Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM FISHERMEN FACING PROBLEMS WITH GOVERNMENT DIESEL SUBSIDY SMART CARDS FULL DETAILS HERE PRN VSP

Fishermen: సబ్సిడీ సంగతేమోగానీ చేతి చమురు వదులుతోంది..! గంగపుత్రుల సమస్య తీరీదెప్పుడో..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Fishermen Problems: మత్స్యకారులు సముద్రమే జీవనాధారం. తరతరాలుగా అదేవృత్తిని నమ్ముకుని మనుగడ సాగిస్తున్నారు. లాభ, నష్టాలతో సంబంధం లేకుండా చేపల వేటనే నమ్ముకుని జీవిస్తున్నారు.

    P. Anand Mohan, Visakhapatnam, News18

    మత్స్యకారులు (Fishermen)సముద్రమే జీవనాధారం. తరతరాలుగా అదేవృత్తిని నమ్ముకుని మనుగడ సాగిస్తున్నారు. లాభ, నష్టాలతో సంబంధం లేకుండా చేపల వేటనే నమ్ముకుని జీవిస్తున్నారు. కానీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు చేపల వేటను ప్రస్నార్ధకంగా మార్చాయి. లాభానికి మించి ఖర్చు పెరుగుతుంది. ఒకవైపు రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు, మరోవైపు వరస తుఫానులు మత్స్యకారులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టెస్తున్నాయి. విశాఖపట్నం (Visakhapatnam) ఫిషింగ్ హార్బర్ లో 800 పైగా మరబోట్లు ఉన్నాయి. ఒక సారి చేపల వేటకు బయలుదేరితే మరల బోటు హార్బర్ కు చేరుకునేసరికి వారం నుంచి పదిహేను రోజుల వరకు పడుతుంది. పది రోజులకు సరిపోయే డీజిల్ అందులో నింపుకోవాల్సి వస్తుంది. మాములు బోట్ కి రోజుకి 200 లీటర్ ల డీజిల్ అవసరమౌతుంది. స్పీడ్ బోట్ కి రోజుకి 400 లీటర్ ల డీజిల్ వినియోగిస్తారు. చిన్న బోట్ డీజిల్ కు 2 లక్షలు, స్పీడ్ బోట్ కి 10 రోజులకి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుంది.

    ఒక్కసారి బోటు సముద్రంలోకి వెళ్ళి, తిరిగి వడ్డుకి చేరుకునే సరికి పది,పదిహేను రోజులు పడుతుంది. ఒక్కొక్క బోట్ లో ఐదు నుంచి పది మంది వరకు పని చేస్తారు. వారికి తినడానికి వంట సామగ్రి, మరో వైపు చేపలు చెడిపోకుండా ఉండేందుకు ఐష్ కూడా బోట్ లో సముద్రంలోకి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ఈ పది, పదిహేను రోజులకి నాలుగు నుంచి ఐదు లక్షలు బోట్ యజమానికి ఖర్చు అవుతుంది. గంగపుత్రుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు డీజిల్ పై రాయితీలు ఇస్తున్నాయి. గత కొన్నేళ్లుగా మత్య్సకారులకు ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక కొత్త విధానం ప్రెవేశ పెట్టింది. మత్యకారులకు రాయితీ కోసం ఐటెక్ కార్డులు తీసుకొచ్చింది.

    ఇది చదవండి: ఇదే లాస్ట్ అండ్ ఫైనల్..! 2,500 మంది నేరస్ధులను కూర్చొబెట్టి మరీ వార్నింగ్ ఇచ్చిన ఎస్పీ...


    ప్రతీ లీటర్ కి తొమ్మిది రూపాయలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ రాయితీ నేరుగా మత్స్యకారులకు చేరాలి. అందులో భాగంగానే గంగపుత్రుల పేరు మీద ఈ స్మార్ట్ సబ్సిడీ కార్డ్ లు అందజేసింది. ప్రతి బోట్ యజమాని డీజిల్ తీసుకునేటప్పుడు ఈ స్మార్ట్ కార్డ్ ని ఉపయోగించి అప్పటికప్పుడే రాయితే పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్సిడీ బోట్ యజమానులకు స్మార్ కార్డ్ లు అందజేసే బాధ్యత, ప్రభుత్వం ప్రైవేటు బ్యాంక్ కు అప్పంగించింది.

    ఇది చదవండి: వీళ్లకు 20ఏళ్లుగా ఒకే శాలరీ.., జీతాలపెంపు అంటేనే వీళ్లకు తెలియదు..!


    ఐతే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. డీజిల్ కోసం వెళ్లినవుడు ఈ స్మార్ట్ కార్డ్ ను స్క్రాష్ చేయాల్సివుంటుంది. చాలా వరకు కార్డ్ లు పనిచేయడం లేదని బోట్ యజమానులు లబోదిబోమంటున్నారు. ఆ నెలలో స్మార్ట్ కార్డ్ పనిచేయక పోతే, ఆ రాయితీ పోయినట్టేనని బోట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే సారి వేల లీటర్ల డీజిల్ కొట్టాల్సి ఉంటుందని, అటువంటి సమయంలో స్మార్ట్ కార్డ్ పనిచేయకపోవడం వలన ప్రతి నెల వేల రూపాయలు రాయితీ కోల్పోతున్నామని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు