Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM FREE SKATING TRAINING AT INDIRA GANDI PARK NEAR VIZAG STEEL PLANT YOU CAN BRING CHILDREN FOR COACHING FULL DETAILS HERE PRN VNL NJ

Vizag News: స్కేటింగ్‌ నేర్చుకోవాలనుకునే వాళ్లకు గుడ్‌న్యూస్‌..! అక్కడ కోచింగ్ ఫ్రీ.. వివరాలివే..!

విశాఖలో

విశాఖలో ఫ్రీగా స్కేటింగ్ కోచింగ్

స్కేటింగ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉందా..? నేర్చించే ట్రైనింగ్‌ సెంటర్లు మీకు దగ్గరలో ఉన్నా..? ఒకవేళ అక్కడకు వెళ్లాలన్నా వేలకు వేలు డబ్బులు కట్టలేని పరిస్థితా..? మీరు వైజాగ్‌కు చెందిన వాళ్లయితే మీకో గుడ్‌ న్యూస్‌.

    Neelima Eaty, News18, Visakhapatnam

    స్కేటింగ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉందా..? నేర్పించే ట్రైనింగ్‌ సెంటర్లు మీకు దగ్గరలో ఉన్నా..? ఒకవేళ అక్కడకు వెళ్లాలన్నా వేలకు వేలు డబ్బులు కట్టలేని పరిస్థితా..? మీరు వైజాగ్‌ (Vizag) కు చెందిన వాళ్లయితే మీకో గుడ్‌ న్యూస్‌. విశాఖపట్నం (Visakhapatnam) స్టీల్‌ ప్లాంట్‌లోని ఇందిరా గాంధీ పార్క్‌ లో ఉన్న స్కేటింగ్ రింక్ దగ్గర అద్భుతంగా నేర్పిస్తున్నారు. ఆసక్తి ఉన్న ఎవ్వరైనా ఇందులో జాయిన్‌ అవ్వొచ్చు. ఐదేళ్ల వయసు దాటితే చాలు. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌లోని ఇందిరగాంధీ పార్క్‌ లో ఉండే ఈ స్కేటింగ్‌ రింగ్‌లో డైలీ పదుల సంఖ్యలో పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇక్కడ స్కేటింగ్ నేర్చుకున్న ఎంతో మంది... జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని విజయవంతం అయ్యారు. ఇక్కడ మొదటిగా జాయిన్ అయిన వారికి 1వ జోనెక్స్ ప్రాథమిక స్థాయి స్కేటింగ్ నేర్పిస్తారు. వారి టాలెంట్‌, నేర్చుకునే తీరు, అర్హతను బట్టి తదుపరి స్థాయి స్కేటింగ్ షూస్‌కి మార్చుతారు.

    ఇక్కడకు వచ్చేవారిని ముందుగా స్కేటింగ్ అంటే ఏంటి.. దానికి అలవాటు పడేలా చేస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా మెలుకువలు నేర్పిస్తూ వాళ్లకు అవగాహన కల్పిస్తూ.., స్కేటింగ్‌ నేర్చుకునేలా చేస్తామని అసిస్టెంట్ కోచ్‌ సాయి కిరణ్‌ తెలిపారు. స్కేటింగ్‌లో చాలా రకాలు ఉంటాయి. కానీ మేము రోలర్ హాకీకే ప్రిఫరేన్స్ ఇస్తామంటున్నారు. ఈ రోలర్‌ హాకీలో కూడా వేరియేషన్స్‌ ఉన్నాయి. ఇన్‌ లైన్‌( inline) క్వాడ్స్‌ (quads).

    ఇది చదవండి: మీకు సముద్రపు చేపలంటే ఇష్టమా..? ఇక్కడ చూడండి ఎన్నిరకాల చేపలో.. చూస్తే వదిలిపెట్టరు..!


    స్కేటింగ్‌ షూలతో హాకీ ప్రాక్టీస్‌
    తర్వాత ఉండేకొద్ది అభ్యాస స్థాయి ఆధారంగా మేము వారిని స్కేటింగ్ షూలపై హాకీ నేర్చుకునేలా చేస్తామని సాయి కిరణ్ చెబుతున్నారు మొదటి నుంచి స్టీల్‌ ప్లాంట్‌లో హాకీకి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. అందుకే స్కేటింగ్‌లోనూ హాకీనే ఎక్కువగా నేర్పిస్తూ ఉంటామంటున్నారు. ఇక్కడ స్కేటింగ్‌ నేర్చుకునే వాళ్లకు కోచ్‌లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అమిత్, కాశీ, గోపీ కోచ్‌లుగా చేస్తుండగా.. ఫలాదర్, గణేష్ మరియు సాయి కిరణ్ ఇక్కడ అసిస్టెంట్‌ కోచ్‌లుగా వర్క్‌చేస్తున్నారు.

    ఇది చదవండి: విశాఖ బీచ్ కు వెళ్లాలంటే ఇదే సరైన టైమ్.. ఆ అనుభవం మాటల్లో చెప్పలేరు..!


    ఇక్కడ స్కేటింగ్‌ నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవాళ్లు.. వాళ్ల తల్లిదండ్రులనో, గార్డియన్‌నో తీసుకెళ్తే సరిపోతుంది. ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి ఫీజు లేకుండా నేర్పిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌ ఉద్యోగుల పిల్లలు, స్థానికులు చాలామంది తమ పిల్లలను సాయంత్ర సమయాల్లో ఇక్కడకు తీసుకొచ్చి కోచింగ్‌ ఇప్పిస్తూ ఉంటారు. ఫిట్‌నెస్‌ కోసం ఈ స్కేటింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టానంటోంది పదో తరగతి విద్యార్థి ఓజస్విని. తను LKGలో ఉండగా.. తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్‌ చేశారని.., ఇప్పటికీ డైలీ ప్రాక్టీస్‌ చేస్తున్నానని చెబుతోంది ఈ ప్లేయర్‌. స్టేట్‌ లెవల్‌లో ఎన్నో కాంపిటేషన్స్‌ లో పాల్గొన్నానని.. ఇక్కడ ట్రైనింగ్‌, ప్రాక్టీస్‌ తనకెంతో ఉపయోగపందని ఓజస్విని చెబుతోంది.

    ఇది చదవండి: సాగరగర్భంలో అందమైన ప్రపంచం.. ఏపీ తీరంలో అరుదైన పగడపు దిబ్బలు..


    విద్యార్థులు స్కేటింగ్ నేర్చుకునే సమయం: సాయంత్రం 6.15 కల్లా పిల్లలు రింక్‌లోకి వెళ్లాలి. 6.30 నుంచి 7.30 గంటల వరకు రింక్‌లో స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తారు. ఆ తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చి 8గంటల వరకు ప్రాక్టీస్‌ చేయిస్తారు.

    అడ్రస్: డిపౌల్ స్కూల్ వెనక, ఇందిరా గాంధీ పార్క్, స్టీల్ ప్లాంట్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌-530032

    Visakhaptnam Indiragandhi park

    ఎలా వెళ్లాలి..?
    వైజాగ్‌ స్టీల్ ఫ్లాంట్‌ ఏరియాలో ఉన్న ఈ రిజర్వాయర్‌కు వెళ్లాలంటే బస్టాండ్‌ నుంచి 38k బస్సు ఎక్కితే చాలు స్టీల్‌ ప్లాంట్‌కు వెళ్తుంది. బస్టాండ్‌ నుంచి ఆటోలు, క్యాబ్‌లలో వెళ్తే 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. బైక్‌లు, కార్‌లలోనే ఎక్కువగా స్థానికులు వస్తుంటారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

    తదుపరి వార్తలు