Ganesh Chaturthi 2022: భారత దేశ వ్యాప్తంగా వినాయక చవితి (Vinayaka Chavithi) శోభ నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. రేపటి నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వివిధ ఆలయాల్లో వెలసి బొజ్జ గణపయ్యలు సైతం పూజలకు సిద్ధమయ్యారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లూ వినాయక నవరాత్రుల సందడి పెద్దగా కనిపించలేదు.. అందుకే ఇప్పుడు మరింత భక్తి శ్రద్ధలతో పూజలు చేసేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఇప్పటికే వివిధ రూపాల్లో వినాయకులను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. అయితే కొందరు ప్రతి ఏడాదిలానే ఆనవాయితీని కొనసాగిస్తూ.. గణపతిని భక్తితో కొలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు రూపాల్లో గణేషుడు దర్శనమించేందుకు సిద్ధమయ్యాడు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam district)లోని అనకాపల్లి (Anakapalli)లోని నూకాంబిక అమ్మవారి ఆలయంలో.. ప్రతి ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా వినాయకుడ్ని ప్రతిష్టిస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేన్నట్టుగా పాలవెల్లులతో మండపాన్ని అత్యంత అందంగా అలంకరించి.. లక్షల పసపు కొమ్ములతో ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. దీన్ని హరిద్ర గరణపతి (Haridra Ganapathi) అని పిలుస్తారు. ఈ హరిద్ర గణపతి ప్రత్యేకత ఏంటో తెలుసా..? దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన హరిద్ర గణపతిని చూశారా.. #VinayakaChavithi #VinayakaChavithi2021 #VinayakaChaturthi2021 #vinayakachavathi
Ganesh Chaturthi 2021 || Vinayaka Chavithi Specail Ganesha || దేశంలోనే అ... https://t.co/wdYNGIMin7 via @YouTube
— nagesh Journlist (@nageshzee) September 10, 2021
హరిద్ర గణపతిని పూజించడం చాలా మేలు చేస్తోంది అంటున్నారు పండితులు. ముఖ్యంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు హరిద్ర గణపతిని ఆరాధించడం మంచిది. వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. పసుపుముద్దతో కాకుండా పసుపు కొమ్ముపైనే వినాయకుని ఆకారాన్ని పూజమందిరంలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవచ్చు.
ఇదీ చదవండి : చంద్రుడు ప్రతిష్టించిన గణేషుడు గురించి విన్నారు.. మనసారా కోరుకుంటే మీ సమస్యలు తీరినట్టే
అయితే పసుపుకొమ్ముపై రూపొందించిన గణపతినే హరిద్ర గణపతి అంటారు. పసుపు కొమ్ముపై చెక్కించిన హరిద్ర గణపతిని పసుపు రంగు వస్త్రంపై ఉంచి పూజించాలి. ఏదైనా గురువారం రోజున హరిద్ర గణపతి పూజను ప్రారంభించవచ్చు. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు సమసిపోవడానికి, వివాహ దోషాలు తొలగిపోవడానికి, పరీక్షలలో ఉత్తీర్ణతకు హరిద్ర గణపతి ఆరాధన ప్రశస్తమైనది.
ఇదీ చదవండి : తిరుమల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు.. వీటి వెనుక 400 ఏళ్ల చరిత్ర.. ప్రత్యేకత ఏంటంటే?
వ్యాపార సంస్థలు నడిపేవారు హరిద్ర గణపతి మూర్తిని గల్లాపెట్టెలో ఉంచినట్లయితే, ఆటంకాలు తొలగి వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగుతాయి అంటున్నారు. హరిద్ర గణపతికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించి, గణపతి మూల మంత్రాన్ని, గణేశ గాయత్రీ మంతాన్ని పదకొండు సార్లు చొప్పున పఠించాలి. పురోహితులకు శనగలు, పసుపు రంగు వస్త్రాలను ఇతోధిక దక్షిణతో కలిపి దానం చేయాలి. గురువులను తగిన కానుకలతో సత్కరించి, వారి ఆశీస్సులు పొందాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ganesh Chaturthi, Lord Ganesh, Vinayaka chavathi