Vizag Firing Issue: లంబసింగి కాల్పులపై అనుమానాలు... పోలీసులు-గిరిజనుల మధ్య జరిగింది ఇదేనా..?

లంబసింగి కాల్పుల ఘటనపై సందేహాలు

Lambasingi Firing Issue: పోలీసులు అదుపులోకి తీసుకున్న భీమయ్యకు ఎలాంటి వ్యాపారాలు లేవని.. పోలీసులు తమ ఇంటికి వచ్చి ఐదు లక్షలకు బేరం కుదుర్చుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

 • Share this:
  P.Anand Mohan, Visakhapatnam, News18

  గంజాయి (Ganzai). తెలుగురాష్ట్రాల్లో అక్రమంగా రవాణా జరుగుతోంది. విశాఖపట్నం (Visakhapatnam) ఏజెన్సీ నుంచి ఏపీ, తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు కూడా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో నిత్యం గంజాయి కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా విశాఖ ఏజెన్సీలో జరిగిన కాల్పుల ఘటన సంచలనంగా మారింది. రెండు రాష్ట్రాల‌కూ ఇది కీల‌కం అనుకునే కేసు. రెండు రాష్ట్రాల‌కూ స‌వాలుగా మారుతున్న కేసు. వేల ఎక‌రాల్లో గంజాయి సాగు అవుతూ త‌రువాత అది ద్ర‌వ రూపంలో మారుతూ స‌రిహ‌ద్దులు దాటిపోతున్నా ప‌ట్టించుకోని యంత్రాంగంపై ఇదొక అభియోగం మాత్ర‌మే కాదు. అప్ర‌మ‌త్తం అయ్యేందుకు చేస్తున్న హెచ్చ‌రిక కూడా..! విశాఖ ఏజెన్సీలో అక్ర‌మార్కుల‌కు స్థానిక రాజ‌కీయ నాయ‌కుల అండ ఉంద‌న్న‌ది వాస్త‌వం. ఇదే లేకుంటే నిన్న‌టి వేళ పోలీసుల‌కు తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న అన్న‌ది ఉండ‌నే ఉండ‌దు. ఇప్ప‌టికైనా గంజాయి సాగును, ర‌వాణాను స్థానిక రాజ‌కీయ నాయ‌కులు ప్రోత్స‌హించ‌కుండా ఉంటే మేలు అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.

  గంజాయి స్మ‌గ్ల‌ర్లపై (Ganzai Smuggling) న‌మోద‌యిన కేసు ఒక‌టి ఛేదించే ప‌నిపై ఇక్క‌డికి వ‌చ్చారు తెలంగాణ పోలీసులు. కానీ సాయుధులై ఉన్న స్మ‌గ్ల‌ర్లు స్థానికుల సాయంతో రెచ్చిపోయారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై గాల్లోకి కాల్పులు జ‌రిపారు. పూర్తి సినీ ఫ‌క్కీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న రెండు రాష్ట్రాల పోలీసులను కలవరానికి గురిచేసింది. స్థానికులు కొంద‌రు రాళ్ల దాడికి సైతం తెగ‌బ‌డ్డార‌ని త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో తాము ట్రాఫిక్ లో చిక్కుకుపోయామ‌ని ఇలాంటి త‌రుణంలో త‌ప్ప‌నిసరై, ఆత్మ ర‌క్ష‌ణార్థం గాల్లోకి కాల్పులు జ‌రిపామ‌ని న‌ల్గొండ ఎస్పీ చెబుతున్నారు.

  ఇది చదవండి:వీడో సోషల్ మీడియా రోమియో.. అమ్మాయిలు, మహిళలకు వల.., మొబైల్ ఫోన్లో షాకింగ్ వీడియోలు..


  ఈ ఘటనలో మరో కథనం కూడా వినిపిస్తోంది. పోలీసులు అసలు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని.. అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారి కుటుంబాన్ని కలిసి హెచ్చరించి వచ్చారని.. వారు కారులో తరిగి వెళ్తుండగా గిరిజనులే రాళ్లు విసిరి కర్రలు, కత్తులతో దాడికి యత్నించారని చెబుతున్నారు. ఆ సమయంలో ప్రాణరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఐతే పక్కరాష్ట్రంలో నిందితుల కోసం వెళ్లినప్పుడు స్థానిక పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. విశాఖపోలీసులు మాత్రం తమకు సమాచారం లేదని చెబుతున్నారు. దీనిపై తెలంగాణ పోలీసుల ఎలా స్పందిస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది.

  ఇది చదవండి: భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య... ఎంత కోపమొస్తే మాత్రం అలా చేస్తారా..?


  ఇక స్థానిక గిరిజనులు మాత్రం దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. గ్రామస్తుల ముసుగులో స్మగ్లర్లే పోలీసులపై దాడిచేశారా..? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరోవైపు ఒకర్ని బదులు మరొకర్ని అదుపులోకి తీసుకోవడమే కారణమన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిన పోలీసులు భీమయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాల్పుల్లో గాయపడిన వారు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.

  ఇది చదవండి: అమెరికా అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్... కొన్నాళ్ల తర్వాత మనోడికి చుక్కలు చూపించింది...


  అసలు పోలీసులు ఎందుకు కాల్పులు జరిపారో తనకు తెలియదని గాయపడ్డ ఘటనలో రాంబాబు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న భీమయ్యకు ఎలాంటి వ్యాపారాలు లేవని.. పోలీసులు తమ ఇంటికి వచ్చి ఐదు లక్షలకు బేరం కుదుర్చుకొని వెళ్లారని చెప్పాడు. తాము గంజాయి తరలిస్తున్నట్లు ఆధారాలుంటే చూపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: