హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ganta Srinivas: గంటాలో మార్పుకు కారణం అదేనా.. ఉన్నట్టుండి అధినేతపై పొగడ్తలకు కారణం అదేనా..?

Ganta Srinivas: గంటాలో మార్పుకు కారణం అదేనా.. ఉన్నట్టుండి అధినేతపై పొగడ్తలకు కారణం అదేనా..?

గంటా శ్రీనివాసరావు (ఫైల్)

గంటా శ్రీనివాసరావు (ఫైల్)

Ganta Srinivas: టీడీపీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మారారా..? మారాల్సి వచ్చిందా..? ఆయనలో ఈ మార్పుకు కారణం ఏంటి..? అసలు మొన్నటి వరకు పార్టీతో అంటిముట్టనట్టు ఉన్న ఆయన.. సడెన్ గా అధినేతపై పొగడ్తల వర్షం ఎందుకు కురిపించారు..? ప్రస్తుతం టీడీపీలో ఈ మ్యాటర్ హాట్ టాపిక్ అయ్యింది.

ఇంకా చదవండి ...

P Anand Mohan, Visakhapatnam, News18

Ganta Srinivas: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు గంటా శ్రీనివాసరావు (Ganta Srinivas Rao).. గెలుపునకు కేరాఫ్ ఆయన.. పార్టీ ఏదైనా.. నియోజకవర్గం ఎక్కడైనా.. గెలుపుపై గ్యారంటీ ఉన్న నేత ఆయన.. 2019 ఎన్నిక తరువాత.. అధికార వైసీపీ (YCP) లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేసినట్టు ఆయన అనుచరులు చెబుతుంటారు.. కానీ ఆయన అనుకున్న ప్లాన్ ఏదీ వర్కౌట్ కాలేదు.  రెండు మూడు ప్రత్యామ్నాయాలపై ఫోకస్ చేశారని ప్రచారం ఉంది. కారణం ఏదైనా ఆయన మాత్రం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party )కి దూరంగానే ఉంటూ వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ఉద్యమం పేరుతో.. టీడీపీ (TDP) అధిష్టానానికి ఎలాంటి సమాచారం లేకుండానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఆ రాజీనామా ఆమోదించుకునేందుకు స్వయంగా స్పీకర్ ను కూడా కలిశారు.. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు.. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా.. టీడీపీని లైట్ తీసుకున్నారు. అధినేత కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు.. జస్ట్ అప్పుడప్పుడు టచ్ లోకి వచ్చేవారంతే. ఆ తరువాత కాపు సామాజిక వర్గ భేటీలు అంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు.. కీలక నేతలను ఏకతాటిపైకి తెచ్చారు.. కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. పక్క పార్టీ చూపులు కూడా ఆగిపోయాయి.  నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఓ రేంజ్ లో పొగిడేశారు.. మరి ఆయనలో ఈ సడెన్ మార్పుకు కారణం ఏంటి..? ఆయన మారారా? మారాల్పి వచ్చిందా..?

తెలుగుదేశం పార్టీలో గంటా శ్రీనివాసరావు ఉన్నారా లేరా అన్నది ఎవరికీ అర్థం కాదు. మొదటి నుంచి ఆయన వ్యవహార శైలి భిన్నంగానే ఉంది. పార్టీలో ఉన్న లేనట్టుగా వ్యవహరిస్తుంటారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనట్టు ఈ మూడేళ్లలో ఎప్పుడూ కనిపించలేదు. ఇలా ఎన్నో రకాల కారణాలతో ఆయనను చంద్రబాబు సైతం పట్టించుకోలేదు. ఎమ్మెల్యేగా ఆయన చంద్రబాబుతో కలిసి ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. అసలు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తనపై, తన భార్య పైనా వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నీరు పెట్టిన సందర్భంలో పార్టీకి సంబంధం లేని వారు సైతం స్పందించారు.. గంటా మాత్రం ఎక్కడా వాయిస్ వినిపించలేదు. అలాంటి ఆయన ఇప్పుడు రూటు మార్చారు.

ఇదీ చదవండి : అమలాపురంలో ఆగని ఆందోళనలు.. వారిపై చర్యలు తప్పవని హోం మంత్రి వార్నింగ్..

పార్టీ అధిష్టానం సైతం ఆయనను లైట్ తీసుకున్నట్టే కనిపించింది. ఎందుకంటే కొద్ది నెలల క్రితం ప్రకటించిన పార్టీ కమిటీల్లోనూ ఆయనకు స్థానం కల్పించలేదు. జనసేన, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో ఆయన చేరబోతున్నారని అధిష్టానం కూడా భావించింది. ఇలాంటి సమయంలో గంటా శ్రీనివాసరావు.. విశాఖ నార్త్ నియోజకవర్గంలో జరిగిన టీడీపీ మహిళ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గంటా శ్రీనివాసరావు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. కేవల ఈ కార్యక్రమానికి హాజరు కావడమే కాకుండా, ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.

ఇదీ చదవండి : పిచ్చిది అంటూ ఎగతాళి చేశారు.. ఇప్పుడు గుడి కట్టి పూజిస్తున్నారు? అసలేమైంది?

రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం కావాలని, ఏపీ బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలి అంటూ వ్యాఖ్యానించారు. టిడిపి జాతీయ స్థాయి నుంచి బూత్ లెవెల్ వరకు పటిష్టంగా ఉందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఈ విషయం గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో స్పష్టంగా కనిపిస్తోందని గంటా విమర్శించారు. ప్రస్తుతం వైసీపీపై వస్తున్న వ్యతిరేకతను టిడిపి నేతలు వాడుకోవాలని, వచ్చే ఎన్నికల్లో విజయానికి దీనిని అనువుగా మార్చుకోవాలని సలహా ఇచ్చారు. అయితే సడెన్ గా గంటాలో ఈ మార్పుకు ఇటీవల చంద్రబాబు ప్రకటనే కారణమంటున్నాయి టీడీపీ శ్రేణులు.

ఇదీ చదవండి : కేటీఆర్ ను జగన్ అంత మాట అన్నారా? ఆ వ్యాఖ్యల తరువాత ఒకే వేదికపై ఇలా.. ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ

చంద్రబాబు కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేసే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని పార్టీకి కష్టకాలంలో అండదండలు అందించిన వారికే ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. అక్కడితోనే ఆగలేదు.. డోన్ లో అభ్యర్థిని కూడా ప్రకటించారు.. సీనియర్ నేతలైన కేఈ కుటుంబాన్ని లైట్ తీసుకున్నారు. తనకు అలాంటి పరిస్థితి వస్తే.. ఏ దారి లేక ఇరుకును పడతానని గంటా భావించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ గేట్లు మూసుకుపోవడంతో.. బీజేపీ, జనసేనల్లో ఒకపార్టీలో చేరటం కంటే.. టీడీపీలోనే ఉండి.. తన ప్రాధాన్యాన్ని పెంచుకోవడమే బెటరని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ganta srinivasa rao, TDP, Vizag

ఉత్తమ కథలు