హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ganta Time: మాజీ మంత్రి గంటాకు టైం వచ్చిందా..? ఆయన డిమాండ్లు ఇవే.. మెగాస్టార్ సపోర్ట్ ఉందా?

Ganta Time: మాజీ మంత్రి గంటాకు టైం వచ్చిందా..? ఆయన డిమాండ్లు ఇవే.. మెగాస్టార్ సపోర్ట్ ఉందా?

గంటాను నడిపిస్తున్నది ఎవరు..?

గంటాను నడిపిస్తున్నది ఎవరు..?

Ganta Time: మాజీ మంత్రి.. టీడీపీ ఎమ్మెల్యేకు ఇప్పుడు టైం వచ్చిందా..? వద్దు అనుకున్నవారే గంటా శ్రీనివాస్ రావు రావాలని కోరుకుంటున్నారా..? చాలా రోజులుగా ఖాళీగా ఉన్న గంటాకు ఎందుకు అంత డిమాండ్... ఆయనకు టైం వచ్చిందా.. ఇంతకి గంటాను వెనుకుండి నడిపిస్తోంది ఎవరు..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Ganta Time: మాజీ మంత్రి.. టీడీపీ  ఎమ్మెల్యేే గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) గురించి రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా  పరిచయం అవసరం లేదు.. ఏపీలో ఎంతమంది సీినియర్ రాజకీయ నేతలు ఉన్నా.. వారందరిలో గంటా సపరేట్.. ఆయన ఈ పార్టీ వ్యక్తి అని చెప్పడానికి లేదు.. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆయనది ఆ  పార్టీనే అనే ప్రచారం ఉంది. అంతేకాదు పార్టీతోనూ.. నియోజకవర్గంతోను ఆయనకు సంబంధం లేదు.. బరిలోకి దిగారంటే నెగ్గాల్సిందే.. ఆయన రికార్డులు చెబుతున్న మాట ఇది.. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసింది లేదు. కొత్త నియోజకవర్గమైనా.. అక్కడ గెలవాల్సిందే.. ఇదే గంటాను ప్రత్యేకతంగా నిలుపుతోంది.

అయితే ఇప్పుడు గంటా టైం వచ్చింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే సాధారణంగా ఎన్నికల్లో ఆయన గెలిచిన తరువాత.. ఆయన ఏ పార్టీపై పోటీ చేశారో ఆ పార్టీ అధికారంలోకి వెళ్తే.. ఆయన కూడా అధికార పార్టీకి మద్దతు ఇస్తారనే ప్రచారం ఉంది. అయితే 2019 తరువాత వివిధ కారణాల కారణంగా అది వర్కౌట్ కాలేదు.

2019 ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి వైసీపీలోకి గంటా వెళ్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో స్థానికంగా రాజకీయ బలం ఉన్న..  ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy).. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసు (Avanti Srinivas) ల కారణంగా.. ఆయన వైసీపీ లో చేరడానికి బ్రేకులు పడేలా చేశాయి అంటున్నారు. అప్పుడు గంటా వైసీపీ (YCP) లోకి వెళ్లడానికి ప్రయత్నించారని.. కొన్ని ప్రతిపాధనలు కూడా చేశారని.. కానీ కేవలం అవంతి.. విజయసాయి రెడ్డిలతో ఉన్న విబేధాలు కారణంగా ఆయనపైపు వైసీపీ చూడలేదనే ప్రచారం ఉంది.

ఇదీ చదవండి : రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నాం.. ప్రజలు తోడుగా ఉండాలన్న జగన్

అయితే అప్పుడు గంటాను లైట్ తీసుకున్న వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు గంటాను పార్టీలో చేర్చుకోవాలని ఫిక్స్ అయ్యిందంట.. దీంతో ఆయన్ను కొందరు వైసీపీ నేతలు సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటి నుంచో ఈ అవకాశం ఎదురు చూస్తున్న గంట.. ఇప్పుడు తన టైం వచ్చింది అంటున్నారంట.. అందుకే వైసీపీ పెద్దల ముందు కొన్నిడిమాండ్లు పెట్టినట్టు సమాచారం..

ఇదీ చదవండి : పొత్తులపై అప్పుడే నిర్ణయం.. నేతలకు పవన్ ఏం చెప్పారంటే..?

గంటా డిమాండ్లు ఇవే:  తాను వైసీపీలోకి వస్తే.. తనతో పాటు మరో ఇద్దర్ని కూడా పార్టీలోకి తీసుకుని సీట్లు ఇవ్వాలని కండిషన్ పెట్టారంట.. ఇక తనకు గాజువాక లేదా యలమంచిలి సీటు ఇవ్వాలని.. తనతో పాటు వచ్చిన వారికి భీమిలి, అనకాపల్లి సీట్లు ఇవ్వాలని.. ఎవరు ఎక్కడ అయినా.. ఈ మూడు నియోజకవర్గాలు అంటే.. గాజువాక, భీమిలి, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల పూర్తి బాధ్యత తనకే అప్పగించాలి అని కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ కండిషన్లకు ఒకే చెప్పడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఎందుకంటే స్థానికంగా గంటాపై వైసీపీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వారెవరూ ఆయన రాకను స్వాగతించరు.. అదే జరిగితే గ్రూప్ వారు పెరిగే అవకాశం ఉంది. అయితే గంటా ఒకరినే పార్టీలో చేర్చుకుని.. అడిగిన సీటు ఇవ్వడానికి ఓకే చెప్పడానికి సిద్ధమైట్టు తెలుస్తోంది. కానీ అందుకు గంటా సానుకూలంగా లేరనే ప్రచారం ఉంది..?

ఇదీ చదవండి: ఆ నెలలోనే అసెంబ్లీ రద్దు.. ఎన్నికలు ఎప్పుడంటే..? నేతలకు సమాచారం అందిందా..?

గంటా అవసరం ఏమొచ్చింది: మొన్నటి వరకు గంటాను వద్దన్న వైసీపీ అధిష్టానం ఇప్పుడు గంటాను  ఆహ్వానిస్తుండడానికి  ప్రధాన కారణం.. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందడమే కారణం అంటున్నారు. ఒకవేళ జనసేన , టీడీపీ కలిసి పోటీ చేస్తే.. ఆ వర్గం ఓట్లన్నీ ఆ కూటమికి పడే అవకాశం ఉంటుందని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యూహాన్ని తిప్పి కొట్టాలి అంటే..? గంటా శ్రీనివాసరావు .. ముద్దగడ పద్మనాభం లాంటి నేతలను పార్టీలో తీసుకుంటే లాభం ఉంటుందని లెక్కేస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులోనూ విశాఖపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ చేసినా.. సిటీలో ప్రభావం చూపించగలిగే నేత ఎవరూ కనిపించడం లేదని.. గంటా శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకుంటే.. కలిసి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం..

ఇదీ చదవండి: వైసీపీ ఎన్నికల నినాదం అదే.. కలిసి వస్తున్న మూడు రాజధానుల నిర్ణయం.. ఎంతశాత ప్రభావం

మెగాస్టార్ మద్దతు ఉందా..? అయితే గంటా శ్రీనివాసరావు వైసీపీ నేతలతో టచ్ లోకి వచ్చే ముందు.. మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినట్టు ప్రచారం ఉంది. చిరంజీవితో పూర్తి రాజకీయ భవిష్యత్తు.. సామాజిక వర్గ మద్దతు ఇలా పలు అంశాలపై చిరంజీవితో చర్చించిన తరువాతే.. ఆయన వైసీపీ నేతలను కలిశారని ఆ సామాజిక వర్గ నేతల్లో ప్రచారం జరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ganta srinivasa rao, Megastar Chiranjeevi

ఉత్తమ కథలు