హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Alert for Coastal Andhra: ఆంధ్రప్రదేశ్ కు ముప్పు పొంచిఉందా..? సముద్రంలో కల్లోలం దేనికి సంకేతం..?

Alert for Coastal Andhra: ఆంధ్రప్రదేశ్ కు ముప్పు పొంచిఉందా..? సముద్రంలో కల్లోలం దేనికి సంకేతం..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Andhra Pradesh: ప్రకృతిలో జరిగే విపత్తులను సముద్రంలో జరిగే అలజడులను బట్టి ముందుగా గుర్తిస్తారు. అటువంటి సముద్రం తీరంలో ఒక్క సారిగా జరిగే మార్పులు దేనికి సంకేతం..?

  P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

  ప్రకృతిలో జరిగే విపత్తులను సముద్రంలో జరిగే అలజడులను బట్టి ముందుగా గుర్తిస్తారు. అటువంటి సముద్రం తీరంలో ఒక్క సారిగా జరిగే మార్పులు దేనికి సంకేతం..? అది మన ఆంధ్రప్రదేశ్ సముద్రం తీరంలో జరిగే మార్పులు దేనిని సూచిస్తున్నాయి..? తూర్పుతీరంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది..తూర్పు తీరంలో అసలు ఏమి జరుగుతుంది.? అంతర్వేది మరియు ఉప్పాడ వద్ద సముద్రంలో జరిగిన మార్పులు.. మరోప్రక్క సముద్రం లో భూప్రకంపనలు.. ఇవే తీరప్రాంత వాసులను కలవరపెట్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారి తీరం కోతకు గురైంది. నెలరోజుల్లో 45 మీటర్లు ముందుకు చోచ్చుకోచ్చింది. అంతెకాకుండా తీరంలో ఉండే గెస్ట్ హౌస్, కోన్నిగృహలు కొట్టుకుని పోయాయి. ఇటు ఉప్పాడ తీరంలో ను ఇదే పరిస్థితి,గత రెండు వారాల క్రితం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉప్పాడ తీరం వెంబడి రాకాసి అలలు ఎగసిపడి కోతకు గురవుతూ.., సముద్రం ముందుకు చొచ్చుకొచ్చి ఉప్పాడ తీరం వెంబడి బీచ్ రోడ్డును తాకుతు కెరటాలు ఎగసిపడే వి. కాని నిన్న జరిగిన పరిణామం NGRI శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కడం లేదు. అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చోచ్చుకొచ్చి సముద్రపు అలలతో అల్లకల్లోలంగా మారింది.

  కానీ ఉప్పాడ తీరం వెంబడి మాత్రం తీరం వెంబడి అలలతో అల్లకల్లోలంగా ఎగసిపడే కెరటాలతో అలజడి చేసే సముద్రం అందుకు భిన్నంగా కొన్ని మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ హఠాత్పరిణామంతో తీరప్రాంత వాసుల్లో అలజడి మొదలైంది. ఇది ఇలా ఉంటే బంగాళాఖాతంలో మంగళవారం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.1 తీవ్రతతో భూకంపం రాగా.. చెన్నైలో స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరానికి 290 కిలోమీటర్ల దూరంలో ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అంతర్వేది, రాజోలు, నరసాపురం, అమలాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో సముద్రంలో భూమి కంపించింది.

  ఇది చదవండి: ఆ పాఠశాలలు మూసివేయాల్సిందే... ఏపీ ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాదన...


  అటు తమిళనాడులోని పలు ప్రాంతంలో భూమి కంపించగా.. జనాలు భయాందోళనకు గురయ్యారు. పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. తిరువన్మియూర్, ఆళ్వార్‌పేట్, చెన్నైలోని సుముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ప్రకంపనలు వచ్చాయని వచ్చినట్లు కొందరు ట్వీట్లు చేశారు. భూకంపంతోనే ప్రకంపనలు వచ్చినట్లు ఐఎండీ చెన్నై శాఖ ధ్రువీకరించింది. ప్రకంపనలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పింది. ఈ భూకంపం కాకినాడకు ఆగ్నేయంగా 296 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 320 కిలోమీటర్ల భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అయితే, సముద్ర అలలను పరిశీలిస్తున్నామని.. ముందస్తుగా సునామీపై అంచనా వేయలేమని మరికోందరు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: ఇంజనీరింగ్ తెలివి అవినీతిలో చూపించాడు... ఏడాదిలోనే కోట్లలో స్కామ్..


  ఈ సముద్రంలో భూకంపానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా..? ప్రకంపనల కారణంగా సముద్రం ఒకచోట ముందుకు.. మరోచోట వెనక్కి వెళ్లిందా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. హైదరాబాద్ సునామీ హెచ్చరికల కేంద్రం నుంచి, NGRI శాస్త్రవేత్తలు కూడా ఈ పరిణామంపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా సముద్రతీరంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పాటు ఆటుపోట్లకు సహజంగా ముందుకు వెనక్కి వెళుతుంటాయి. కానీ ఒక్కసారిగా మీటర్ల కొద్ది వెనక్కి.. ముందుకి.. రావడం చూస్తూంటే సునామి వంటి భారీ విపత్తు ముంచుకొస్తుందా..? అనే అనుమానాలు సముద్ర తీర ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతున్నాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Bay of Bengal, Kakinada, Visakhapatnam

  ఉత్తమ కథలు