హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vishaka HPCL Fire Accident: విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిఎగసిపడుతున్న మంటలు

Vishaka HPCL Fire Accident: విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిఎగసిపడుతున్న మంటలు

ప్రమాదం కారణంగా హెచ్‌పీసీఎల్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు

ప్రమాదం కారణంగా హెచ్‌పీసీఎల్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు

Vishaka HPCL Fire Accident: ప్రమాదం ఏ విభాగంలో జరిగిందనే విషయంపై క్లారిటీ వచ్చిన తరువాతే.. మంటలు ఎంతసేపటికి అదుపులోకి వస్తాయనే విషయం తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

  విశాఖలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని హెచ్‌పీసీఎల్‌లో కొద్దిసేపటి క్రితం ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం కారణంగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం సంభవించిన సమయంలో భారీ శబ్దం వచ్చిందని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా హెచ్‌పీసీఎల్ పరిసరాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. హెచ్‌పీసీఎల్ సీడీయూ 3వ యూనిట్‌లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ మొత్తానికి మంటలు వ్యాపించాయి. ప్రమాదం సంభవించడంతో.. అధికారులు అక్కడి పని చేస్తున్న వారిని వెంటనే బయటకు పంపించారు.

  మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 20 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు హెచ్‌పీసీఎల్‌ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కూడా కాలేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.

  ఇక ఓవర్‌హెడ్‌ పైప్‌లైన్‌లో లీకేజి వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. సీడీయూ మూడో యూనిట్‌లో ప్రమాదం జరిగిందని.. యూనిట్‌ మొత్తాన్ని షట్‌డౌన్‌ చేశారని.. పరిస్థితి అంతా అదుపులోనే ఉందన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే సమాచారం వచ్చిందని.. వెంటనే అంతా అప్రమత్తమయ్యామని తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Fire Accident, Visakhapatnam

  ఉత్తమ కథలు