Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ECO FRIENDLY RAKSHA BANDHAN WITH SEEDS RAAKHI VSJ NJ ABH

Vizag: ప్రకృతి రక్షగా...సీడ్‌ రాఖీలు! రక్షాబంధన్‌కు...ఎకో ఫ్రెండ్లీ రాఖీలే బెస్ట్‌ అంటున్న విద్యార్థులు..!

విత్తనాలతో

విత్తనాలతో రాఖీలు

రక్షాబందన్‌..ఈ పండగ ముఖ్య ఉద్ధేశం.. చెల్లికి అన్న ఎప్పుడూ అన్న రక్షకా ఉంటానని ప్రమాణం చేయడం. అయితే కేవలం అన్నాచెల్లెలి బంధం మాత్రమే కాదని… పర్యావరణం పట్ల మన బాధ్యతను తెలియజేసేది అంటున్నారు సన్‌ప్లవర్ సిల్వర్‌ జూబ్లీ విద్యాసంస్థల విద్యార్థులు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    (Setti Jagadesh, News 18, Vizag)

    రక్షాబందన్‌..రాఖీ పౌర్ణమి రోజున దేశమంతా అన్నాచెల్లెళ్లు ఆత్మీయంగా జరుపుకునే పండగ. ఈ పండగ ముఖ్య ఉద్ధేశం.. చెల్లికి అన్న ఎప్పుడూ అన్న రక్షకా ఉంటానని ప్రమాణం చేయడం. అయితే కేవలం అన్నాచెల్లెలి బంధం మాత్రమే కాదని… పర్యావరణం పట్ల మన బాధ్యతను తెలియజేసేది అంటున్నారు సన్‌ప్లవర్ సిల్వర్‌ జూబ్లీ విద్యాసంస్థల విద్యార్థులు.

    రాఖీ పండగ అనగానే…మార్కెట్‌లో రకరకాల రాఖీలు దర్శనమిస్తాయి.. అయితే ఈ ప్లాస్టిక్‌ కాగితాలతో తయారుచేసిన రాఖీల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో దేశీయ విత్తనాలతో రాఖీలను తయారుచేస్తూ… సన్ ఫ్లవర్ సిల్వర్ జూబ్లీ విద్యా సంస్థ విద్యార్థులు వినుత్న కార్యక్రమం చేపట్టారు.

    విత్తనాలతో ప్రకృతి బంధన్‌...!

    పేపర్‌తో గుండ్రంగా తయారు చేసిన రాఖీలపై దేశీయ జాతి మొక్కల విత్తనాలు అంటించి సరికొత్త రాఖీలను తయారు చేస్తున్నారు. ఈ రాఖీలను పారేసినా పర్యావరణానికి ఎలాంటి హానీ కలగదు సరికదా…భూమిలోకి వెళ్లిన ఈ విత్తనాల ద్వారా మొక్కలు వస్తాయి. వేరు వేరు డిజైన్స్‌తో కలర్‌ఫుల్‌గా ఈ రాఖీలను తయారు చేశారు. సేవ్‌ ఫారెస్ట్, Save Soil, సేవ్‌ ఎర్త్‌, సేవ్‌ సీ( Save sea) అంటూ సందేశాత్మక మెసెజ్‌లను ఆ రాఖీలపై గింజలతో తీర్చిదిద్దారు. ఈ గింజలన్నీ కూడా ఆహార పంటలకు సంబంధించినవే.

    రాఖీ కట్టిన చెల్లికి అన్ని వేళలా అండగా ఉంటూ అన్న ఏ విధంగా రక్షిస్తాడో… అదేవిధంగా భూమి కూడా విత్తును ఆత్మీయంగా హత్తుకుంటుంది. ఆ విత్తు మొక్క అయ్యే వరకు.. ఆ తర్వాత కూడా ఎప్పుడూ అండగా ఉంటూ కాపాడుకుంటుంది.



    చెట్లు నరకకుండా , మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుకుందాం అని… భవిష్యత్ తరాల వారికి కలుషితం లేని ఆరోగ్యమైన జీవితం ఇవ్వాలని అంటున్నారు ఈ చిన్నారులు. మధురవాడ లోని సన్ ఫ్లవర్ సిల్వర్ జూబ్లీ విద్యా సంస్థ ఆధ్వర్యంలో… దేశీయ విత్తనాలతో రాఖీలు తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ప్లాస్టిక్ రాఖీలు వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు పర్యావరణానికి హాని కలగకుండా విత్తనాలతో రాఖిలు తయారు చేయాలని విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌ కుమారి తెలిపారు.



    ఈ స్కూల్‌లో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశాలమీద నిరంతరంగా శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థి దశలో పర్యావరణం పరిరక్షణ మీద అవగాహన కల్పిస్తే వారి ద్వారా వారి పిల్లలు కూడా పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ప్రతినిధులు జె రాజేశ్వరి, రవితేజ తదితరులు పాల్గొన్నారు.



    పర్యావరణంపై పిల్లలకు అవగాహన..!

    ఈ రోజుల్లో పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికెళ్లింది మొదలు ఫోన్‌లలో మునిగిపోతారు. అలాంటి వాళ్లను పర్యావరణం గురించి ఆలోచించేలా చేయాలంటే అప్పుడప్పుడు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీని వల్ల స్కూల్‌లోని విద్యార్థులంతా ఆసక్తిగా ఈ రాఖీలను తయారుచేయడంలో ముందుకొచ్చారు. అంతేకాదు వాటిని ఇంటికి తీసుకెళ్లి వాళ్ల సోదరులకు కడతారు. వాళ్ల స్నేహితులకు కూడా వీటి గురించి చెప్పి వాళ్లతో కూడా ఈ రకమైన పర్యావరణహిత రాఖీలను వాడేలా చేయగలరు. ఇంకా చెప్పాలంటే మన చుట్టు ఉన్నవారికి ప్రకృతి పట్ల వారికున్న బాధ్యతను గుర్తుచేయడమే ఈ విత్తనాల రాఖీల ముఖ్య ఉద్దేశం.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Local News, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు