Home /News /andhra-pradesh /

Hari babu: హరిబాబుకు గవర్నర్ పదవి ఇవ్వడానికి కారణం ఇదే..? సీఎం జగన్ స్వాగతిస్తారా..?

Hari babu: హరిబాబుకు గవర్నర్ పదవి ఇవ్వడానికి కారణం ఇదే..? సీఎం జగన్ స్వాగతిస్తారా..?

కంబంపాటి హరిబాబు

కంబంపాటి హరిబాబు

Hari Babu: విశాఖ మాజీ ఎంపీ హరిబాబుకు గవర్నర్ పదవి దక్కడానికి కారణాలు ఏంటి.. 2014లో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మపై గెలవడం కలిసి వచ్చిందా..? కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంపై సీఎం జగన్ స్పందన ఏంటి..?

  సీఎం జగన్ తల్లి విజయమ్మపై విశాఖలో పోటీ చేసి గెలుపొందడంతోనే కంబంపాటి హరిబాబుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే వస్తున్నారు. మోదీ, అమిత్ షా సహా అందరి నేతలతో జగన్ కు సాన్నిహిత్యం ఉంది. కానీ విశాఖ మాజీ ఎంపీని మాత్రం ఇప్పటికే జగన్ బద్ధ శత్రువుగానే భావిస్తారు అన్నది విశాఖ వాసులకు ప్రత్యేకంగా చెప్సాల్సిన అవసరం లేదు. జగన్ సీఎం అయిన తరువాత ఒకటి రెండు సందర్భాల్లో హరిబాబు వైపు చూసేందుకు కూడా  ఇష్టపడ లేదనే ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో ఆయనకు కేంద్రం ఉన్నత పదవి ఇవ్వడాన్ని సీఎం జగన్ ఎలా భావిస్తారు. సాధారణంగా ఏ రాష్ట్ర గవర్నర్ అయినా సొంత రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం తప్పక స్వాగతం పలకాల్సి ఉంటుంది. మరి సీఎం జగన్ ఇకపై ఆయనతో ఎలాంటి వైఖరి అనుసరిస్తారంటూ విశాఖ ప్రజల్లో చర్చ మొదలైంది, ఆ విషయం పక్కన పెడితే కంబంపాటి హరిబాబుకు అనూహ్యంగా గవర్నర్ పదవి పెట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  కంబంపాటి హరిబాబుకు ఏపీ రాజకీయాలతో సుదీర్ఘ అనుభవం ఉంది. ఎంపీగా, ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీలో బీజేపీకి బలమైన కేడర్ లేని సమయంలోనూ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థులపై గెలుపొంది సత్తా చాటారు. అయినా ఆయనకు కేంద్రంలో రావాల్సిన గుర్తింపు రాలేదు. గత కేబినెట్ లో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. కంబంపాటి హరిబాబుకు ఏపీ రాజకీయాలతో సుదీర్ఘ అనుభవం ఉంది. ఎంపీగా, ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీలో బీజేపీకి బలమైన కేడర్ లేని సమయంలోనూ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థులపై గెలుపొంది సత్తా చాటారు. అయినా ఆయనకు కేంద్రంలో రావాల్సిన గుర్తింపు రాలేదు. గత కేబినెట్ లో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ చివరికి నిరాశే మిగిలింది.

  ఇదీ చదవండి: కేంద్ర కేబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి! గవర్నర్ గిరీతో సరి..

  ఏపీలోని  విశాఖ‌ప‌ట్నం  లోక్‌స‌భ నియోజ‌కవ‌ర్గం  నుంచి 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థిగా గెలిచారు.  అది కూడా అప్పటి ప్రతిపక్ష నేత వైెస్ జగన్  తల్లి విజయమ్మపై హరిబాబు గెలుపొందారు. అలాగే రాష్ట్ర విభజన తరువాత ఏపీకి బీజేపీ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. ప్ర‌త్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన జై ఆంధ్ర ఉద్య‌మంలో విద్యార్థి నాయ‌కుడిగా ఆయ‌న తెన్నేటి విశ్వ‌నాథం, స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న మ‌రియు వెంక‌య్య నాయుడుల‌తో క‌లిసి పాల్గొన్నారు. 2013లో బీ.జే.పీ జాతీయ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ స‌భ్యుడిగా పని చేశారు. 2005లో భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శిగా పని చేశారు. 2003 - 2004 మధ్య కేంద్ర‌ జ‌ల‌వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌లో న‌దుల అనుసంధాన కార్య‌ద‌ళం స‌భ్యుడిగా ఉన్నారు. 2003 భార‌తీయ జ‌న‌తా శాస‌న‌స‌భాప‌క్ష పార్టీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫ్లోర్‌లీడ‌ర్‌గా ఎన్నికయ్యారు. 1980లో పీ.హెచ్‌డీ పూర్తి చేసిన త‌ర్వాత ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యంలో ప‌ని చేశారు. అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా ప‌ని చేస్తున్న స‌మ‌యంలోనే 1993 లో త‌న ఉద్యోగానికి స్వ‌చ్చంధ ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు.  అయితే ఆయనకు ఇప్పుడు గవర్నర్ పదవి రావడాకి మాత్రం మాత్రం ఆయన పొలిటికల్ ప్రొఫైల్ కాదు.. స్థానిక రాజకీయ పరిస్థితులే కారణమని తెలుస్తోంది.

  ఇదీ చదవండి: కూలిన ఫ్లైఓవర్‌ పిల్లర్‌.. కారు​, ట్యాంకర్‌ ధ్వంసం.. దంపతులు మృతి

  ప్రస్తుతం విశాఖపట్నంలో బలం పెంచుకునేదిశగా బీజేపీ ఎప్పటినుంచో అడుగులు వేస్తోంది. కానీ మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పలేదు. అందుకు కారణం విశాఖపై కేంద్రం చిన్న చూపు చూడడమే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవడం, విశాఖ రైల్వే జోన్ కేటాయింపు.. ఇవీ ఉత్తరాంధ్ర ప్రజల ప్రధాన డిమాండ్లు. కానీ ఈ రెండుసాకారమయ్యే అవకాశాలు లేనట్టే. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కాస్త సద్దుమణిగినట్లు కనిపించినా.. తాజాగా ఈ అంశంలో కేంద్రం ముందడుగు వేస్తోంది. రైల్వే జోన్ కూడా వాల్తేర్ బేస్ గా ఉండబోదని సంకేతాలిచ్చింది.  దీంతో కేంద్ర ప్రభుత్వం తీరుపై విశాఖ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ ప్రభావం  రాష్ట్రం మొత్తంపై పడుతోంది. ఈ నేపథ్యంలో కొంతైనా వ్యతిరేకత తగ్గాలి అంటే  విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉన్న హరిబాబుకు మంచి పదవి ఇవ్వడమే సరైన నిర్ణయమని బీజేపీ పెద్దలు భావించారు. ఈ నిర్ణయం విశాఖ బీజేపీ కేడర్ లో ఆత్మవిశ్వాసం పెంచుతుందని బీజేపీ పెద్దలు ఆశిస్తున్నారు.

  ఇదీ చదవండి: సీఎం జగన్ పులివెందుల షెడ్యూల్ ఇదే.. పర్యటనలో మార్పులకు కారణం అదే..!

  ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లో ఎవరికీ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో.. అనూహ్యంగా ఈ గవర్నర్ పదవిని తెరపైకి తెచ్చారనే ప్రచారం ఉంది. ప్ర‌స్తుతం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ గా కొన‌సాగుతున్న ద‌త్తాత్రేయ‌ను కీల‌క‌మైన హ‌రియాణాకు గ‌వ‌ర్న‌ర్ గా మార్పు చేశారు. గ‌వ‌ర్న‌ర్ ల జాబితాలోకి కొత్త‌గా చేరిన హ‌రిబాబును చిన్న రాష్ట్రం అయిన మిజోరంకు కేటాయించారు. మరోవైపు బీజేపీలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌స్తుత ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడితో సాన్నిహిత్యం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Hari, Visakha Railway Zone, Visakhapatnam, Vizag Steel Plant, YS Vijayamma

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు