Setti Jagadeesh, News 18, Visakhapatnam
రైతులు ఒకసారి మొక్కలు వేస్తే నష్టాలు, కష్టాలు ఉండవు. ప్రతి నెల పామాయిల్ (Palm Oil) రైతుకు ఆదాయం నమ్మకంగా వస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఉమ్మడి విశాఖపట్నం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. అదే క్రమంలో వుమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) రావికమతం మండలం, దొండపూడి గ్రామం లో రైతులు సాంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్నాయ ఆదాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయా గ్రామాల రైతులు తమ పంట పొలాల్లో పామాయిల్ పంటను సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు.
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావడంతో రైతులు ఆర్థికంగా పొందుతున్నారు. మరో వైపు ప్రభుత్వం కొంత మోతాదులో ప్రోత్సాహం అందిస్తుండటంతో జిల్లాలో పామాయిల్ సాగు రోజురోజుకు విస్తరిస్తోంది. తక్కువ పెట్టుబడితో 20 ఏళ్ల నుండి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు దొండపూడి గ్రామానికి చెందిన రైతు భూరాజు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంట పామాయిల్ అంటున్నారు.
ఇప్పటికే6 ఎకరాల్లో గెలలు వస్తున్నాయి. 3 సంవత్సరాల వయసు నుండి 20 ఏళ్ల వరకు కూడా తమకి ఆదాయం ఇస్తుంది అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గెలలు వచ్చినప్పటి నుంచి నెలకు 1నుంచి 2లక్షల రూపాయాల ఆదాయం వస్తుందనీ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ లో ఆయిల్‌కు అధిక రేట్లు ఉండటంతో ముడిసరుకుగా ఉన్న ఈ ఫామాయిల్ గెలలకు రేటు బాగా వచ్చిందంటున్నరు. ప్రభుత్వం కూడా సబ్సిడి, ఇతర ప్రోత్సాహకాలు అందించటంతో చాలా మంది రైతులు పామాయిల్ తోటలను సాగుచేస్తున్నారు.
ప్రస్తుతం అధిక లాభాలు వచ్చే విధంగా ఆశాజనకంగా ఉన్న పంటగా పామాయిల్ మాత్రమే కనిపిస్తోందనీ రైతు భూరాజు అంటున్నారు. ప్రస్తుతం టన్నుకు 15వేల నుంచి 18వేల వరకు ఉండటంతో ఎకరాకు లక్షల రూపాయాల ఆదాయం వస్తుందని అంటున్నారు. చిరకాల లాభాల పంటగా ఉండటంతో పామాయిల్ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculuture, Andhra Pradesh, Local News, Visakhapatnam