హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakapatnam: ఈ మూడు రోజులు భలే డిమాండ్.. రేపటి నుంచి రెండు రోజులు పాటు భారీగా వివాహాలు.. లేదంటే మ‌ళ్లీ 3 నెల‌లు ఆగాల్సిందే..

Visakapatnam: ఈ మూడు రోజులు భలే డిమాండ్.. రేపటి నుంచి రెండు రోజులు పాటు భారీగా వివాహాలు.. లేదంటే మ‌ళ్లీ 3 నెల‌లు ఆగాల్సిందే..

good deed days for marriage

good deed days for marriage

ఈనెల 20,21(సోమ‌, మంగ‌ళ‌వారం) తేదిలు మాత్ర‌మే మిగిలిఉన్నాయి. శ్రావణ మాసంలో ఆగస్టు నెల 21 వరకే పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయట. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు(good deeds) జరిగాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Anand Mohan, News 18 Reporter, Visakhapatnam


  రాష్ట్రంలో వివాహాల‌కు ముహుర్తం ఇక మిగిలింది రెండు రోజులే. హిందూ పెళ్లిళ్ల‌కు సంబంధించి ఈనెల 20,21(సోమ‌, మంగ‌ళ‌వారం) తేదిలు మాత్ర‌మే మిగిలిఉన్నాయి. ఈ రెండు రోజులు దాటితే మ‌ర‌లా 3 నెల‌ల పాటు ఆగాల్సిందే. శ్రావణ మాసంలో ఆగస్టు నెల 21 వరకే పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయట. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు(good deeds) జరిగాయి. ఆగస్టు ఒకటి నుంచి మూడోవారం వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ముహుర్తాలు పెట్టుకున్న వారి ఇళ్లల్లో సందడి మొదలైంది. ఆగస్టు 1, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 16, 17, 20, 21 తేదీల్లో అధిక ముహూర్తాలు ఉన్నాయి.  అంటే ఈనెల చివరకు చూసుకుంటే ఇక మిగిలి రేపొక్కరోజే..!


  ఆగస్టులో ముహూర్తం కుదరకపోతే తర్వాత 4 నెలల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఆగస్టు 6వ తేదీ రాత్రి ముహూర్తానికి భారీగా పెళ్లిళ్లు జరిగాయి. గతంలో శ్రావణ(sravana ) మాసంలో ముహుర్తం కుదరకపోతే.. కార్తీక మాసంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేవారు. జులై, ఆగస్టు నెలలలో కురిసే వానల కారణంగా అక్టోబరు(october), నవంబరు(november) నెలల్లో వచ్చే కార్తికంలోని ముహూర్తాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వచ్చే నాలుగు నెలలు గురు, శుక్ర మూఢాలు రావడంతో ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం అన్ని జిల్లాల్ల‌లో పెళ్లిళ్ల సంద‌డి నెల‌కొంది. గ‌త వారం రోజులుగా ఎక్క‌డిక‌క్క‌డ క‌ళ్యాణ మండ‌పా వ‌ద్ద హ‌డావుడి. శ్రావ‌ణమాసం చివ‌రి రోజుల్లో జ‌రిగే ఈవివాహాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఉంటుంద‌నే కార‌ణంతోపాటు, జ‌న్మ‌న‌క్ష‌త్రాల ఆధారంగా ఎక్కువ‌గా వివాహాలు చేసుకుంటున్నారు.


  ఈ ప్ర‌భావంతో ఎన్న‌డూ లేని 9విధంగా మార్కెట్లు సంద‌డిగా మారాయి. షాపింగ్ మాల్స్ (Shopping malls) వ‌ద్ద నిత్యం జ‌నం బారులు తీరుతున్నారు. గోల్డ్ షాప్‌ల (jewlery shops) వ‌ద్ద వ‌నిత‌ల హ‌డావుడితో దుకాణాలన్ని క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.  వివాహా విందుల‌కు సంబంధించి ఆర్డ‌ర్లు తీసుకునే హోట‌ళ్లు, వంట‌శాల‌ల‌కు భారీగా గిరాకీ ఏర్ప‌డింది. ఇదిలా ఉంటే, పెళ్లిల‌కు ప్ర‌సిద్ధిగాంచిన దేవాల‌యాల‌న్ని కిట‌కిట‌లాడుతున్నాయి. పురోహితుల‌కు భారీ డిమాండ్ పెరిగింది.


  విశాఖ(Vizag), తూర్పుగోదావ‌రి (east godavari), ప‌శ్చిమ‌గోదావ‌రి (west godavari) జిల్లాల్లో ఈసంద‌డి మ‌రింత‌గా ఉంది. అన్న‌వ‌రం శ్రీ వీర‌వెంక‌ట స‌త్య‌నారాయ‌ణస్వామి స‌న్నిధిలో ఈనెల 19,20 తేదిల్లో దాదాపుగా 500 వివాహాలు జ‌రిగాయి. ఇక కాకినాడ‌(Kakinada), రాజ‌మండ్రి (Rajahmundry) స‌మీపంలో క‌ళ్యాణ మండ‌పాల‌న్ని కిట‌కిట‌లాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈనెల 23వ తేది నుండి మూఢం స‌మీపిస్తున్నందున మూఢ కాలంలో వివాహాలు, శుభ‌కార్యాలు జ‌ర‌గ‌డం అనేది హిందూ సాంప్ర‌దాయ విధానాల‌కు విరుద్ధం ఈనేప‌థ్యంలో ప్ర‌స్తుతం పెళ్లిలు చ‌క‌చ‌కా జ‌రిపించేస్తున్నరు.


  Read this also; Peddapalli: దేవుడు లేని గుడి: అయినా అక్కడికి ప్రజలు ఎందుకు బారులు తీరుతున్నారు?


  ఇక అదే స్పీడులో గృహ‌ప్ర‌వేశాలు కూడా జరుగుతున్నాయి. దాదాపుగా డిసెంబ‌ర్ నెల వ‌ర‌కూ మంచి ముహుర్తాలు లేవ‌నే కార‌ణంతో గృహ‌ప్ర‌వేశాలు సైతం జ‌రిగిపోతున్నాయి. నిర్మాణం పూర్తికాని భ‌వ‌నాల‌కు సైతం బ‌య‌ట తెలుపు రంగు పూసి ఇంటిలోప‌ల పాదం పెట్టేస్తున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో దాదాపుగా ఈ వారంలో  1200 కి పైగా నూత‌న గృహ ప్ర‌వేశాలు జ‌రిగాయంటే ఈ ముహుర్తం ప్ర‌భావం ఎంత గ‌ట్టిగా ఉందో చెప్ప‌వ‌చ్చు.  ముహుర్తం ప్ర‌భావం మొత్తం వాణిజ్యరంగంపై ప‌డింద‌నేది ప్ర‌స్తుతం మార్కెట్లో టాక్ వినిపిస్తోంది.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, Dates, Vishakaptnam

  ఉత్తమ కథలు