P. Anand Mohan, Visakhapatnam, News18
రైతుల రెక్కల కష్టం నీళ్ల పాలైంది. చేతికొస్తుందనుకున్న పంట అకాల వర్షాలతో అందకుండా పోయింది. భారీ వర్షాల దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట నేలకొరిగాయి. అలాగే కోత కోసి పొలాల్లో పనల మీదున్న పంట, కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసింది. సెప్టెంబరులో వర్షాలు ఒక్క తూర్పగోదావరి జిల్లాలో ( East Godavari District) 5,422 ఎకరాలను దెబ్బతీస్తే.. ఈనెల మొదటి వారం నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం 46 మండలాలపై పడింది. కోనసీమలో 16 మండలాలు.. మెట్టలో రాజానగరం, సీతానగరం, గండేపల్లి మండలాలు విలవిల్లాడాయి. పది రోజులకుపైగా వాన నీటిలో పంట నానడంతో మొలకలు వచ్చి.. కుళ్లిపోతోంది. కోనసీమలో 90 వేల ఎకరాల్లో వరి సాగైతే.. మూడొంతులు దెబ్బతింది.
పది రోజులకుపైగా వాన నీటిలో పంట నానడంతో మొలకలు వచ్చి.. కుళ్లిపోతోంది. కోనసీమలో 90 వేల ఎకరాల్లో వరి సాగైతే.. మూడొంతులు దెబ్బతింది. ఖరీఫ్‌లో భారీగా వరి సాగయితే ఉత్పత్తి దండిగా ఉంటుందని.. కొద్దిరోజుల్లో పంట చేతికొస్తుందని అంతా భావించారు. అకాల వర్షాలతో ఊహించని నష్టం రైతును ముంచేసింది. కోతలు కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వాతావరణ మార్పులతో కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని సైతం కాపాడుకోలేని పరిస్థితి ఎదురైంది.
33 శాతానికి మించిన నష్టాన్నే వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలోకి తీసుకోవడం సమస్యగా మారింది. ఎకరాకు రూ.25-30 వేల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు పూర్తిగా నష్టపోయే దుస్థితి నెలకొంది. కౌలు రైతుల వేదన వర్ణనాతీతం. తేమ ఎక్కువైతే ధాన్యం కొనే పరిస్థితి లేకపోవడంతో కేంద్రాలు తెరుచుకున్నా ఫలితం లేకపోయింది. వర్షాలతో నీట మునిగి.. నేల మట్టమైన పంటను చూపుతున్నారు రైతులు. వర్షాలకు తడిసిన పంటను దీనంగా చూపిస్తున్నారు.
అప్పు చేసి ఎకరాకు రూ.25 నుంచి 50 వేలు పైనే పెట్టుబడులు పెట్టారు.. మొత్తం నష్టపోయారు. పది రోజుల కిందట భారీ వర్షాలకు చేను పడిపోయింది. నీరు బయటకు పోయేలా మార్గం చేసినా ముంపు దిగలేదు. మళ్లీ కుండపోత వర్షం కురవడంతో పంటంతా నీట మునిగింది. గతంలో వేసిన దాళ్వా పంట నష్టానికి బీమా కూడా చాలా మంది ఇప్పటికీ అందలేదు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Andhra Pradesh, East Godavari Dist, Heavy Rains