హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Drum Sticks: మునగ.. ఆరోగ్యంతో పాటు రైతులకి కాసుల‌ పంట.. !

Drum Sticks: మునగ.. ఆరోగ్యంతో పాటు రైతులకి కాసుల‌ పంట.. !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ పంట తో నెలకి 50 వేల వరకు సంపాదించుకోవచ్చు. సంవత్సరానికి ఆరు లక్షల వరకూ సంపాదించుకోవడానికి అవుతుంది. ఒక్క మొక్క నుంచి  ఒక ట్రిప్పు కు 200 నుంచి 400 కాడలు వస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam | Srikakulam

Anand Mohan Pudipeddi, News18, Visakhapatnam.

ఉద్దానం అంటే కొబ్బరికి ప్రసిద్ది... కాని ప్రకృతి ఒక్కోసారి తన ప్రతాపం చూపడంతో కొబ్బరి రైతులు కుదేలు అవుతున్నాడు.. ఈ నేపధ్యంలో ఉద్యానవన అధికారులు కొబ్బరిలో అంతర పంటగా మునగ పంటను రైతులతో వేయించారు... అనుకున్నట్టుగానే మునగ పంట అధికంగా రావడంతో లాబాలు అర్జిస్తున్నారు. ఎప్పుడూ సమస్యలే అడిగే వారే  ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ప్రకృతి సహకరించకపోయనా అధికారులు సలహాలు వరకే కాకుండా ఎటువంటి ఆర్ధిక సహాయం లేకున్నా ఉద్దానం కొబ్బరి రైతు మొహంలో ఇప్పుడు నవ్వు కనపడుతోంది... ఉద్దానం పరిధిలో కవిటి, కంచిలి, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండల్లాలలో కొబ్బరికి అంతర పంటలుగా మునగాకు రైతులు సాగు చేస్తున్నారు... ఎన్నో తుఫాన్లు వల్ల అటు కొబ్బరి, ఇటు జీడి మామిడి ఫల సాయం లేక గత 6 సంవత్సరాలుగా అన్నదాత కష్టాలు గట్టేక్కాయనే చెప్పొచ్చు.

ముఖ్యంగా మునగ పంట ద్వారా ఈ ఉద్దానం రైతులు లాబాలు అర్జిస్తున్నారు.  మునగ వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పైగా మునగాకు మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మునగ సాగు చేస్తే అధిక లాభాలని స్వల్పకాలంలో పొందొచ్చు అధికారుల చెప్పిన మాటల వల్ల మునగ సాగు చేసి నేడు రైతులు లాబాలు అర్జిస్తున్నారు. ఉద్దాన ప్రాంతంలో ఉన్న నేలల్లో పండిన ఈ పంట అటు ఒడిషా, బెంగాల్, తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది తమకు ఫోన్ల ద్వారా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. తుఫాన్ల వల్ల కొబ్బరి వల్ల నష్టపోయామని ఈ సంవత్సరం మునగు డిమాండ్ అధికంగా ఉందని అందులో ఉద్దానం మునగ అంటే చాలా మంది ఇష్టంగా  తింటున్నారని అన్నారు.

సాధారణంగా మునగ జనవరి నెలలో పూతకు వచ్చి ఫిబ్రవరీలో కాయలు కోతకు వస్తాయి. కాయలు కాసే సమయంలో నాలుగు నుండి ఐదు రోజులకి ఒకసారి నీళ్ళు పెడితే నాణ్యమైన కాయల దిగుబడి పొందొచ్చు. అదే విధంగా జాగ్రత్తగా చీడ పీడ సమస్యలని రైతుల గమనిస్తూ సరైన సమయంలో సస్యరక్షణ చేపడితే మంచిగా దిగుబడులను పొందొచ్చని తలుసుకున్న యువత  గ్రామాల్లో పంటను పండిస్తున్నారు.  దీంతో చక్కటి లాభాలను కూడా వాళ్లు పొందుతున్నారు. లక్షల్లో లాభాలు వస్తున్నాయి. అయితే ఎక్కువ రాబడిని ఇచ్చే వాటిలో మునగ సాగు కూడా ఒకటి. చెట్టుకు అధికంగా మునగకాడలు కాయడంతో రుచిగా ఈ మునగ ఉండడంతో  మార్కెట్ లో  మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఉద్దానం చాలా ఇళ్ల వద్ద కుటీర పరిశ్రమలా ఉంది... ఇంటి వద్ద మహిళలు, పిల్లలు చిన్న చిన్న కట్టులగా కట్టి ఎగుమతులు చేస్తుననారు.

తిరుమలలో శ్రీవారి బంగారు తాపడం పనులు వాయిదా.. ఇదే కారణం.!

ఆరోగ్యానికి ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయి పైగా మంచి రుచితో వుంటాయి కాబట్టి అందరికీ నచ్చుతాయి. దీనికి ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతోంది ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా సాగు చేస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే బంజరు భూముల్లో కూడా దీనిని సాగు చేయొచ్చు. తక్కువ ఖర్చు అవుతుంది పైగా మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా చేయక్కర్లేదు. ఈ పంట తో నెలకి 50 వేల వరకు సంపాదించుకోవచ్చు. సంవత్సరానికి ఆరు లక్షల వరకూ సంపాదించుకోవడానికి అవుతుంది. వర్షాలు ఎక్కువ పడిన తక్కువ పడిన సరే దీనికి ఇబ్బంది కలగదు. ఎలాంటి వాతావరణ పరిస్థితి అయినా దీనికి సెట్ అవుతుంది.

ఏడాదికి రెండు సార్లు కాపుకొస్తాయి. ఏడాది పొడుగునా  కాపు వస్తుంది. ఒక్క మొక్క నుంచి  ఒక ట్రిప్పు కు 200 నుంచి 400 కాడలు వస్తాయి. అయితే మునగకాడలు ముదురుపోకుండా చూసుకోవాలి. సరైన సమయానికి కాడల్ని కోసేసి అమ్మేస్తూ ఉండాలి. ఇలా మునగ సాగు కనుక చేసారంటే అద్భుతమైన లాభాలను పొందవచ్చు ని రైతు తమ అభిప్రాయాలను వివరించారు.

First published:

Tags: Food, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు