Vizag: విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో గంజాయి కలకలం... నలుగురు అరెస్ట్..!
Vizag: విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో గంజాయి కలకలం... నలుగురు అరెస్ట్..!
విశాఖ ఏయూలో గంజాయి కలకలం రేపింది. రాత్రి బీచ్ రోడ్డులోని యోగా విలేజ్ వద్ద ఆగి ఉన్న ఆటోను విశాఖ పోలీసులు సోదాలు చేశారు. విశాఖ మూడో పట్టణ సీఐ రామారావు, ఎస్సై సంతోష్‌కుమార్ కలిసి ఆటోను తనిఖీ చేశారు.
విశాఖ ఏయూలో గంజాయి కలకలం రేపింది. రాత్రి బీచ్ రోడ్డులోని యోగా విలేజ్ వద్ద ఆగి ఉన్న ఆటోను విశాఖ పోలీసులు సోదాలు చేశారు. విశాఖ మూడో పట్టణ సీఐ రామారావు, ఎస్సై సంతోష్‌కుమార్ కలిసి ఆటోను తనిఖీ చేశారు.
విశాఖ జిల్లాలో గంజాయి కలకలం చెలరేగింది. వైజాగ్ ఆంధ్రా యూనివర్శిటీలో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. ఏయూలో సెక్యూరిటీ గార్డులు నిషేధిత గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ వ్యవహారంలో ఏయూ సెక్యూరిటీ ఆఫీసర్ కారు డ్రైవర్ కీలక సూత్రధారని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి బీచ్ రోడ్డులోని యోగా విలేజ్ వద్ద ఆగి ఉన్న ఆటోను విశాఖ పోలీసులు సోదాలు చేశారు. విశాఖ మూడో పట్టణ సీఐ రామారావు, ఎస్సై సంతోష్‌కుమార్ కలిసి ఆటోను తనిఖీ చేశారు. అందులో చిన్న పొట్లాల్లో గంజాయిని గుర్తించారు. అక్కడే ఒకరిని పట్టుకోగా మిగిలిన వారు పరారయ్యారు. రెండో వ్యక్తి శివాజీపాలెంలోని ఏయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు సమీపంలో, మూడో వ్యక్తి బీచ్‌రోడ్డులో అరెస్ట్ చేశారు. అయితే . వీరిని చంద్రమౌళి, సురేశ్, అప్పలరాజుగా పోలీసులు గుర్తించారు.
వీరంతా ఆంధ్రా యూనివర్శిటీలో పనిచేస్తున్న వారేనని, చంద్రమౌళి వర్సిటీ సెక్యూరిటీ వ్యవహారాలను పర్యవేక్షించే ఒక కీలక అధికారికి వ్యక్తిగత డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. విశ్వవిద్యాలయంలోనే విద్యార్థుల వసతి గృహాలు ఉండటంతో గంజాయిని వారికి సరఫరా చేస్తున్నారా... అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఇద్దరికి గంజాయి తాగే అలవాటున్నట్లు గుర్తించారు.
అయితే దాడుల సమయంలో అరకిలో దొరికినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే... అయిదు కిలోల వరకు గంజాయి దొరికినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంజాయి కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు రెండు వాహనాలను సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని అక్రమంగా తరలించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.