హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ganesh Immersion 2022: ఇకపై ఇంటిదగ్గరే వినాయక నిమజ్జనం.. ప్రత్యేక చర్యలు చేపట్టిన అధికారులు.. ఎలా అనుకుంటున్నారా?

Ganesh Immersion 2022: ఇకపై ఇంటిదగ్గరే వినాయక నిమజ్జనం.. ప్రత్యేక చర్యలు చేపట్టిన అధికారులు.. ఎలా అనుకుంటున్నారా?

ఇంటి దగ్గరే గణేష్ నిమజ్జనం

ఇంటి దగ్గరే గణేష్ నిమజ్జనం

Ganesh Immersion 2022: ఘనంగా పూజలు అందుకున్న గణపతి.. ఇక నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే కొన్ని చోట్ల నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంటి దగ్గరే గణపతిని నిమజ్జనం చేసే అవకాశం కల్పించారు.. ఎలాగో తెలుసా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Ganesh Immersion 2022:  తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు (Vinayaka Chavithi Celebrations) జరుగుతున్నాయి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి (Ganesh Chaturthi). గణనాథుని కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. జ్యోతిషశాస్త్రం (Astrology) ప్రకారం విఘ్నేశ్వరుడి ఆరాధనలో కుజుడు, బుధుడు, కేతు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుంది. విఘ్నేశ్వరుడు (Lord Ganesh) ధూమకేతు గణాధ్యక్షుడు, మోక్ష కారకత్వానికి అధినాయకుడు కావడంతో కేతు గ్రహానికి అధిపతి అయ్యాడని, బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞానప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కలుగుతుందని, అలాగే, కుజ గ్రహం అనుగ్రహం వివాహ, అన్యోన్య దాంపత్యానికి చిహ్నం. ఒక్క పార్వతీ తనయుడిని ఆరాధించడం వల్ల ఈ మూడు గ్రహాల అనుగ్రహం పొందవచ్చని జ్యోతిషశాస్త్రం పేర్కొంటోంది. అందుకే అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తుంటారు..సాధారణంగా వినాయక నవరాత్రులు ఎక్కువగా నిర్వహిస్తుంటారు.. తొమ్మి రోజుల పాటు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి.. తరువాత ప్రతిమకు ఉధ్వాసన పలికి.. భారీగా శోభా యాత్ర మధ్య వినాయక నిమజ్జనం చేస్తారు. ఎక్కువమంది తొమ్మిది రోజుల తరువాత వినాయక నిమజ్జనం చేయడానికి ఇష్టపడతారు. అయితే కొంతమంది మూడు రోజులు.. మరికొందరు ఐదు రోజులు.. కొందరైతే మరుచటి రోజే వినాయక నిమజ్జనం చేస్తూ ఉంటారు.  ఇప్పటికే కొన్ని చోట్ల వినాయక నిమజ్జనం సందడి కూడా మొదలైంది.


  విశాఖమహా నగరంలో ఈ వినాయక నిమజ్జన  సందడి అధికంగా ఉంటుంది. చాలామంది బీచ్ లో గణపయ్యలను నిమజ్జనం చేయాలని కోరుకుంటారు. మండపాల్లో ప్రతిష్టించిన దేవుళ్లనే కాదు.. ఇంటి దగ్గర పూజలు చేసిన.. బొజ్జగణపయ్యను సైతం.. బీచ్ లోనే నిమజ్జనం చేయాలనుకుంటారు.. దానికి కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈ సారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవీఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
  ఇదీ చదవండి : నేడు సొంత జిల్లాకు సీఎం జగన్ .. పార్టీ వ్యతిరేకతపై ఆరా.. పూర్తి షెడ్యూల్ ఇదే
  వినాయక నిమజ్జనం చేపట్టేందుకు గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) శ్రీకారం చుట్టింది. బొజ్జ గణపయ్య విగ్రహాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం చేసేందుకు మొబైల్ ట్యాంకులను ప్రవేశపెట్టింది. కృత్రిమ ట్యాంకులని విశాఖ నగరంలోని వివిధ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచి ఇళ్లలో ప్రతిష్టించి పూజించిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడంలో సహాయపడింది.
  ఇదీ చదవండి : ఏపీలో ఆకట్టుకుంటున్న వెరైటీ గణపయ్యలు.. ప్రత్యేక ఆకర్షణగా పైనాపిల్ వినాయకుడు
  విశాఖ పరిధిలో 16 కృత్రిమ మొబైల్ నిమజ్జనం ట్యాంకులను ఏర్పాటు చేశారు. అయితే అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను పెంచనున్నట్లు జీవీఎంసీ కమిషనర్‌ జీ లక్ష్మీశ మొదట్లో చెప్పారు. తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ రకం ట్యాంకులతో వినాయక నిమజ్జనం చాలా సులభమయింది అంటున్నారు నగర వాసులు.
  ఇదీ చదవండి : మందులను దేవుడి ప్రసాదంలా సేవిస్తున్న బాలయ్య.. టీవీపై జోక్ వింటే పడి పడి నవ్వాల్సిందే
  10X16 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో భారీ వాహనాలను ఇందుకోసం తీర్చిదిద్దారు. బుధవారం వినాయక చవితి నుంచి వివిధ పాయింట్లలో ఉంచారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇలాంటి పర్యావరణ అనుకూల నిమజ్జన పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇక విశాఖలో ఇదే మొదటిసారి. విగ్రహాలను నిమజ్జనం చేసి సముద్రాన్ని కలుషితం చేయకుండా నిలువరించేందుకు ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganesh Chaturthi​ 2022, Vinayaka Chavithi 2022, Visakhapatnam

  ఉత్తమ కథలు