హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి

Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam) ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వాహనాన్ని లారీ ఢీ కొట్టింది.

శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం సమ్మాదేవి వద్ద జాతీయ రహదారిపై ఏఆర్ కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం ప్రమాదానికి గురైంది. ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ ఢీ కొట్డడంతో వాహనం డివైడర్ పైకి దూసుకెళ్లింది. ముందుబాగం అంతా నుజ్జునుజ్జైంది. దీంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగులతో భయానకంగా మారింది. మందస వద్ద ఓ ఆర్మీ జవాన్ మృతదేహానికి ఎస్కార్ట్ గా వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొని.. తిరిగి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Road accident, Srikakulam

ఉత్తమ కథలు