Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM DRUNKEN FATHER ARRESTED FOR KILLING SON IN SRIKAKULAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VZM

Father and Son: పంది మాంసం విషయంలో తండ్రీకొడుకుల గొవడ.. చివరికి ఒక ప్రాణం పోయింది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Drunken Father: మందుకొడితే మనిషికి మృగానికి తేడా ఉండదనడానికి ఇదొక ఉదాహరణ. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి స్పృహ లేకుండా, ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో కన్న కొడుకునే హత్యచేసాడు ఓ తండ్రి.

  P. Bhanu Prasad, Vizianagaram, News18

  మందుకొడితే మనిషికి మృగానికి తేడా ఉండదనడానికి ఇదొక ఉదాహరణ. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి స్పృహ లేకుండా, ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో కన్న కొడుకునే హత్యచేసాడు ఓ తండ్రి. తనను మందలించాడన్న కారణంతోనే తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకళం జిల్లా (Srikakulam) టెక్కలిలోని భూలోక మాత వీధికి చెందిన సాయి నాగరాజు పెయిటింగ్ పనులు చేస్తుంటాడు. కూలిపనులు చేస్తూనే తల్లిదండ్రులు లవకుశ, దమయంతి, సోదరి మాలతిని పోషిస్తున్నాడు. తండ్రి లవకుశ పూలదుకాణంలో పనిచేస్తుంటాడు. మద్యం తాగే అలవాటున్న లవకుశ తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. నిత్యం తండ్రీ, కొడుకుల మధ్య గొడవలు, వాగ్వాదాలు జరుగుతుండేవి. చెడు అలవాట్లు మానేసి చక్కగా ఉండాలని కొడుకు చాలా సార్లు తండ్రికి చెప్పిచూశాడు.

  ఐతే శుక్రవారం రాత్రి ఫుల్లుగా తాగొచ్చిన లవకుశ.. పందిమాంసం వండుతున్న కొడుకు వద్దకు వెళ్లాడు. మందుకొట్టి తన దగ్గరకు రావొద్దని దూరంగా వెళ్లాలని కొడుకు వారించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన లవకుశ.. ‘నాకే నీతులు చెబుతావా..? పక్కనే ఉన్న కత్తిపీటతో కుమారుడిపై దాడిచేశాడు. కొడుకు పొట్టలో మూడుసార్లు పొడవడంతో నాగరాజు కుప్పకూలి పోయాడు.

  ఇది చదవండి: 13 ఏళ్ల బాలికతో వ్యభిచారం.. 23 మంది అరెస్ట్.. వారిలో సినీ నిర్మాత..?


  కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి హుటాహుటిన జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అప్పటికే నాగరాజు మృతి చెందినట్టు వైద్యులు తెలుపారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఓ వైపు చేతికొచ్చిన కొడుకు చనిపోవడం, ఇంటిపెద్ద జైలుకు వెళ్లడంతో నాగరాజు తల్లి, సోదరి దిక్కులేనివారయ్యారు. కళ్లెదుటే కొడుకు చనిపోవడంతో దమయంతి, ఆమె కుమార్తె మాలతి శోకసంద్రంలో మునిగిపోయారు. తాగుడు ఎంతపనిచేసిందని ఇద్దరూ రోదిస్తున్న తీరు స్థానకులను కలచివేసింది.

  ఇది చదవండి: అత్త మీద కోపంతో  అల్లుడు చేసిన హడావిడి.. పరుగులు పెట్టిన పోలీసులు..


  ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అనంతపురం నగరానికి చెందిన మహబూబ్ బాషా న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఇతనికి హుస్సేన్ అనే కుమారుడు ఉన్నాడు. ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన హుస్సేన్ కు తండ్రి అంటే ప్రాణం. ఐతే బాషా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన హుస్సేన్.. తప్పుచేస్తున్నావంటూ తండ్రిని మందలించాడు. అయినా తండ్రిలో ఎలాంటి మార్పు రాలేదు. తన మాట వినలేదని బంధువులతో తన గోడు వెళ్లబోసుకుంటున్నాడు. ఎన్ని చెప్పిన నాన్న మహబూబ్ భాషలో మార్పులు రావడం లేదని తన బాధను వెళ్లగక్కాడు. విషయం తెలుసుకున్న బాషా.. కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కొడుకు మంటల్లో కాలిపోతున్నా బాషా మాత్రం కాపడలేదు. శరీరమంతా కాలిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హుస్సేన్ మృతి చెందాడు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Son killed by father, Srikakulam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు