Setti Jagadeesh, News 18, Visakhapatnam
కూటి కోసం కోటి విద్యలు.. అందులో భాగమే ఈ కళారంగం... తమదైన కళను నమ్ముకుని జీవనాధారం కోసం బయలుదేరితే.., మృత్యువు లారీ రూపంలో కబళించింది. ఈ విషాద ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో మేకప్ ఆర్టిస్ట్, మరో మహిళ, ఫోటోగ్రాఫర్ తో మరో యువకుడు ఉన్నారు. వీరంతా ఓ ఇవెంట్ కి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివిధ ప్రాంతాలకు తిరిగి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఆర్టిస్టులు. ప్రమాదవశాత్తు కారులో నలుగురు మృతి చెందారు. ఒరిస్సా రాజధాని ఖుర్దా జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
విశాఖ నగరానికి చెందిన బ్యూటీషియన్ మారియా ఖాన్ (26), లక్ష్మి( 28), కబీర్ (28), రాఖీ (30)లు విశాఖ నుంచి పూరిలో ఈవెంట్ ప్రోగ్రాం కోసం వెళ్లి ఆ ప్రోగ్రాం పూర్తిచేసుకుని మారుతి షిఫ్ట్ కారులో తిరిగి వస్తున్న సమయంలో మితిమీరిన వేగంతో యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే కార్లో ఉన్న ఆ నలుగురు మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు.
అక్కడున్న కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారులో అలాగే మృతుల వద్ద లభించిన ఆధారాలతో వారు విశాఖపట్నంకు చెందిన వారిగా గుర్తించారు. విశాఖ పోలీసులకు వారు సమాచారం అందించారు. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. సంఘటన స్థలం నుంచి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఖుర్దా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగం వారి ప్రాణాలను తీసింది. వేగంగా కారులో వస్తున్న వారికి ముంచుకొస్తున్న ప్రమాదం తెలుసుకునే లోపే వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తాము వెళ్లిన ప్రోగ్రాం పూర్తి అయిన తర్వాగా త్వరగా తిరిగిరావాలని అతి వేగంగా కారు నడుపుతూ ఈ ప్రమాదానికి గురయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Road accident, Visakhapatnam