Setti Jagadeesh, News18, Visakhapatnam
ఆసలే చలికాలం. కూల్ వెదరకు తగ్గట్లుగా కాస్త మసాలా దట్టించిన నాన్ వెజ్ ఉంటే ఆ మజానే వేరు. ఐతే ఇటీవల చికెన్ ధరలు (Chicken Price) పెరగడంతో నాన్ వెజ్ ప్రియులు కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం కార్తీక మాసంతో చికెన్ ధరలు చాలా తగ్గాయి. విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో ముక్కలేనిదే ముద్ద దిగదంటారు నాన్ వెజ్ ప్రియులు. ధర ఎంతైనా వారానికి ఒకసారైనా లాగిస్తారు. కానీ కార్తీక మాసం ఎఫెక్ట్‌తో చికెన్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. దీంతో ఎప్పుడూ బిజీగా ఉండే చికెన్ సెంటర్స్ పబ్లిక్ లేక బోసి పోయి కనిపిస్తున్నాయి.వ్యాపారులు బిజినెస్ లేక ఇబ్బంది పడుతున్నారు.
మెనూలో నాన్ వెజ్ కంపల్సరీ. చికెన్, మటన్, ఫిష్ ఏదీ లేకపోతే లాస్ట్ కు ఎగ్ అయినా మస్ట్ గా మెనూలో ఉంటుంది. ధర ఎంతైనా వారానికి ఒకటి రెండు సార్లు తప్పకుండా లాగిస్తారు. కానీ కార్తీకమాసం ఎఫెక్ట్ తో నగరంలో నాన్ వెజ్ సేల్స్ బాగా తగ్గాయి. ధరలు తక్కువగా ఉన్నా కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు8.ఏటా కార్తీక మాసంలో నాన్ వెజ్ ధరలు తక్కువగా ఉంటాయి.
శివారాధన చేసే చాలా మంది భక్తులు ఈ నెల రోజుల పాటు నాన్ వెజ్ ముట్టరు. దీంతో సిటీలోని చికెన్, మటన్ షాపులు కస్టమర్లు రాక బోసిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు కార్తీక మాసంలో చాలా మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటారు. ఇంట్లో ఒకరు దీక్షలో ఉన్నా.. పూర్తి కుటుంబం నాన్ వెజ్‌కి దూరంగా ఉంటుంది. దీంతో బిజినెస్ పెద్దగా లేదని వ్యాపారులు చెబుతున్నారు.
కస్టమర్లు రావడం లేదు
గతంలో రేట్ తగ్గితే అరకిలో కొనేవారు కిలో కొనేవాళ్లని.. కానీ ఇప్పుడు అలాంటి కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ చికెన్ 200 రూపాయలు వరకూ ఉందంటున్నారు. తమకు కూడా పెద్దగా వ్యాపారం లేదంటున్నారు.. హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు. నాన్ వెజ్ ఐటమ్స్ ఎన్ని రకాలున్నా.. చాలా మంది పబ్లిక్ వాటిని టచ్ చేయట్లేదని హోటల్స్ వ్యాపారులు చెబుతున్నారు. కనీసం వెజ్ లో వెరైటీ వంటకాలు చేద్దామంటే కూరగాయల ధరలు మండిపోతున్నాయంటున్నారు.చికెన్ తో పాటు మటన్, సీఫుడ్ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chicken price down, Local News, Visakhapatnam