Setti Jagadeesh, News 18, Visakhapatnam
మనిషికి అత్యంత విశ్వాసమైన జంతువు కుక్క. గతంలో ఇంటికి కాపలాకు మాత్రమే శునకాలను పెంచుకునేవారు. కానీ ఇప్పుడు స్టేటస్ కోసం కూడా వాటిని పెంచి పోషిస్తున్నారు. దీంతో వీటిపై పెద్ద వ్యాపారమే నడుస్తోంది. దేశీయ రకాలతో పాటు ఫారెన్ డాగ్స్ కూడా మనోళ్లకు పెట్స్ గా మారుతున్నాయి. అంతేకాదు తమ పెట్ డాగ్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు యజమానులు. అంతేకాదు వాటికి అందాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో చిట్టిపొట్టి పప్పీలు తెగ ముద్దొస్తున్నాయి.. అందంగా కనిపిస్తూ చూపుతిప్పుకోకుండా ఆకర్షించే ముచ్చటైన జూలు విదేశీ వెరైటీ శునకాలు. ఒకే చోట అధిక సంఖ్యలో వున్న ఈ శునకాలు ఒక్కొక్కటీ ఒక్కో రకం. ఈ విభిన్న జాతులు శునకాలన్నీ కలిసి ఓ చోట ప్రదర్శన చేస్తే ఎలా ఉంటుందో మాటల్లోచెప్పగలమా? అయితే అటువంటి ప్రదర్శననుమీరే చూడండి..
దేశ , విదేశీ విభిన్న జాతుల డాగ్స్లతో ఎంజీఎం గ్రౌండ్ కోలాహలంగా మారింది. షో లో విభిన్న జాతుల శునకాలతో.. డాగ్‌షో వారేవా అని అనిపించింది. విశాఖ కెనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డాగ్ షో విశాఖ వాసులను ఆకట్టుకుంది. కెనాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, దక్షిణం నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి 40 జాతుల 200 శునకాలు ఈ షోలో పాల్గొన్నాయి. గోల్డెన్ రిట్రీవర్, బిగిల్, జర్మన్ షెపర్డ్, సెయింట్ బెర్నార్డ్ తదితర జాతుల శునకాల యజమానులు తమ శునకాలతో వచ్చి షోలో సందడి చేశారు. డాగ్ ట్రయినర్ అర వింద్ కి చెందిన అమెరికన్ కోకర్ స్పనియల్, రష్యా ట్రయినర్ జీన తెచ్చిన కోకర్ స్పనియల్ లు షోలోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. న్యాయనిర్ణేతలుగా వ్యవహరిం చిన శ్యామ మెహెతా, సంజిత్ మొహంతిలు 11 జాతి శునకాలను విజేతలుగా ఎంపిక చేశారు.
ఈ బహుమతి ప్రదానోత్సవానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరై విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కెనల్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.కృష్ణ, కోశాధికారి పి.నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Pet dog, Visakhapatnam