Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM FRANK CABLE AMERICA WARSHIP AT VIZAG PORT VSJ NJ ABH

Vizag : వైజాగ్‌లో అమెరికా యుద్ధనౌక… 12 అంతస్తుల 'ఫ్రాంక్‌ కేబుల్‌'ని చూస్తే ఎవ్వరైనా ఔరా అనాల్సిందే..!

 యుద్ధనౌక 'ఫ్రాంక్ కేబుల్'

 యుద్ధనౌక 'ఫ్రాంక్ కేబుల్'

అమెరికా యుద్ధనౌక ‘ఫ్రాంక్‌ కేబుల్‌’ విశాఖపట్నం చేరుకుంది. జలాంతర్గాములను మద్దతుగా నిలిచే.. సమగ్ర సదుపాయాలతో ఉన్న అమెరికా నేవీ వార్‌షిప్ ఫ్రాంక్ కేబుల్ ఏఎస్40 మన విశాఖ ఓడరేవుకు వచ్చింది. 12 అంతస్తుల ఈ నౌకను చూసినవాళ్లంతా ఔరా అనాల్సిందే..!

ఇంకా చదవండి ...
    (Setti Jagadesh, News 18, Vizag)

    అమెరికా యుద్ధనౌక ‘ఫ్రాంక్‌ కేబుల్‌’ విశాఖపట్నం చేరుకుంది. జలాంతర్గాములను మద్దతుగా నిలిచే.. సమగ్ర సదుపాయాలతో ఉన్న అమెరికా నేవీ వార్‌షిప్ ఫ్రాంక్ కేబుల్ ఏఎస్40 మన విశాఖ ఓడరేవుకు వచ్చింది. 1979లో ఎల్‌ఐ స్పియర్ సిరీస్‌కు చెందిన ఈ నౌక ..యూఎస్‌ నావికాదళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి కాలానుగుణంగా ఆధునిక మార్పులు చేస్తూ తీర్చిదిద్దుతున్నారు.



    యుద్ధనౌక ప్రత్యేకతలు..!

    12 అంతస్తుల ఈ యుద్ధనౌకను చూస్తుంటే ఔరా అనాల్సిందే..ఇందులో నీటి మీద మనకు కేవలం ఐదు అంతస్తులే కనిపిస్తాయి. మిగిలిన ఏడు అంతస్తులు నీటిలోపల ఉంటాయి. ఈ నౌక పొడవు 644 అడుగులు ఉండగా..వెడల్పు 85 అడుగులు ఉంటుంది. దీని బరువు సుమారు 23,865 టన్నులు ఉండొచ్చు. దాదాపు500 మంది సిబ్బంది ఉంటే అందులో మహిళా సిబ్బంది సంఖ్య 40శాతం వరకు ఉంటుంది. సమగ్ర సదుపాయాలున్న ఆరు అధునాతన బోట్లు, రెండు భారీ క్రేన్లు ఈ యుద్ధనౌకలో ఉంటాయి. గంటక 20 నాట్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఈ యుద్ధనౌకకు ఉంది.

    సిబ్బంది వెళ్లలేని చోటుకు రోబోలు..!
    లాక్‌ హీడ్‌షిప్‌ బిల్డింగ్ కంపెనీ తయారు చేసిన ఈ యుద్ధనౌక… ఒకేసారి నాలుగు జలాంతర్గాములకు సేవలందించేలా తీర్చిదిద్దారు. ఈ నౌక నుంచి జలాంతర్గామిలోకి సులభంగా అంతే వేగంగా రాకపోకలు సాగించొచ్చు. సముద్రంలోకి వెళ్లి అవసరమైన మరమ్మతులు చేయడానికి ఎప్పుడూ నలుగురు డైవర్లు అందుబాటులో ఉంటారు. సిబ్బంది వెళ్లలేని పరిస్థితులు వచ్చినప్పుడు… రోబోతో ఆ పనులు చేయిస్తుంటారు.



    జలాంతర్గాముల మరమ్మతులకు అవసరమయ్యే విడిభాగాలన్నీ ఇందులోనే ఉంటాయి. ఒకవేళ మరమ్మతులకు అవసరమయ్యే నట్లు, బోల్టులు అప్పటికప్పుడు తయారుచేయడానికి వీలుగా ఒక అంతస్తు మొత్తంలో మెషినరీ ఉంది. సాధారణ జలాంతర్గాములతో పాటు అణు జలాంతర్గాములకు కూడా ఇందులో ఉండే నిపుణుల బృందం మరమ్మతులు చేయగలదు. ఇందులో మింటర్‌తోపాటు సివిలియన్ ఉద్యోగులు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు.

    మరమ్మతులకే కాదు...అవసరమైతే..!

    ఒక్క మరమ్మతులే కాదు.. యుద్ధం చేయడానికి కూడా అవసరమైన ఆయుధసామాగ్రి ఈ యుద్ధనౌకలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇందులోని సిబ్బంది కోసం ప్రత్యేక ఆస్పత్రి, వైద్యులు కూడా ఉన్నారు. ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలతో పాటు హెలీకాప్టర్ దిగడానికి వీలుగా పై అంతస్తులో హెలీప్యాడ్ కూడా ఉంది.
    భారతదేశం, అమెరికా రక్షణ సంబంధాల విషయంలో వేగాన్ని పెంచాయి. 2+2 సంభాషణ కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల అధికారుల మధ్య ఉన్నత స్థాయి పర్యటనలు ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికా యుద్ధనౌక వైజాగ్‌ తీర ప్రాంతానికి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది కేవలం స్నేహ సంబంధాలు మెరుగుపరచడం కోసమేనని అమెరికా నావీ అధికారులు చెబుతున్నారు.



    అవసరమైనప్పుడు ఇరు నౌకాదళాల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో కలిసి విధులు నిర్వర్తించడానికి తమ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఇరుదేశాలూ మరింత పట్టు సాధించాయని…తొలిసారి విశాఖ నౌకాశ్ర యానికి రావడం చాలా ఆనందంగా ఉందంటున్నారు.



    ప్రస్తుతం భారతదేశంలో ఫ్రాంక్ కేబుల్ లాంటి జలాంతర్గామి టెండర్ షిప్ ఏమిలేదు. INS అంబాని కూడా 2006లోనే ఉపసంహరించారు. భారతదేశం భవిష్యత్తులో అలాంటి యుద్ధనౌకలను కలిగి ఉండాలని భారత నేవీ బృందం భావిస్తోంది. ఈ తరుణంలో అమెరికా యుద్ధనౌక వైజాగ్‌ టూర్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Local News, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు