Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM GANJA SMUGGLERS ARRESTED IN VISAKHAPATNAM AS THEY SHIFTING TO UTTAR PRADESH FULL DETAILS HERE PRN VNL NJ

Vizag News: ఏపీ టు యూపీ.. కొత్త దారిలో గంజాయి గ్యాంగ్.. పోలీసులకు ఎలా చిక్కారంటే..

పోలీసుల అదుపులో గంజాయి స్మగ్లర్లు

పోలీసుల అదుపులో గంజాయి స్మగ్లర్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాష్ట్రంలో గంజాయి మాఫియాను కూకూటి వేళ్లతో పెకలించి వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మన రాష్ట్రంలో గంజాయి దందాను కొనసాగిస్తున్న స్మగ్లర్లకు చెక్‌ పెట్టేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) సిద్ధమైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam
    Neelima Eaty, News18, Visakhapatnam

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాష్ట్రంలో గంజాయి మాఫియాను కూకూటి వేళ్లతో పెకలించి వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మన రాష్ట్రంలో గంజాయి దందాను కొనసాగిస్తున్న స్మగ్లర్లకు చెక్‌ పెట్టేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) సిద్ధమైంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీలో) 8 వేల ఎకరాలకుపైగా గంజాయి సాగును సెబ్‌ ధ్వంసం చేసింది. ఇప్పుడు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. అందుకోసం అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల జాబితాను రూపొందించింది. ఆ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణకు ఉపక్రమించింది. అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్‌ కోసం స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోను ప్రభుత్వం నియమిచ్చింది.

    ఈ మేరకు బుధవారం విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) జీవీఎంసీ పరిధిలో లో గల కెప్టెన్ రామారావు జంక్షన్ , జ్యోతి దియేటర్ వద్దకమిషనర్ ఆఫ్ పోలీస్ సీ హెచ్.శ్రీకాంత్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు, ఆదేశాల మేరకు కెప్టెన్ రామారావు జంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు . ఈ తనిఖిల్లో భాగముగాఐదుగురు వ్యక్తులు 80 కేజీల గంజాయితో పట్టుబడ్డారు.

    ఇది చదవండి: కడప జిల్లాలో వీడిన మృతదేహాల మిస్టరీ.. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు..


    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బలిజపలెంకు చెందిన రమణ తన తమ్ముడి ఫ్రెండ్ లక్ష్మణ ముర్తితో కలిసి గంజాయి అక్రమ రవాణా చేసేవాడు. ఈ లక్ష్మణ మూర్తికి యూపీకి చెందిన గౌరబ్ అనే వ్యక్తితో పాత పరిచయాలు ఉన్నాయి. దీంతో రమణ యూపీకి గంజాయి అక్రమ రవాణా చేసేందుకు గౌరబ్ తో కలిసి స్కెచ్ వేశాడు.


    ఇది చదవండి: ప్రియుడు పోలీస్ అని భర్తకు విడాకులిచ్చింది.. కట్ చేస్తే కథ అడ్డం తిరిగింది


    దీని కోసం మరో నలుగురిని గౌరబ్ విశాఖకు పంపించాడు. ఈ విషయం తెలుసుకున్న సెబ్ పోలీసులు.. రామారావు జంక్షన్ వద్ద కాపుకాసి యూపి నుండి వచ్చిన నలుగురితో పాటు రమణను పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ఢిల్లీ ప్రాంతానికి చెందిన అజీమ్ (24 ), వసీం ఆబ్బాసి(33) , ఉత్తరప్రదేశ్ రాష్టానికి చెందిన బషీం (26), సోను (24) మరియు బలిజిపాలేం గ్రామానికి చెందిన కోడి రమణ (23) ఉన్నారు. వారి నుంచి 80 కేజి ల గంజాయి ,1 ద్విచక్ర వాహనం , 5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో పాలొన్న అధికారులకు సిబ్బందికి పోలిస్ కమిసనర్ సీ హెచ్ శ్రీకాంత్ ,ఎస్ఈబి జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావుప్రత్యేక అభినందనలు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ganja smuggling, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు