలో

విశాఖలో అందుబాటులో సెకండ్ హ్యాండ్ బుక్స్

Vizag: ఈ రోజుల్లో పోటీ పరీక్షలను ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా గట్టిగా సిద్ధం కావాల్సిందే. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పోటీపరీక్షలు నిర్వహిస్తూ అర్హులైన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముందుకొస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhaptnam

విశాఖపట్నం (Visakhapatnam)లో విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు కావాలనుకునే వారు ఈ రోజుల్లో పోటీ పరీక్షలను ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా గట్టిగా సిద్ధం కావాల్సిందే. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పోటీపరీక్షలు నిర్వహిస్తూ అర్హులైన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ తరుణంలో వాటిని చేజిక్కించుకోవాలంటే మాత్రం కాస్త శ్రమించక తప్పదు. అదే స్థాయిలో వాటికి కావాల్సిన పుస్తకాలు కూడా కొనుగోలు చేసి చదువుకోవాలి. అయితే ప్రతి పోటీ పరీక్షకు పుస్తకాలు కొనుక్కోవాలి అంటే మధ్యతరగతి కుటుంబo నుండి వచ్చిన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా అధిక ధరలు వెచ్చించి పుస్తకాలు కొనుక్కొలేని స్టూడెంట్స్‌కి శుభవార్త.

దశాబ్దాలుగా విశాఖపట్నంలో ఉన్న వన్ టౌన్ ఏరియాలోని పోలీస్ బ్యారక్స్ దగ్గర సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాలు కొకొల్లలుగా దొరుకుతాయి. రోడ్లకు ఇరువైపులా పుస్తకాలతో చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి. విద్యార్థుల కోసం ప్రాథమిక పాఠశాల నుండి ఇంజనీరింగ్, మెడిసిన్ కోసం అవసరమైన మార్గదర్శకాల పుస్తకాల వరకు అన్నీ ఉన్నాయి.

ఇది చదవండి: నాడు-నేడుతో ఆ ప్రభుత్వ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి.. చూస్తే వారెవా అనాల్సిందే..!

విద్యార్థులు పోటీ పరీక్షలకు అనుగుణంగా సగం ధరకే ఇక్కడ పుస్తకాలు అన్ని అందుబాటులో దొరుకుతాయి. ఒకవేళ మీకు ఏదైనా పుస్తకం కొద్దిరోజులకే కావాలనుకుంటే దాన్ని ఇక్కడ రెంట్‌కు కూడా తీసుకోవచ్చని..ఆ సౌకర్యం కూడా ఇక్కడ ఉందని నిర్వాహకులు అంటున్నారు. విద్యార్థుల నుండి పాత పుస్తకాలను వీళ్ళు ఇక్కడ కొనుగోలు చేసి..వాటిని సగం ధరకు కావాల్సిన వాళ్లకు అమ్ముతారు. పోటీ పరీక్షలకు అధిక మొత్తంలో కొత్త పుస్తకాలు కొనుక్కోలేని విద్యార్థులకు ఇది సువర్ణవకాశం. ఇక్కడ అన్ని రకాల పోటీ పరీక్షలకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

ఇది చదవండి: కాదేదీ కళకు అనర్హం అన్నట్లు..గుడ్డుపైనే అద్భుత కళాకండాలు..!అబ్బురపరుస్తున్న విశాఖ కళాకారుడు..!

ప్రస్తుతం పీడీఎప్‌, ఈ-బుక్స్‌ వల్ల పుస్తకాలు కొనేవారు, చదివేవారి సంఖ్య తగ్గింది..దీంతో వినియోగం కాస్త తగ్గిందని నిర్వాహకులు తెలిపారు. ఈ-బుక్స్ మరియు PDF ఫార్మాట్ పుస్తకాలను పరిచయం చేయడం వలన తమ దుకాణాలకు ఆదరణ తక్కువైందని నిర్వాహకులు అంటున్నారు. విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత వారికి ఇచ్చే పుస్తకాలను ధరలో 40% కొనుగోలు చేస్తారు. వారి లాభాల మార్జిన్ కేవలం 10% మాత్రమే. మొదట్లో, ఆన్‌లైన్‌లో కేవలం నవలలు మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు అకడమిక్ పుస్తకాలు కూడా ఇ-బుక్స్‌గా అందుబాటులో ఉన్నాయి అంటున్నారు నిర్వాహకులు.

లక్ష పెట్టుబడితో ఇంటి నుంచే అధిక లాభార్జన.. ఇంతకీ ఆ యువకులు ఏంచేస్తున్నారంటే..!

వారి ఆదాయంలో దాదాపు 98% అకడమిక్ పుస్తకాల అమ్మకం నుండే వస్తుంది, అయితే నవలలు, కాఫీ టేబుల్ పుస్తకాలు మరియు నిఘంటువులు వంటి ఇతర పుస్తకాలు వారి అమ్మకాలలో దాదాపు రెండు శాతం మాత్రమే ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువగా ఇక్కడికి ఆంధ్రా యూనివర్శిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ , ఓపెన్ యూనివర్శిటీలలో చదివే అనేక మంది విద్యాసంస్థల విద్యార్థులే తమ రెగ్యులర్ కస్టమర్లు అని బుక్‌ స్టాల్ నిర్వాహకులు అంటున్నారు.

ఇది చదవండి: పాయా దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇక్కడ దొరికే దోశ ఒక్కసారి తిన్నారంటే ఆహా అనాల్సిందే..!

ప్రస్తుతం ఒక రోజులో ముగ్గురు కంటే ఎక్కువ కస్టమర్లను చూడటం లేదు నిర్వాహకులు. రెండు దశాబ్దాల క్రితం ఆ సెంటర్‌లో కేవలం 15 సెకండ్ హ్యాండ్ పుస్తక దుకాణాలు మాత్రమే ఉండేవి కానీ అవి ఇప్పుడు 36కి పెరిగాయి. విద్యార్థులు ఆదరణతోనే ఈ బుక్ స్టాల్స్‌ను నడుపుతున్నమని నిర్వాహకులు అంటున్నారు.

అడ్రస్..: పోలీస్‌ బెరాక్స్‌ బస్టాప్‌, రాజా రామ్మోహన్‌ రాయ్‌ రోడ్, సూర్యబాగ్‌, జగదాంబ జంక్షన్‌, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్‌- 530020

Visakhapatnam Book Market

ఎలా వెళ్లాలి..? విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పోలీస్ బ్యారెక్స్‌కి ఆటో బస్సు సౌకర్యం కలదు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు