Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.
Best Tourist spot in Vizag: సువిశాల సాగర తీరమైన విశాఖపట్నం (Visakhapatnam) లో ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఆహ్లాదాన్ని పంచే బీచ్ లు మాత్రేమే కాదు.. వినోదాన్ని.. చక్కని ప్రశాంతతను అందించే పార్కులు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కార్తీక మాసం (Karthika Masam) లో వన భోజనాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. అలా బెస్ట్ పికినిక్ స్పాట్ (Best Picnic Spot) గా నిలుస్తున్నవాటిలో గోకుల్ పార్క్ (Gokul Park) ఒకటి.. ఇప్పుడు ఆ పార్కుకి కొత్త హంగులు అద్దుతున్నారు. ముఖ్యంగా చిన్నారులని ఆకట్టుకునే విధంగా.. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆధ్యాత్మిక పెంపొందేలా ఆధునీకరిస్తున్నారు.
కార్తీక మాసం అంటే పికినిక్ లు.. వన భోజనాలకు ఎక్కు ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి వారికి బెస్ట్ ప్లేస్ గా నిలుస్తోంది గోకుల్ పార్క్. ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్న పార్క్ ను ఆధునీకరిస్తున్నారు. మరిన్ని మార్పులు, కొత్త హంగులతో గోకుల్ పార్క్ ఆధునీకరణ పనులు జరిగాయి. అటు చిన్నారులని ఆకట్టుకునే విధంగా.. ఇటు ఆధ్యాత్మికత, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పెద్దలు ప్రశాంతంగా గడపడానికి ప్రదేశం బాగుంటుంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజల సందర్శనార్ధం పార్కును ఆధునీకరించామని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. ఆర్కే బీచ్ లోని గోకుల్ పార్కు ను సుమారు 30.50 లక్షలతో ఆధునీకరించిన పనులకు జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు, ఎం ఎల్ సి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో కలసి ప్రారంభించారు.
ఇదీ చదవండి : సూడాన్ టు చిత్తూరు .. మత్తులోకలంలో యువత.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఎంతో మంది భక్తులు బీచ్ లో గోకుల్ పార్కులోని శ్రీ కృష్ణ మందిరాన్ని సందర్శిస్తారని వారికి సౌకర్యాల కల్పనకు గోకుల్ పార్కును సుమారు 30.50 లక్షలతో శ్రీ కృష్ణుడు పిల్లని గ్రోవితో ఆర్చ్, బనియన్ ట్రీతో రాధా కృష్ణులకు నీడ, సందర్శకులకు కూర్చునేందుకు సిమెంటు బెంచీలు, బీచ్ వైపు ఉన్న పిల్లర్సు మరమ్మత్తులు, పెయింటింగ్, ఫ్లోరింగ్, విద్యుత్ మొదలైన పనులను ఆధునీకరించాలని తెలిపారు.
ఇదీ చదవండి : అలీ మనసు మారిందా..? పవన్ ను అంత మాట అనడానికి ఆ పదవే కారణమా..?
జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున బీచ్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్న దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం, మరుగుదొడ్లు మొదలైనవి ఏర్పటుచేసారన్నారు. సందర్శనానికి వచ్చే భక్తులు వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్ధాలు, పూజా సామాగ్రిల వ్యర్ధాలను, అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలో వేయాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే నగర పరిశుభ్రతకు బీచ్ లో నిషేధిత ప్లాస్టిక్ ను వాడరాదని, ప్రత్యామ్నాయ వస్తువులనే వాడాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Best tourist places, Visakhapatnam