( Neelima Eaty, News 18, Vizag)
మీరు డబుల్ డెక్కర్ రైళ్లు చూసుంటారు లేదా డబుల్ డెక్కర్ బస్సులు కూడా చూసుంటారు... కానీ డబుల్ డెక్కర్ కేఫ్‌లను ఎప్పుడైనా చూశారా? అది మన వైజాగ్‌లో..! లేదంటే ఒక్కసారి గాజువాకలోని ఫైవ్ హెడ్స్ రెస్టో కేఫ్‌కు వెళ్తే.. ఎన్నో థీమ్స్ మీకు స్వాగతం పలుకుతాయి.
విశాఖ నగరానికి చెందిన ఐదుగురు యువకులు కలిసి ఫైవ్ హెడ్స్ (5 heads) అనే పేరుతో ఓ కేఫ్‌ను మొదలు పెట్టేరు. ఈ 5 హెడ్స్ రెస్టో కేఫ్‌లోని రకరకాల థీమ్స్ నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ ఆ కెఫ్కు వెళ్లాలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ థీమ్స్ ఏంటో తెలుసుకుందాం రండి..
డబుల్ డెక్కర్ సిట్టింగ్, రిలాక్స్ అవడానికి మరియు కూర్చోడానికి ఊగే ఉయ్యాలలు, జైల్ థీమ్ మండి బిరియాని, ఫోటోషూట్ స్పాట్… ఇలా పలురకాల ట్రెండింగ్ థీమ్‌లను ఏర్పాటుచేసి కస్టమర్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నారు.
ఈ థీమ్స్ మాత్రమే కాదు లైవ్ ఐస్ క్రీమ్‌లు ఇక్కడ స్పెషల్… మన కళ్ల ముందే మనకు కావాల్సిన ఫ్లేవర్స్‌తో ఐస్‌క్రీమ్ తయారుచేసి ఇస్తారు. చాలా రకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా తయారు చేయించుకుని అక్కడే తినేయోచ్చు.
ఇంతకీ ఆ పేరు ఎందుకు పెట్టారు?
గాజువాకకు చెందిన ఎం.తనుజ్, బి.నరేంద్ర పాత్రుడు, యం.ఎన్. బి.సాయి, ఎం.రాజేష్, బి.రంగా …ఈ ఐదుగురు యువకుడు కలిసి ఈ కెఫెను స్టార్ట్ చేశారు. అందుకనే వీళ్లంతా కాస్త రొటీన్‌కు భిన్నంగా 5 హెడ్స్ అనీ పేరు పెట్టారు. సొంతంగా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ స్నేహితులు అందరూ కలిసి..ఈ 5 heads కేఫ్‌ని చాలా సుందరంగా డెకరెట్ చేయించుకున్నారు. ఆంబియన్స్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఒక్కసారి మనం అందులో అడుగుపెడితే మనసుకు ఎంతో ప్రశాంతంగా అద్భుతమైన అనుభూతి కలుగుతుందంటే నమ్మండి.
ఇకపోతే ఫుడ్ విషయానికి వస్తే, లైవ్ ఐస్ క్రీమ్, శాండ్విచ్లు, మిల్క్ షేక్స్, డోనట్స్, పిజ్జాలు అంతేకాదు, అన్ని రకాల కేక్స్, నుట్రిషన్ లైవ్ జిమ్ ఫుడ్ మరియు సిజలింగ్ బ్రోనీస్ మరియు మండి బిరియనిలు ఇంకా మరెన్నో వెరైటీ రుచులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
నగరవాసుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ :
వీకెండ్స్ వచ్చినా, బర్త్‌డే పార్టీలైనా, ఫ్రెండ్స్ గెట్ టు గెదర్లు అయినా, ఫ్యామిలీ లంచ్లకైనా… గాజువాకలో ఇప్పుడు ఈ ఫైవ్ హెడ్స్ కేఫ్ కేరాఫ్‌గా మారింది. వీకెండ్స్, హాలిడేస్‌లో కస్టమర్లతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా పిల్లలు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లకు కొత్తగా అనిపించే డబుల్ డెక్కర్ సీటింగ్‌తో పాటు లైవ్ ఐస్ క్రీమ్‌లు మరింతగా నచ్చుతాయి. మరికాస్త వయస్సు పైబడిన వాళ్లకు ఊగే ఊయల సరదా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ఈ సారి మీరు కూడా ఎప్పుడైనా గాజువాక వెళితే ఒక్కసారి ఈ ఫీలింగ్‌ను మీరు ఎక్స్పీరియన్స్ చేసిరండి. మీ పిల్లలు అయితే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
అడ్రస్: ప్రశాంతి నగర్, కణితి రోడ్, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530026.
ఫోన్ నంబర్: 9553844555
ఎలా వెళ్లాలి?
వైజాగ్ బస్టాండ్ నుంచి గాజువాక వెళ్లే 38,400,99 బస్సు ఎక్కితే చాలు.. గాజువాకలో దిగి అక్కడ నుండి ఆటోలో లేదా నడుచుకుంటూ అయినా వెళ్లొచ్చు.. 5 నిమిషాల్లో చేరుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Food, Local News, Visakhapatnam, Vizag