Fishermen: మత్స్యకారుల మధ్య చిచ్చుపెట్టిన చేప... రెండువర్గాలుగా విడిపోయిన గంగపుత్రులు

ప్రతీకాత్మకచిత్రం

Fishermen: మత్స్యకారులు... గంగమ్మ తల్లి ఇచ్చే సంపదతో పొట్టపోసుకుంటుంటారు. గంగమ్మ కరుణిస్తేనే వారి కడుపు నిండుతుంది. అంతా ఐక్యమత్యంగా ఉంటూ.. అంతా కలిసి వేటకు వెళ్తారు.

 • Share this:
  P.Anand Mohan, Visakhapatnam, News18

  మత్స్యకారులు... (Fishermen) గంగమ్మ తల్లి ఇచ్చే సంపదతో పొట్టపోసుకుంటుంటారు. గంగమ్మ కరుణిస్తేనే వారి కడుపు నిండుతుంది. అంతా ఐక్యమత్యంగా ఉంటూ.. అంతా కలిసి వేటకు వెళ్తారు.. సంద్రం ఇచ్చినదానిని అంతా పంచుకొని జీవనం సాగిస్తారు. కానీ ఓ చేప వారి మధ్య చిచ్చుపెట్టింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి తీసుకెళ్లింది. అవును విశాఖపట్నం(Visakhapatnam) లో మత్స్యకారుల మధ్య చిచ్చు పెడుతోంది కోనెం చేపే. ఆ చేపకోసమే రెండు వర్గాలు తగువు పడుతున్నాయి. సంప్రదాయ మత్స్యకారులు.. మోతుబరీ మత్స్యకారుల మధ్య వివాదం రేగుతోంది. సాక్షాత్తూ మత్స్యకార శాఖ మంత్రి కూడా ఈ రచ్చను సరిచేయలేకపోయారు. పదే పదే అదే వివాదం రిపీట్ అవుతోందే తప్ప.. ఎక్కడా సద్దుమణగలేదు. ఇంతకీ ఈ గొడవంతా దేనికోసమయ్యా అంటే అదీ కోనెం చేప కోసమే. కోనెం చేప పడటం.. పడకపోవటమే ఈ వివాదానికి అసలు కారణం. ఈ విషయాన్ని మత్స్యకారులు ఒప్పుకున్నారు.

  వలతోనే మత్స్యకారుల బ్రతుకులు ముడిపడి ఉన్నాయి. అదే వల కొన్ని నెలలుగా వారి మధ్య చిచ్చు పెడుతుంది. ఆ వలలో పడే చేప రెండు వర్గాల్ని నిత్యం తగువుపడేలా చేస్తోంది. తీరంలో కయ్యానికి కాలు దువ్వేలా చేస్తోంది. విశాఖ మహానగరంలో మత్స్యకారుల మధ్య రింగు వల చిచ్చు పెడతుంది. రింగ్ వల ద్వారా చేపల వేట సాగిస్తున్న మోతుబరీ బోట్ల యజమానులకు, సాంప్రదాయ చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులకు మధ్య వివాదం నానాటికి మరింత ముదురుతోంది. రింగ్ వల చేపల వేట వద్దని సాంప్రదాయ మత్స్యకారులు అంటున్నారు. కానీ.. రింగ్ వలల మత్స్యకారులు మాత్రం కోర్టు ఆదేశాలతో వేట సాగిస్తున్నారు.

  ఇది చదవండి: గోదావరి నిత్యహారతికి మంగళం..? ప్రభుత్వం కీలక నిర్ణయం..? కారణాలు ఇవేనా..?


  రింగ్ వల అంటే చాలా పెద్ద వల ఉంటుంది. సంప్రదాయ మత్స్యకారుల వలలతో పోలిస్తే ఇది చాలా పెద్దది. చేపలు పట్టే విధానమూ అలాగే ఉంటుంది. చిన్న చేప నుంచీ పెద్ద పెద్ద చేప వరకూ అన్నీ ఈ రింగ్ వలలో అమాంతం పడతాయి. అయితే సంప్రదాయ పద్ధతిలో తెప్పలపై వేట చేసే వాళ్ల వలల వల్ల చిన్న చిన్న చేపలకు అంతగా ఇబ్బంది ఉండబోదు. రాబోయే తరాలకు మత్స్య సంపద తగ్గదు. కానీ.. రింగ్ వలల వల్ల ఎక్కువ చేపలు లభించడం ఖాయం.

  ఇది చదవండి: ప్రియురాళ్ల మోజులో తండ్రి... ఆస్తిని తగలేస్తున్నాడన్న కోపంతో కొడుకు ఏం చేశాడంటే..!


  ఇక మత్స్య సంపదకు ఇబ్బందితో పాటు ముప్పే. రింగ్ వలలు, బల్ల వలల వల్ల చిన్న చిన్న చేపలు.. గుడ్లు పెట్టె చేపలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈ వలల వల్ల నష్టాలు, లాభాలపై మత్స్యకారులకు అవగాహన ఉండాలి. కానీ.. రింగ్ వలల విషయంలో రాద్ధాంతానికి కోనెం చేపే అసలు కారణంగా మారుతోంది. సాధారణ రకాల చేపలు టన్నుల కొద్దీ పడినా.. కోనెం.. వంజరం చేపలు కొద్ది కేజీలు పడినా ఒకటే ఆదాయం. అంటే కోనెం చేప అంత కాస్ట్లీ. ప్రస్తుతం మార్కెట్ లో కోనెం ధర కేజీకి అయిదువందలపైనే ఉంది. ఇక కోనెం చేప పిల్లలు (వీటినే వంజరాలు అంటారు) కూడా కేజీకి మూడువందల తక్కువ కాదు. పెద్ద కోనెం చేప 20 కేజీల వరకూ పెరుగుతుంది. చిన్న చేపలు అరకేజీపైనే ఉంటాయి.

  ఇది చదవండి: దుర్గగుడిలో వైసీపీ రంగులు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. అసలేం జరిగిందంటే..!


  8 కి.మీ పరిధిలోనే సంప్రదాయ వేట చేసుకునేలా మత్స్యకారులకి ఇదివరకే మత్స్యశాఖ ఆదేశాలు సూచనలు ఇచ్చింది. 8 కి.లో మీటర్ల దాటి వేటకు వెళితే మాత్రం ఫైన్ విధిస్తామని స్పష్టం చేసింది. లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకార సంఘాలు, మెరైన్ ఫిషరీస్ కమిటీ, ఇతర అధికారులతో కలిపి ఒక కమిటీని వేసింది. కానీ.. రింగ్ వలల యజమానులు మాత్రం ఈ నిబంధనల్ని పట్టించుకోవడం లేదు. ఎనిమిది కిలోమీటర్లు అవతల వేట సాగిస్తున్నామంటూనే దాని లోపే వేటసాగిస్తున్నారు. దీంతో సముద్రంలో రెండు వర్గాల మధ్య తరుచూ వివాదం చెలరేగుతూనే ఉంది. కొద్దిరోజుల నుంచీ వివిధ మత్స్యకార గ్రామాల నుంచి వేటకు బయల్దేరడంపై మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రింగ్ వలల్తో వేటాడే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రింగువలలతో వేటకు వెళ్లిన బోటును అడ్డుకుని, చేపలతో ఉన్న వలను పేద జాలారిపేటకు తీసుకువచ్చి అధికారులకు అప్పగించారు. విశాఖ పరిధిలో ప్రస్తుతం సంప్రదాయ పద్ధతిలోనే వేట చేయాలని డిమాండ్ చేశారు.

  ఇది చదవండి: భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన ప్రభుత్వ పథకం.. ఆధార్ కార్డు వద్ద మొదలై హత్య వరకు వెళ్లింది..


  విశాఖ తీరంలోనే ఉన్న మత్స్యకార గ్రామాలు తరచూ వివాదాల్లోనే ఉంటున్నాయి. 13 రింగు వలలతో ఎనిమిది కిలోమీ టర్ల అవతల మాత్రమే వేటకు వెళ్లాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయితే ఈ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని మత్స్యకారుల మాట. కొంతమంది రింగ్ వలల మత్స్యకారులు వివాదాలకి తావిచ్చేలా ప్రయత్నం చేస్తున్నారని, మత్స్యశాఖ అధికారులు సమస్యను తక్షణమే పరిష్కరించాలని గంగపుత్రులు డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారుల మద్య రింగు వలల వివాదం రాకుండా పలుమార్లు చర్చలు జరిపారు. ఈ వివాదాలకు మూల కారణమైన కోనెం లభ్యతే ఇక్కడ సమస్య. దీన్ని వీలైనంత తొందరగా అధికారులు పరిష్కరిస్తే తీరంలో రింగ్ వలల కల్లోలం తగ్గుతుంది.
  Published by:Purna Chandra
  First published: