హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: వైభవోపేతంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..! వివిధ రూపాల్లో కొలువుదీరిన అమ్మవారు..!

Vizag: వైభవోపేతంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..! వివిధ రూపాల్లో కొలువుదీరిన అమ్మవారు..!

విశాఖలో

విశాఖలో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు

విశాఖపట్నం (Visakhapatnam) లో వెరైటీ రూపాలతో అమ్మవారు విగ్రహాలు సిద్ధమయ్యాయి. దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. రెండు సంవత్సరాల కరోనా తర్వాత దుర్గమ్మ విగ్రహాలు వివిధ రూపాల్లో పూజలందుకోనుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  విశాఖపట్నం (Visakhapatnam) లో వెరైటీ రూపాలతో అమ్మవారు విగ్రహాలు సిద్ధమయ్యాయి. దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. రెండు సంవత్సరాల కరోనా తర్వాత దుర్గమ్మ విగ్రహాలు వివిధ రూపాల్లో పూజలందుకోనుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఎదుర్కొన్న నష్టాన్ని పూరించడానికి కళాకారులు కాస్త భిన్నంగా ఉండే విగ్రహాలను తయారి చేశారు. దసరా అంటేనే అమ్మవారి కనువిందు పండగ . వినాయక చవితి తర్వాత వచ్చే పెద్ద పండుగ దసరా. ప్రజలు పెద్ద ఎత్తున దుర్గాదేవి విగ్రహాలు పెట్టి కొలుస్తారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో దసరాను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇప్పటికే విజయవాడ దుర్గమ్మ ఆలయం దసరాకి ముస్తాబయ్యింది.

  బొమ్మల వ్యాపారులు.. జోరుగా అమ్మవారి విగ్రహాల్ని తయారుచేసారు. వాటర్ పెయింట్స్‌తో ప్రత్యేక రంగుల్లో చూడముచ్చటగా ఉండేలా ఆకర్షణీయంగా రూపొందించారు. ఈ సారి మరీ అంత పెద్ద విగ్రహాలు కాకుండా... కొద్దిగా చిన్న సైజువే చేస్తున్నారు. అయితే.. గత రెండు సంవత్సరాలుగా వాటిని ప్రజలు కొంటారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ బాధ తప్పింది అంటున్నారు కళాకారులు. చేసిన విగ్రహాలు అన్ని అమ్ముడయ్యాయట.

  ఇది చదవండి: వాటిని కట్టింది ఎందుకు.. అక్కడ జరుగుతున్నదేంటీ..? అధికారులు నిద్రపోతున్నారా..?

  చెడును అంతం చేసి... ప్రపంచానికి మంచిని ప్రసాదించే మాతృమూర్తి కాళికా మాత అని ప్రజలు నమ్ముతారు. పండుగ ఎంత బాగా జరిగితే... కళాకారులకు అంతలా మేలు జరుగుతుంది. ఇప్పటివరకు కళాకారులు విగ్రహాల తయారీలో బిజీగానే ఉన్నారు. నేడు అదరి మడపలు వద్దకు అమ్మవారు చేరుకొని ప్రత్యేక పూజలు అందుకుంటారు.

  ఇది చదవండి: ప్రభుత్వ ఉద్యోగమున్నా డోంట్ కేర్.. సొంత సెలూన్ ఉంటేనే పిల్లనిస్తారట..!

  విశాఖలో పర్యావరణానికి మేలు చేసేలా అన్ని కూడా మట్టి విగ్రహాలను ఎక్కువగా తయారుచేశారు. సహజ రంగులు వేసి అమ్మవారి రూపానికి ప్రాణం పోశారు. బెంగాల్‌కు చెందిన కళాకారులు నెలల కొద్ది శ్రమించి అమ్మవారి విగ్రహాలను ఆకట్టుకునేలా రూపొందించారు. ఆ జగజ్జనని రాకతో.. తమ జీవితాలు మెరుగవుతాయనే ఆశతో భక్తిగా అమ్మవారిని తీర్చిదిద్దారు.

  అమ్మవారి నవరాత్రులు ఉత్సవాలు అంటే తొమ్మిది పవిత్ర రాత్రులు. మన హిందూ మతం సాంప్రదాయంలో ఇవి అత్యంత పవిత్రమైన రోజులుగా చెప్తారు. చెడుపై దుర్గ దేవి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా పండుగను జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో భాగంగా దుర్గ దేవి అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారాల్లో కనిపిస్తారు. ఈరోజు నుండి తొమ్మిది రోజులు పాటు దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు వైభవంగా జరగనున్నాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Dussehra 2022, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు