హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: చనిపోయిన తరువాత కూడా తండ్రిని హింసిస్తారా..? బాలయ్యపై తొలిసారి కొడాలి నాని ఫైర్

Kodali Nani: చనిపోయిన తరువాత కూడా తండ్రిని హింసిస్తారా..? బాలయ్యపై తొలిసారి కొడాలి నాని ఫైర్

బాలయ్యపై కొడాలి నాని ఫైర్

బాలయ్యపై కొడాలి నాని ఫైర్

Kodali Nani on Balayya: తండ్రి చనిపోయిన తరువాత కూడా వదలరా..? ఇప్పటికే హింసిస్తూనే ఉంటారా అంటూ.. మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. అది కూడా తొలిసారి బాలయ్యపై నేరుగా విమర్శలు చేశారు.. ఇంకా ఆయనేమన్నారు అంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Kodali Nani on Balakrishna: మాజీ మంత్రి కొడాలి నాని (Ex Minister Kodali Nani) మళ్లీ ఫాంలోకి వచ్చారు. గత కొంతకాలంగా సైలెంట్ ఉండి.. అందర్నీ ఆశ్చర్య పరిచిన ఆయన.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ని టార్గెట్ చేస్తూ.. దూకుడు కొనసాగిస్తున్నారు. అయితే ఆయన  ఎప్పుడూ చంద్రబాబు నాయుడు,  నారా లోకేష్ (Nara Lokesh) ను మాత్రమే విమర్శించేవారు.. నందమూరి వారసుల పై ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ తొలి సారి నందమూరి బాలయ్యపై (Nandamuri Bala Krishna) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడివాడ (Gudivada)లోని ఐదవ వార్డు శ్రీరామపురంలో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబు, బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తండ్రిని చంపిన చంద్రబాబుతో, షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గు లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ చనిపోయి 25 ఏళ్లు దాటినా షోల పేరుతో కొడుకు, అల్లుడు ఆయనను ఇంకా హింసించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతిలేక అనేకసార్లు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రజల కళ్తు తిప్పే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.

నిజంగా ఎన్టీఆర్ కు పార్టీ నడపడం చేతకాకపోతే, చంద్రబాబు బయటకు పోవాలి.. అది కాకుండా ఎన్టీఆర్ దగ్గర నుండి పార్టీ లాక్కోవడమేంటని కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఫైర్‌ అయ్యారు.. ఎన్టీఆర్ గొప్ప నటుడు అన్న విషయం అందిరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు ఆయన్ను మించిపోయి నటిస్తూ బాలకృష్ణ, అసత్య ప్రచారాలతో చంద్రబాబుతో కలిసి షోలు చేస్తున్నాడని ఫైరల్ అయ్యారు.

ఇదీ చదవండి : చింతాత చిత చిత అనడానికి రెడీగా చింతపండు.. కారణాలు ఇవే..

సాధారణంగా కొడాలి నాని ఇప్పటి వరకు చూసుకుంటే కేంలం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీదే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే వారు.. వారిని టార్గెట్ చేస్తూ బూతులు మాట్లాడిన సందర్భాలు ఎక్కువే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సైతం ఎండగట్టేవారు. కానీ నందమూరి కుటుంబానికి అభిమానిగా గుర్తింపు పొందిన.. నాని ఎప్పుడు బాలయ్యను ఈ స్తాయిలో విమర్శంచలేదు.. సిగ్గు ఉందా అంటూ  వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.

ఇదీ చదవండి : వ్యాపారుల అత్యాశతో జాడించి కొట్టిన జీడిపప్పు.. కస్టమర్లు హ్యాపీ.. రేట్లు ఢమాల్.. కిలో ధర ఎంతంటే?

ఇటు పవన్ కళ్యాణ్ పైనా అదే స్థాయిలో మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్‌.. ఓ రాజకీయ అజ్ఞాని అంటూ ఫైర్‌ అయ్యారు కొడాలి నాని.. ఈనెల 15వ తేదీన విశాఖపట్నంలో పవన్ కల్యాణ్‌ నిర్వహించే జనవాణి సభలపై ఆయన తీవ్ర వ్యాక్యలు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజావాణి పెట్టాల్సిన పవన్… చంద్రబాబు చిల్లరకు ఆశ పడుతున్నాడని, పవన్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడు రాజధానులకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : కొనసాగుతున్న వైభవోత్సవాలు.. శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం

ఉత్తరాంధ్ర జేఏసీ సభ కేవలం మూడు జిల్లాల ప్రజల ఆకాంక్షలు తెలియచేయడానికే తప్ప, ఎటువంటి బల ప్రదర్శన కాదని ఆయన స్పష్టం చేశారు. గాజువాక ప్రజల మాదిరే, రాష్ట్ర ప్రజలు కూడా పవన్ కల్యాణ్‌ ను తిరస్కరించే రోజు దగ్గర్లోనే ఉన్నాయి అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Gudivada, Kodali Nani, Nandamuri balakrishna

ఉత్తమ కథలు