విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి పేలుడు సంభవించింది. లిక్విడ్ స్టీల్ విస్పోటనం చెందడంతో 11మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఎంఎస్-2 లిక్విడ్ విభాగంలో ఫ్లాగ్ యాష్‌ని తొలగిస్తుండగా నీళ్లు పడటంతో పేలుడు సంభవించింది. దుర్ఘటనలో గాయపడిన కార్మికులకు స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలోని చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురు స్లీట్ ప్లాంట్ ఉద్యోగులు కాగా..మరో ఐదుగురు కాంట్రాక్ట్ వర్కర్స్‌గా తెలుస్తోంది.
ఉక్కు ఫ్యాక్టరీలో పేలుడు..
విశాఖ ఉక్కు పరిశ్రమలో పేలుడు ప్రమాదంలో D.G.M. స్థాయి అధికారి కూడా ఉన్నారు. బాధితులను విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.
పది మందికి గాయాలు..
స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్టింగ్ షాప్ ప్రమాదంలో తీవ్ర గాయపడ్డ వారిని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి , గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి వారికి అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. బాధితులకు భరోసా ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.