Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM EAST GODAVARI DISTRICT RECORDING HUGE POSITIVE CASE THAN OTHER DISTRICTS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP

Corona Virus in AP: ఏపీలో ఆ ఒక్కజిల్లాను వణికిస్తున్న కరోనా... కారణాలు ఇవేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Andhra Pradesh: ఏపీలో ఆ ఒక్క జిల్లాలోనే కరోనా ఎందుకు వ్యాపిస్తోంది.? దేశంలోని అన్ని రాష్ట్రాలు జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పడుతోంది.

    ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

    ఏపీలో ఆ ఒక్క జిల్లాలోనే కరోనా ఎందుకు వ్యాపిస్తోంది.? దేశంలోని అన్ని రాష్ట్రాలు జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితి. కానీ.. ఏపీలోని తూర్పు గోదావరిలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ సర్కారు అన్ని చోట్లా ఆంక్షలు సడలించినా.. ఈస్ట్ లో మాత్రం కర్ఫ్యూని కొనసాగిస్తోంది. ప్రధానంగా కాకినాడ, మండపేట, సామర్లకోట, అమలాపురం ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గడం లేదు. ఏపీలోని అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ వేళలు సడలించారు. ఒక్క తూర్పు గోదావరి తప్ప. అక్కడ ఆంక్షలు ఇంకా కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరితో పోలిస్తే పశ్చిమ గోదావరిలోనూ పాజిటివిటీ రేటు తక్కువే ఉంది. పోలీసుల సమాచారం ప్రకారం తూగోలో ఎక్కువగా కోవిడ్ నిబంధన ఉల్లంఘనే జరుగుతోంది. దీనివల్లే కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ప్రధానమైన నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి.

    పోలీసులు, అదికారులు ఎంత చెప్పినా స్వీయ నియంత్రణ లేకపోవడంతో కోవిడ్ కేసులు పెరిగాయి. కొవిడ్‌-19 మొదటి దశలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహనాల చట్టం కింద 80,466 కేసులు నమోదు చేశారు. జరిమానా చూస్తే రూ.1.97 కోట్లు. సెకండ్‌వేవ్‌ కర్ఫ్యూలో 17,152 కేసులతో రూ.85.76 లక్షలు జరిమానా వేశారు. రూరల్, అర్బన్ ప్రాంతాల్లో మొదటి, రెండు దశల్లో మాస్కు ధరించని 79,582 మందిపై కేసులు నమోదు చేసి వారి నుంచి రూ.64.38 లక్షలు జరిమానా వేశామని పోలీసుల గణాంకాల ద్వారా తేలింది. ఇందులో ఎక్కువగా మోటారు యాక్ట్ ఉల్లంఘన కింద 56,683 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.2.83 కోట్ల జరిమానా వేశారు. అంటే ఉల్లంఘన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాల్సిందే.

    ఇది చదవండి: థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ ఇదే.. అధికారులతో ఏమన్నారంటే..!


    కొవిడ్‌ ఉల్లంఘన, ఎపిడిమిక్‌ చట్ట ప్రకారం తొలి, సెకండ్‌ వేవ్‌లో జిల్లాలో 3,578 కేసులు నమోదు చేసి 6,375 మందిని అరెస్టు చేశారు. 1200 దుకాణాలు, పలు వాహనాలను సీజ్‌ చేశారు. కరోనా ఉధృతి తగ్గే వరకు మధ్యాహ్నం 2నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పుడే ఇవన్నీ. కేసులు పెరుగుతున్నా.. కోవిడ్ నియమాల్ని పాటించడం లేదని పోలీసు శాఖ అంటోంది. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు కర్ఫ్యూని పటిష్టంగా అమలు చేస్తామని ఎస్పీ అద్నాన్‌ నయీం ప్రకటించారు. రెగ్యులర్ గా కర్ఫ్యూ తనిఖీలను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరిలోని పలు ప్రాంతాల్లో నిబంధనలు కఠినతరం చేశారు. అనపర్తి, అమలాపురం వంటి ప్రాంతాల్లో మొదట్లో కంటైన్ మెంట్ జోన్లుగా కూడా చేశారు. అయితే ఇప్పటికి పదమూడు మండలాలు కరోనా ప్రభావితంగానే ఉన్నాయి.

    Telangana Inter Results 2021: ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు... News18లో చూసుకోండి



    పోలీసులు మృతి..?
    ఎక్కువగా అధికారుల, పోలీసులు ఈ కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా మరణించారు. ఫస్ట్‌ వేవ్‌లో 1174 మంది కరోనా బారిన పడ్డారు. 11 మంది పోలీసులు మృతి చెందారు. సెకండ్‌ వేవ్‌లో 494 మంది కరోనా బారిన పడ్డారు. ముగ్గురు సిబ్బంది మృతి చెందారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరిగింది. అయినా.. పోలీసులు మృతిచెందిన పరిస్థితి. ఈస్ట్ లో 4,138 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఉండగా 4054 మందికి మొదటి డోసు, 3,523 మందికి సెకండ్‌ డోసు వ్యాక్సిన్లు వేసుకున్నారు. ఎక్కువగా రోడ్లు, కూడళ్లలో గస్తీ కాసిన వారే కోవిడ్ బారిన పడుతున్నారని పోలీసుశాఖ చెబుతోంది. ప్రజలు ఈ విషయంలో సహకరించకపోతే.. కర్ఫ్యూ సడలింపులు ఉండబోవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని కొన్ని జిల్లాలో కర్ఫ్యూను సడలించి రాత్రి తొమ్మిదిగంటలకు పనివేళలు పొడిగించారు. కానీ.. ఈస్ట్ గోదావరితో పాటు.. మూడు జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూను యథాతథం చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Corona virus, East Godavari Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు