Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ETIKOPPAKA WOODEN TOYS HAS MANY SPECIALTIES AND HISTORY TAKE A LOOK AT THE UNIQUE ART FROM VISAKHAPATNAM ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VNL NJ

Vizag News: బాపు బొమ్మకు పోటీ ఈ లక్క బొమ్మలు.. అందంతో కట్టిపడేస్తాయి.. కానీ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాయి..

ఏటికొప్పాకబొమ్మలు

ఏటికొప్పాకబొమ్మలు

Visakhapatnam: లక్క బొమ్మలు మీకు గుర్తున్నాయా? ప్రతి ఒక్కరూ కూడా ఈ బొమ్మలతో తమ చిన్నపుడు ఆడుకునే ఉండి ఉంటారు. పిల్లలకి ఆడుకున్నే ఆట బొమ్మలనుంచి… ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్‌ వరుకు అన్నీ రూపాల్లోనూ లక్క బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి.

  Neelima Eaty, News18 Visakhapatnam

  లక్క బొమ్మలు మీకు గుర్తున్నాయా? ప్రతి ఒక్కరూ కూడా ఈ బొమ్మలతో తమ చిన్నపుడు ఆడుకునే ఉండి ఉంటారు. పిల్లలకి ఆడుకున్నే ఆట బొమ్మలనుంచి… ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్‌ వరుకు అన్నీ రూపాల్లోనూ లక్క బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఆ ఏటి కొప్పాక బొమ్మల్లో మన సంప్రదాయాలు మరియు ఆచారాలు తప్పక కనపడతాయి. ఒకప్పుడు బొమ్మల కొలువు, వివాహాది శుభకార్యాలకు, ఇంటి గృహప్రవేశములు, పిల్లలు పుట్టిన రోజు వేడుకలకి ఈ లక్క బొమ్మలే ప్రధాన ఎట్రాక్షన్‌.విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక గ్రామం.. కనీసం వంట చెరుకుగా పనికిరాని అంకుడు కర్రతో అద్భుతమైన బొమ్మలు తయారుచేసే ఊరు. ఈ గ్రామంలో చాలామంది ఈ బొమ్మల తయారీపైనే జీవనం సాగిస్తుంటారు. అందుకే ఇక్కడ తయారుచేసే బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలని ప్రసిద్ధి.

  ఈ బొమ్మలకి 400 వందల ఏళ్ల చరిత్ర ఉంది. వరహానది పక్కనే ఈ గ్రామం ఉంటుంది. దీంతో ఒకవైపు నది పరవళ్లు..మరోవైపు కళాకారులు అందమైన బొమ్మలను చెక్కుతున్న శబ్ధాలు పోటీపడుతున్నట్లు ఉంటాయి. ఇక్కడ బొమ్మలకు సహజ రంగులద్దుతారు. ఏటికొప్పాక హస్త కళాకారుల నైపుణ్యానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మన్‌కీ బాత్‌లో ప్రధానిమోదీ ఓ సారి ఈ బొమ్మల గురించి ప్రస్తావన చేశారు. దీంతో ఈ బొమ్మల విశిష్టత మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా ఏటికొప్పాక బొమ్మలు ప్రాముఖ్యత సంపాదించాయి.

  ఇది చదవండి: సాగరగర్భంలో అందమైన ప్రపంచం.. ఏపీ తీరంలో అరుదైన పగడపు దిబ్బలు..


  అందమైన బొమ్మల తయారీ వీళ్లకు లక్కతో పెట్టిన విద్య
  400 ఏళ్ల క్రితం… అంకుడు కర్ర ఎక్కువగా దొరికే ఏటికొప్పాక పరిసర ప్రాంతాలకు కొన్ని కుటుంబాలు వలస వచ్చి..ఆ కర్రతో బొమ్మలు తయారు చేయడం ప్రారంభించాయి. క్రమంగా వాటికి ఆధరణ పెరగడంతో…ఆ గ్రామంలోని మరికొందరు కూడా ఈ బొమ్మలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఊరివారంతా బొమ్మల తయారీలో నిమగ్నమయ్యారు.

  ఇది చదవండి: అదో భూతల స్వర్గం.. ఒక్కసారి వెళ్తే వెనక్కి రావాలనిపించదు.. అంత అందంగా ఉంటుంది..


  1990 వరకు ఈ బొమ్మలకు రసాయన రంగులే అద్దేవారు. అయితే ఆ గ్రామానికి చెందిన చింతలపాటి వెంకటపతిరాజు… అప్పటివరకు వినియోగిస్తున్న రసాయన రంగుల స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడటం మొదలుపెట్టారు. దీంతో ఏటికొప్పాక బొమ్మల అందం వంద రెట్లైయ్యింది. క్రమంగా సహాజ రంగుల తయారీని గ్రామంలోని కళాకారులు నేర్చుకుని బొమ్మలకు వాటిని అద్దడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా ఏటికొప్పాక బొమ్మలకు మంచి గిరాకీ వచ్చింది. ఏటికొప్పాల బొమ్మలు లేని బొమ్మల కొలువు ఉండదంటే నమ్మండి. కొత్తగా పెళ్లైన జంటకు..ఇక్కడి జంట బొమ్మలను గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. అమ్మాయిలకు ఇక్కడ వంట సామాగ్రినే బహుమతులుగా ఇస్తుంటారు.

  ఇది చదవండి: బ్రేక్ ఫాస్ట్ లో బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా..? కోడి కూయకముందే పాయా రెడీ..


  రాంచీ నుంచి లక్క సేకరణ… సహజ రంగుల తయారీ
  బొమ్మలను తయారు చేయడానికి ఉపయోగించే కలప స్వభావంలో మృదువైనది. ఏటికొప్పాక బొమ్మలను తయారు చేసేటప్పుడు, అనేక రకాల కీటకాల యొక్క రంగులేని రెసిన్ స్రావమైన లక్కను ఉపయోగిస్తారు. అది ఎక్కువగా రాంచీ నుంచి దిగుమతి చేసుకుంటారు.

  ఇది చదవండి: మత్స్యదర్శిని మిమ్మల్ని మాయ చేస్తుంది.. అదో అద్భుత ప్రపంచం


  రసాయన రంగులతో పోలిస్తే సహజమైన రంగులు అద్దిన బొమ్మలే ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే లక్కకి సహజమైన రంగులను కలిపి ప్రయోగాలు చేస్తుంటారు. ఒక చిన్న పొయ్యి, మనకు లభించే ఉసిరి, కరక్కాయ, వేపవంటి వాటితోనే పరిశోధనలు చేసి...సహజ సిద్ధమైన రంగులను తయారు చేస్తారు. ఆ లక్కకి తూర్పుకనుమల్లో దొరికే వివిధ మొక్కలు, వాటి విత్తనాలు, ఆకులు, వేళ్లు, కాండం, కలుపు నుంచి వచ్చే సహజ సిద్ధమైన రంగులను కలుపుతారు. రాంచీ నుంచి తెచ్చిన లక్కను 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి…అందులో రంగుని కలిపి...దాన్ని బొమ్మలకు అద్దుతారు. సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేస్తే ఈ రంగులు ఎంత కాలమైనా పాడవ్వవు.

  ఇది చదవండి: వైజాగ్ వెళ్తే ఇక్కడికి వెళ్లడం అస్సలు మర్చిపోవద్దు.. ఫుడ్ లవర్స్ కి ఇదే బెస్ట్ ఛాయిస్


  బొమ్మల తయారీ అంటే ప్రాణం పోసినట్లే..!
  ఏటికొప్పాక బొమ్మ చేయటమంటే ఓ జీవికి ప్రాణం పోసినట్లే. ఎందుకంటే ప్రతి బొమ్మనీ విడిగా తయారు చేయవలసిందే. చుట్టుపక్కల ఉండే అడవులలో దొరికే అంకుడు చెట్ల కొమ్మలను తెచ్చి ఎండబెట్టి ఈ బొమ్మలను తయారు చేస్తారు. చెవిదుద్దులు, గాజులు, షార్క్ చేపనుండి తిమింగలాలు వరకు, గోడలకు వేలాడదీసే అలంకరణలు, గోడగడియారాలు, అలంకరణ వస్తులు ఇంకా ఎన్నో వస్తువులను ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తారు.

  ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!


  బొమ్మల తయారీలో మహిళలే ఎక్కువ…
  ఏటికొప్పాకలోని ప్రతి ఇంటిలో బొమ్మల తయారీ కళాకారులుంటారు. ఇందులో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కొందరు దీన్నే వృత్తిగా ఎంచుకుంటే…మరికొందరు ఇంటి పనులు చూసుకుంటూ వీలు దొరికినప్పుడు బొమ్మల తయారీ చేస్తుంటారు. ఏటికొప్పాకలో తయారు చేసిన బొమ్మలు ఇతర రాష్ట్రాలతో పాటు, విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఏటికొప్పక బొమ్మలు అదే గ్రామంలో కొనుకుంటే మార్కెట్ రేటు కంటే.. అతి తక్కువ ధరలకే లభిస్తాయి.  ఏటికొప్పాక బొమ్మల వైభవం తగ్గింది..?
  ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ బొమ్మలను ఇప్పుడు పట్టించుకునే వాళ్లే కరువయ్యారని దాని మీద ఆధారపడి జీవిస్తున్న కళాకారులు చెబుతున్నారు. ఈ గ్రామంలో కళాకారులకు ప్రభుత్వం అవార్డులు ఇచ్చి గుర్తించినా..ప్రధాని మోదీ పొగిడినా వీళ్ల జీవితాల్లో అయితే ఏ మార్పు రాలేదంటున్నారు బొమ్మల ఫ్యాక్టరీ యజమాని అప్పన్న. ఒకవైపు కలప కొరత, లక్క దిగుబడి కొరత కళాకారులను వెంటాడుతున్నాయి. కాలంతో పాటు సృజనాత్మకంగా బొమ్మలు చేయడానికి ప్రభుత్వాల నుంచి సరైన సహాయం అందితే బాగుంటుందని బొమ్మల ఫ్యాక్టరీ యజమాని అప్పన్న కోరుతున్నారు.

  చిరునామా: S.S. అప్పన్న, యజమాని, ఏటికొప్పాక, విశాఖపట్నం జిల్లా , ఆంధ్ర ప్రదేశ్-531082
  ఫోన్ నంబర్: 9866482350 9550362351.

  Visakhapatnam Etikoppaka

  ఎలా వెళ్లాలి?
  విశాఖపట్నం బస్టాండ్‌ నుంచి ఏటికొప్పాకకు డైరక్ట్‌ బస్సు సౌకర్యం ఉంది. ఈ ఫ్యాక్టరీ కి వెళ్ళాలి అంటే అడ్డురోడ్ నుండి ఆటోలు ఉంటాయి. అన్ని రోడ్ మీదే ఉండడంతో పెద్దగా వెతకడానికి ఇబ్బంది ఉండదు. రైలుమార్గం ద్వారా అయితే నర్సీపట్నం నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం ఉంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు