Setti Jagadeesh, News 18, Visakhapatnam
కొన్నిపంటలు రైతులకు తీవ్రనష్టాలు కలిగిస్తాయి. మరికొన్ని పంటలు మాత్రం రూపాయికి పదిరూపాయలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కొన్నిపంటలకు అసలు పెట్టుబడే అవసరం లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ జిల్లాలో రైతులంతా అదే పంటను పండిస్తూ లాభాలి గడిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) లోని పలు గ్రామాల్లో జనుము సాగు ఎక్కువగా చేస్తూ రైతులు అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. ఈ జనుము పంట వేయాలి అంటే ఖరీఫ్ వరి పంట కోత దశలో ఉన్నప్పుడు ఈ విత్తనాలు వేసుకోవాలి. అనంతరం వరి పంటను కోత కోసిన , కొద్ది రోజులకే జనుము విత్తనాలు మొలకెత్తుతాయి. మన దగ్గర విత్తనాలు వుంటే చాలు ఖర్చు లేకుండా రైతులకు అధిక లాభాలను సాధించవచ్చు అంటున్నారు రైతు మాకిరెడ్డి రమణ... ఈ జనుము సాగును ఎక్కవగా జిల్లాలో వడ్డాది, చిన్నప్పన్నపాలెం, రాజాం, బుచ్చయ్యపేట, దిబ్బది, నీలకంఠాపురం , రావికామతం తదితర మండలాల్లో అధికంగా రైతుల ఈ పంట చేపట్టారు.
ఈ జనుము పంటతో లాభాలు..
సాధారణంగా ఈ జనుము పంట అనేది ఖరీఫ్ వరి పంటకు ముందు జనుము విత్తనాలు చల్లుతారు. మూడు నెలల పాటు ఎదిగిన తర్వాత దానిని పొలం లో దున్నుతారు. దీని వల్ల తదుపరి వేసే వరి పొలం సారవంతం గా అయ్యి అధిక దిగుబడులు రావడానికి ఈ జనుము పంట అనేది ఎంతో ఉపయోగపడుతుంది.
సారవంతంతో పాటు ఆదాయం కూడా..
అయితే కొద్ది సంవత్సరాలుగా జిల్లా లోని రైతులు జనుము పంటకి ఆదాయం పంటగా మార్చుకున్నారు. ఖరీఫ్ అయిన వెంటనే వరి పొలాల్లో రైతులు జనుము పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా లోని వందలాది ఎకరాల్లో జనము పూతదశలో ఈ పంట ఉంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా పురుగుల మందు బాధ పెద్దగా లేకుండా ఈ జనుము పంట పండుతుంది. ఈ జనుము పంట ఎకరాకు సుమారు రూ.10వేలు వరకు ఆదాయం వస్తుందని రైతు మాకిరెడ్డి రమణ చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో కిలో జనుము రూ. 50 నుండి రూ.60 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మినప సాగుకు కొంత మొత్తం లో తెగుళ్ల బెడద పట్టుకుంది. మినప మొక్కలు పూత తక్కువగా ఉండడం , తెగులు రావడం వలన మినప సాగుకు ఆశాజనకంగా లేదని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు మినప పంట కంటే జనుము పంట బాగుంది అంటూ రైతులు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Farmers, Local News, Visakhapatnam