హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ganesh immersion 2022: దేశంలోనే రెండో అతి పెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం.. ఎలా చేశారో చూడండి

Ganesh immersion 2022: దేశంలోనే రెండో అతి పెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం.. ఎలా చేశారో చూడండి

దేశంలో రెండో అతి పెద్ద విగ్రహం నిమజ్జనం

దేశంలో రెండో అతి పెద్ద విగ్రహం నిమజ్జనం

Ganesh immersion 2022: వినాయక నవరాత్రుల్లో ఘనంగా పూజలు అందుకు గణపతికి అంతా బైబై చెప్పేసారు. దేశ వ్యాప్తంగా వినియక నిమజ్జనాలు సందడిగా సాగాయి. దేశంలోనే రెండో అతి పెద్దదైన మట్టి వినాయకుడి నిమజ్జనం ఎలా చేస్తున్నారో చూడండి.

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Ganesh immersion 2022: తొమ్మిది రాత్రుల పాటు భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపయ్యకు  పూజలు చేసిన ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా వీడ్కోలు పలికారు. కొన్ని చోట్ల శుక్రవారమే.. నిమజ్జనం పూర్తి చేస్తే.. ఈ రోజు కొన్ని చోట్ల నిమ్మజనాలు చేపట్టారు. ఈ ఏడాది.. ప్రజల్లో అవగాహన భారీగానే పెరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహలను (Eco Friendly Ganesh Idol) ప్రతిటిష్టించాలని జరుగుతున్న ప్రయత్నం నెమ్మదిగా కార్యాచరణలోకి వస్తుంది. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ తో చేసిన భారీ విగ్రహాలను  ప్రతిష్టించేవారు. వీటిని నదుల్లో నిమజ్జనం చేయడం ద్వారా రంగులు నీటిలో కాలుసి, నీరు కలుషితం అయ్యేది. కానీ ఇప్పుడు అంతా మట్టి విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. అది కూడా భారీ ఎత్తైన విగ్రహాలను తయారుచేయించి చాలా చోట్ల ప్రతిష్టించారు.

  నిమజ్జనాల్లో భాగంగా.. భారత దేశంలోనే రెండో పెద్దది అయిన.. కర్నూలు (Kurnool) లో మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. తొమ్మిది రాత్రుల పాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తరువాత.. భారీ గణపతికి కర్నూలులో తుంగభద్ర నది దగ్గర నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తజనం భారీగా తరలివచ్చారు. ఈ మట్టి విగ్రహం ఎత్తు ఎత్తు 55 అడుగులు. ఈ భారీ మట్టి వినాయకుడిని వేలాదిమంది భక్తులు నిమజ్జనం చేశారు.

  వాస్తవంగా ఈనెల 8నే కర్నూలులో వినాయక నిమజ్జనం జరిగింది. అయితే 55 అడుగుల భారీ మట్టి వినాయకుడిని మాత్రం.. నేడు నిమజ్జనం చేస్తున్నారు. రెండు నెలలపాటు బీహార్ రాజస్థాన్ నుంచి వచ్చిన కార్మికులు తుంగభద్రా నది ఒడ్డున ఈవిగ్రహన్ని తయారు చేశారు. ఆతర్వాత అక్కడే ప్రతిష్టించారు. ప్రతిష్టించిన చోటనే ఫైర్ ఇంజన్ల ద్వారా నీటిని కొట్టి మట్టి వినాయకుడు కరిగిపోయేలా చేసి నిమజ్జనం చేశారు.

  మరోవైపు విశాఖ జిల్లా గాజువాకలో ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహానికి ముప్పు పొంచి ఉంది. 89 అడుగుల ఈ భారీ వినాయక మట్టి విగ్రహం ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోయింది. విగ్రహం ఎక్కడ కింద పడిపోతుందోనని ఆందోళన నెలకొంది.

  ఇదీ చదవండి : పరీక్ష కోసం ఇంత సాహసమా..? ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని దాటిన యువతి

  తాజా ఘటనతో ఏ క్షణమైనా ప్రమాదం జరిగేందుకు ముప్పు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. విగ్రహానికి 100 మీటర్ల లోపు ఎవరినీ అనుమతించడం లేదు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఆర్‌ అండ్ బీ అధికారులకు మండపం వద్దకు వచ్చి పరిశీలించారు. ప్రమాదానికి అవకాశం ఉందని వారు పోలీసులకు తెలిపారు. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉన్నందున సాధ్యమైనంత త్వరగా నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటీని పోలీసులు ఆదేశించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganesh Chaturthi​ 2022, Kurnool

  ఉత్తమ కథలు