హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: విశాఖను వణికిస్తున్న వైరల్ జ్వరాలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న డాక్టర్లు..!

Vizag: విశాఖను వణికిస్తున్న వైరల్ జ్వరాలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న డాక్టర్లు..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

విశాఖను వదలని జ్వరాలు.. జనం ఇబ్బందులు

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

విశాఖ నగరంలో ఏదైనా ఎక్కవగానే ఉంటుంది. అటు చలికాలంలో చలి అయినా.. ఇటు వేసవిలో ఎండలు అయినా బాగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం చలికాలం కావడంతో... జనం ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధులతో నగర ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని అధిక ప్రాంతాల్లో ప్రతి ఇంట ఇద్దరు నుంచి ముగ్గురు వరకూ వీటి బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. విశాఖ నగరంలోని హైరిస్క్ ప్రాంతాలతో పాటు, మురికివాడ ప్రాంతాలు, ఇతర రద్దీగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలంతా ఒక్కసారిగా చలికాలం తీవ్రత అధికమవ్వడంతో ప్రతి ఒక్కరూ వీటిలో ఎదో ఒక సమస్యతో బాధపడుతున్నారు.

వాతావరణ మార్పులతో తరుచుగా జ్వరం, జలుబుతో ప్రజలు బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రజలంతా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యసేవలు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.సీజన్ మార్పుతో పెరిగే బ్యాక్టీరియా వల్ల వైరల్ జ్వరాల వ్యాప్తి చెందుతాయి. ఇవి గాలి,నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. వైరల్ ఫీవర్ 3 నుంచి 7 రోజుల వరకూ ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో పాటు, పెద్దవయస్సుల వారికి నగరంలో ఉష్ణోగ్రతల ప్రభావం, చలి తీవ్రత అధికంగా ఉండటంతో అధిక సంఖ్యలో సిటీ జనం జలబు, దగ్గు బారిన పడుతున్నారు.

అయితే కొంత మందిలో జ్వరలక్షణాలు ఒకటి,రెండు రోజులు మాత్రమే ఉండగా, మరి కొంత మందిలో మాత్రం జ్వరం తీవ్రత తగ్గినప్పటికి జలుబు, దగ్గు, నీరసం అధికంగా ఉంటుంది. ఇదే సమయంలో కేజీహెచ్‌తో పాటు, ప్రైవేట్ క్లినిక్ వద్దకూడా రోగుల రద్దీ

అధికంగా ఉంటుంది. విమ్స్, చెవి, ముక్కు, గొంతు ఆసుపత్రి, టీబీ ఆసుపత్రికి సైతం వెళ్లే వారి సంఖ్య పెరిగింది. అయితే సాధారణ రోజుల్లో వచ్చే రోగుల కంటే గత వారం రోజుల నుంచి అధిక సంఖ్యలో జ్వర బాధితులు రావడంతో ఓపీ సంఖ్య క్రమేపీ పెరిగింది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

చలికాలంతో చల్లటిగాలిలు తీవ్రతతో పాటు, మంచు కూడా అధికంగా ఉంది. దీంతో ఉదయం మార్నింగ్ వాక్ వేళ్లేవారితో పాటు, ఇతర ప్రాంతాల్లో తిరిగే వారు, వ్యాపారులు, ఉద్యోగస్తులు, విద్యార్ధులు తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు డాక్టర్లు. వేడివేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని, వేడినీటిని తాగాలని సూచిస్తున్నారు. జలుబు, జ్వరమే కదా అనే నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యలు సూచనలు, సలహాలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలిని వైద్యులు సూచిస్తున్నారు. నగరంలోచలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే ఆశా, ఎఎన్ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేపడుతున్నారు.

First published:

Tags: Local News, Visakhapatnam

ఉత్తమ కథలు